జటాజూటేశ్వరుడిగా రుద్రేశ్వర స్వామి..
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామి వారికి మహా అన్నపూజ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ , వేదపండితులు మణికంఠశర్మ , అర్చకులు ఉదయం 5 గంటల నుంచి మూల మహా గణపతికి నవరస అభిషేకం చేశారు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు. మధ్యాహ్నం స్వామివారిని జటాజూటేశ్వరుడిగా అలంకరించి 51 కిలోల పెరుగు అన్నంతో అన్నసూక్త మంత్ర పఠనం చేశారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ సతీమణి రేవతి, హన్మకొండ సీఐ సంపత్‌రావు, చిరంజీవి అసోసియేషన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.