ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్లకు 'మహారాజ' హోదా
మహారాష్ట్ర రాజధాని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి, అక్కడి సీఎస్టీ స్టేషన్కు 'మహారాజ' హోదా లభిస్తోంది. ఇక మీదట ఆ విమానాశ్రయాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పిలుస్తారు. చరిత్రాత్మక సీఎస్టీ రైల్వే స్టేషన్ను ఇకపై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అంటారు.
ఈ రెండు సంస్థలకు పేర్లు మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరాఠా వీరుడైన శివాజీకి మరింత గౌరవం ఇవ్వాలని, అందుకే కేవలం ఛత్రపతి శివాజీ అని వదిలేయకుండా మహారాజ అని తగలించాలని నిర్ణయించింది. మరో నెల రోజుల్లో బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పేర్ల మార్పు నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం.