నిందితుడికి టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆటోనగర్ ఆసోసియేషన్ ప్రెసిడెంట్ మాగంటి నాగభూషణం ఇంట్లో మంగళవారం ఉదయం వరకు తనిఖీలు కొనసాగుతున్నాయి. అధికారులు 240పైగా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆటోనగర్ ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని బాధితులు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనిఖీల్లో నాగభూషణం అక్రమాలు వెలుగుచూసినట్టు సమాచారం. కాగా నాగభూషణానికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఆయన ఇంటికి వచ్చారు. సోదాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి బుజ్జి, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అక్కడి చేరుకున్నారు. ఎమ్మెల్యేల ఒత్తిడితో పోలీసులు నాగభూషణాన్ని అరెస్ట్ చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.