maha mandapam
-
దుర్గమ్మ ఆలయ హుండీ కానుకల ఆదాయం రూ.1.25 కోట్లు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ హుండీ కానుకల ఆదాయం రూ.1.25 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను బుధవారం మహా మండపంలో ఆలయ సిబ్బంది లెక్కించారు. 12 రోజులకు గాను, 29 హుండీల ద్వారా రూ.1,25,26,355, 278 గ్రాముల బంగారం, 3.230 కిలోల వెండి వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.98.56 లక్షలు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) దుర్గమ్మ హుండీలో రద్దయిన పెద్ద నోట్లు భారీగానే వచ్చి చేరాయి...రెండు రోజులుగా జరుగుతున్న హుండీల లెక్కింపులో దాదాపు రూ.1.08 కోట్ల మేర రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల రూపంలో వచ్చినవే..దుర్గమ్మకు భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను రెండో రోజైన గురువారం కూడా కొనసాగింది. మహా మండపంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రెండో రోజు 12 హుండీల ద్వారా రూ.98,56,970 నగదు లభ్యమైంది. రెండో రోజులలో అమ్మవారికి రూ.2,89,31,754 నగదు కానుకల రూపంలో లభ్యమయ్యాయి. రద్దయిన పెద్ద నోట్లే అధికం.... అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలలో అధిక మొత్తంలో రద్దయిన వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్ల రూపంలో లభ్యమయినవే. మొదటి రోజున రూ.500 నోట్లు 11,255, రూ. 1000 నోట్లు 2258 లభ్యమయ్యాయి. ఇక రెండో రోజున రూ.500 నోట్లు 4468, రూ.1000 నోట్లు 683 లభ్యమయ్యాయి. రూ.500 నోట్ల రూపంలో రూ.78,61,500, రూ.వెయ్యి నోట్ల రూపంలో రూ. 29.41 లక్షలు లభ్యం కావడంతో దాదాపు రూ.1.08 కోట్లు ఆదాయం వచ్చింది. వెండి ఎక్కువగానే.... దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన వెండి కూడా ఈదఫా రికార్డు నెలకొల్పింది. మొదటి రోజు 6.040 కిలోలు లభ్యం కాగా గురువారం 10.820 కిలోల వెండి వస్తువుల రూపంలో లభ్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు. హుండీల ఒకేసారి 16కిలోలకు పైగా వెండి లభ్యం కావడం ఇదే ప్రథమంగా తెలుస్తుంది. ఇక బంగారం 565, రెండో రోజున 820 లభ్యమైంది. -
నేడు దుర్గమ్మకు గాజుల అలంకరణ
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ మంగళవారం గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దుర్గమ్మ అంతరాలయంతో పాటు ఆలయ ప్రాంగణం, మహామండపంలోని ఆరో అంతస్తును గాజులతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 80వేల నుంచి లక్షమంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘాట్రోడ్డులోని పొంగలి షెడ్డు నుంచి ఉచిత దర్శనంతో పాటు రూ.300 టికెట్కు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. దర్శనానంతరం భక్తులు నేరుగా మహామండపంలోని ఆరో అంతస్తుకు చేరుకునేలా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. మహామండపం దిగువన ధనలక్ష్మీ యాగం ధన త్రయోదశిని పురస్కరించుకుని దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ధనలక్ష్మీ యాగానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈవో సూర్యకుమారి ఆదేశాలు జారీ చేశారు. దసరా ఉత్సవాల్లో సాంస్కృతిక వేదికను ఏర్పాటుచేసిన మహామండపం సమీపంలోని ఖాళీ స్థలంలో యాగశాలను నిర్మిస్తున్నారు. యాగశాలతో పాటు అర్చకులు, వేద పండితులు, ఉభయదాతలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆలయ ఇంజినీరింగ్ విభాగానికి ఈవో ఆదేశాలు జారీచేశారు. -
దసరా హుండీ ఆదాయం రూ.1.37 కోట్లు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాల్లో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, మొక్కుబడుల లెక్కింపు శుక్రవారం ప్రారంభమైంది. తొలి విడతగా ఆలయ ప్రాంగణంలోని క్లాత్ హుండీల ద్వారా వచ్చిన కానుకలను లెక్కించగా, 1,37,38,016 నగదు లభ్యమైంది. మొత్తం 80 మూటలతో కానుకలను మహామండపంలోని ఒకటో అంతస్తుకు తరలించి లెక్కించారు. లెక్కింపులో 270 గ్రాముల బంగారం, 4.400 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. శనివారం కూడా కానుకల లెక్కింపు జరుగుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.