Madhya Pradesh Congress
-
మధ్యప్రదేశ్‌లో కూడా కర్ణాటక ఫార్ములానే నమ్ముకున్న కాంగ్రెస్
భోపాల్: కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అక్కడ ఆ పార్టీకి పట్టం కట్టాయి. అందుకే త్వరలో మధ్య ప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ పార్టీని మట్టి కరిపించేందుకు కర్ణాటక ఎన్నికల ఫార్ములానే అనుసరిస్తోంది. మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వ్యూహాలను రచిస్తోంది. కర్ణాటకలో తాము చేసిన హామీలకు ప్రజలు బ్రహ్మరధం పట్టడంతో అదే తరహాలో మధ్య ప్రదేశ్‌లో కూడా కొన్ని ఉచిత పథకాలను ప్రకటించింది. ఉచితాలను ప్రధానాస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ ప్రభుత్వ అవినీతిని కూడా లక్ష్యం చేసుకుని ప్రచారానికీ శ్రీకారం చుట్టనుంది. జూన్ 12న జబల్ పూర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కర్ణాటకలో మేము ప్రజలకు ఐదు గ్యారెంటీ పథకాలను హామీ ఇచ్చాము. అధికారంలోకి రాగానే మొదట ఆ అయిదింటినీ నెరవేర్చామని తెలిపారు. మధ్య ప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.1500, గ్యాస్ సిలిండర్ రూ.500కు, 100 యూనిట్ల ఉచిత కరెంటు, 200 యూనిట్ల వరకు సగం ధరకు, పాత పెన్షన్ స్కీమును మళ్ళీ అమలు చేస్తామని.. పేద రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామని ఐదు హామీలను ప్రకటించారు. ఎన్నికల ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికలకు ఇంఛార్జిగా వ్యవహరించిన రణదీప్ సూర్జేవాలాను మొదట ఇంఛార్జిగా నియమించింది. కర్ణాటక ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలును కూడా రంగంలోకి దించింది. కర్ణాటకలో అధికార పక్షంపై 40 శాతం కమీషన్ అంటూ విమర్శలు గుప్పించైనా కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రదేశ్ విషయానికి వచ్చేసరికి 50 శాతం కమీషన్ అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కుంభ మేళా, సింహస్త మేళా, మహాకాళీ దేవాలయ నిర్మాణంలోనూ యథేచ్ఛగా అవినీతి జరుగుతోందని ఆరోపణలు చేసి ప్రభుత్వ అవినితిని కూడా లక్ష్యం చేశారు. ప్రచారపర్వంలో కాంగ్రెస్ నేతల దూకుడుకి అడ్డుకట్ట వేస్తామని వారు అబద్ద ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఒక నకిలీ లేఖను ప్రజలకు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తోన్న ప్రియాంక గాంధీకి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు మధ్యప్రదేశ్ బీజేపీ అధినేత విడి శర్మ. సెంట్రల్ ఎలెక్షన్ కమిటీ సమావేశం పూర్తయి మొదటి విడతలో 39 అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ పార్టీ కూడా ఎన్నికల్లో దూకుడును పెంచింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చోహాన్ మాట్లాడుతూ సరైన సమయంలో మేము వారికి సమాధానమిస్తామని.. మా అభ్యర్ధులు అప్పుడే కదనరంగంలోకి దూకారని వారు మాత్రం అభ్యర్థులను ప్రకటించడానికి కూడా భయపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రదేశ్‌లో డివిజనల్ స్థాయి సమావేశాలను నిర్వహించనుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ కు చెందిన 230 మంది ఎమ్మెల్యేలు ఏడు రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. మరోపక్క బీజేపీ తొలివిడత జాబితాను ప్రకటించిన తర్వాత ప్రచారానికి ఊపు తీసుకురావడానికి కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ విషయంలో ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారు.. -
‘భారత్ జోడో యాత్రతో చచ్చిపోతున్నాం’.. మాజీ సీఎం వీడియో వైరల్
భోపాల్: కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టారు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఈ యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ సహా పలువురు రాష్ట్ర నేతలు యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కమల్‌నాథ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. జోడో యాత్రపై కమల్‌నాథ్ అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘గత వారం రోజులుగా మేం చచ్చిపోతున్నాం’ అని ఆయన అన్నట్లుగా వీడియో ఉంది. ఈ వీడియో ప్రకారం.. ప్రదీప్ మిశ్రా అనే పండింతుడితో కమల్‌నాథ్ మాట్లాడుతున్నారు. ‘గత ఏడు రోజులుగా మేం చచ్చిపోతున్నాం. దాంట్లో రెండు నిబంధనలుంటాయి. రోజూ ఉదయం 6 గంటలకే యాత్ర ప్రారంభించాలి. రోజుకు కనీసం 24 గంటలు నడవాలి. మధ్యప్రదేశ్‌లో యాత్ర కోసం రాహుల్ మూడు ప్రీ కండిషన్లు పెట్టారు. ఆదివాసీ వీరుడు తాంత్య భిల్ జన్మస్థలం, ఓంకారేశ్వర, మహంకాళీ ఆలయాలను సందర్శించాలని చెప్పారు.’అని కమల్‌నాథ్ పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ కావటంతో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ మంత్రి నరోత్తమ్ మిశ్రా. ‘కమల్‌నాథ్ జీ.. మీ వీడియో చూశాను. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. శారీరకంగా బలహీనంగా ఉన్నవారిని యాత్రలో పాల్గొనేలా రాహుల్ బలవంతపెట్టొద్దని ప్రార్థిస్తున్నా. మీ యాత్ర ఎవరికీ హాని కలగకుండా చూసుకోండి’అని విమర్శించారు. Bharat Jodo Yatra: कमल नाथ का वीडियो वायरल, बोले- हम तो सात दिन से मर रहे हैं https://t.co/UChv8Xf1mL#KamalNath #BharatJodoYatra #MadhyaPradesh #Naidunia pic.twitter.com/mOX1m9SZrR — NaiDunia (@Nai_Dunia) December 1, 2022 ఇదీ చదవండి: శశి థరూర్‌కు తప్పని చిక్కులు.. సునంద మృతి కేసులో కోర్టు నోటీసులు -
రసవత్తరంగా రాజ్యసభ పోరు
* మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌కు హైకోర్టులో ఊరట * యూపీలో బీఎస్పీ మద్దతుపై ఉత్కంఠ భోపాల్/జైపూర్/లక్నో: పలు రాష్ట్రాల్లో ఈనెల 11న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటేసేందుకు రాష్ట్ర హైకోర్టు అడ్డంకులు తొలగిస్తూ గురువారం తీర్పునిచ్చింది. ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రతిపక్ష నేత సత్యదేవ్ కటారేకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించాలంటూ ఈసీని జబల్పూర్ బెంచ్ ఆదేశించింది. అలాగే అత్యాచారం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మరో ఎమ్మెల్యే రమేష్ పటేల్‌కు ఇండోర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 57 మంది ఎమ్మెల్యేలుండగా ఒక్కరు తక్కువైనా రాజ్యసభ సీటును వదులుకోవాల్సిందే. యూపీలో మాయావతి మొగ్గు ఎటు? ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీకి 80 మంది ఎమ్మెల్యేలుండగా ఇద్దర్ని గెలిపించుకునే బలం ఉంది. ఒక్కో అభ్యర్థికి మొదటి ప్రాధాన్య ఓట్లు 34 వస్తే ఎంపీగా గెలవొచ్చు. ఈ లెక్కన బీఎస్పీ మరో 12 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు. ఆ 12 మంది ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేశారో ఫలితాలు వెలువడ్డాకే తెలుస్తుందని మాయావతి చెప్పారు. రాష్ట్రీయ లోక్‌దళ్‌కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌లకు మద్దతిస్తారని ఆ పార్టీ వెల్లడించింది. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ ఏడుగుర్ని బరిలో నిలపగా, ఏడో అభ్యర్థికి మొదటి ప్రాధాన్య ఓట్లలో 9 మంది ఎమ్మెల్యేల కొరత ఉంది. కాంగ్రెస్‌కు 29 మంది ఎమ్మెల్యేలుండగా అభ్యర్థిని గెలిపించుకోవాలంటే మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలుండడంతో ఆ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయం. రాజస్తాన్‌లో బీజేపీ శిబిరంలోకి: రాజస్థాన్‌లో నేషనల్ యూనియనిస్టు జమిందార్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరంలో చేరారు. ఎమ్మెల్యేలు కామిని జిందాల్, సోనా దేవీ బవ్రీలు బీజేపీకి మద్దతిస్తున్నారని సీఎం కార్యాలయం తెలిపింది. కాగా, కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు రావడంతో వాయిదా వేస్తారని భావించినా... షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహిస్తామని ఈసీ గురువారం ప్రకటించింది.