వడదెబ్బతో ఇద్దరు కూలీల మృతి
సూర్యుడు రోజురోజుకూ తన ప్రతాపాన్ని చూయిస్తున్నాడు. బుధవారం ఎండవేడికి తాళలేక వడదెబ్బతో ఇద్దరు ఉపాధిహామీ కూలీలు మృతిచెందారు. కర్నూలు జిల్లా హోలగుండ మండలం వందవాగిలి గ్రామంలో దేవమ్మ(35) అనే కూలీ మృతిచెందగా..మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం జూకల్కు గ్రామంలో మాగయ్య(55) అనే కూలీ వడదెబ్బతో చనిపోయారు.