మధ్యప్రదేశ్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 160 కిలోమీటర్ల దూరంలోని ఖిర్కియా-హర్దా స్టేషన్ల మధ్య మాచక్ నదిపై బ్రిడ్జిని దాటుతూ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు అర్ధరాత్రి పట్టాలు తప్పి, రెండు రైళ్ల ఇంజన్లతో పాటు ఏకంగా పదికి పైగా బోగీలు నదిలోకి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 30 మంది మరణించగా, చాలామంది గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.