మంగళగిరి డీఎస్పీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి డీఎస్పీ రామంజనేయులు, సీఐ బ్రహ్మయ్య, ఎస్ఐ బాలకృష్ణలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీ గేటు బయట దీక్షకు దిగిన పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించగా.. ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లిన తమ పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఎమ్మెల్యేలు చెప్పారు. తమ ఆత్మగౌరవానికి భంగం కలిగించారని తెలిపారు.
రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమామహేశ్వర రావులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం చెవిరెడ్డి దీక్షకు దిగారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి దాదాపు 6 గంటల పాటు నిర్బంధించారు. తర్వాత ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత చెవిరెడ్డిని విడుదల చేశారు.