breaking news
Mahavatar Narsimha
-
అన్ని సినిమాలు మహావతార్, సయారాలు కావుగా!: నిర్మాత
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.310 కోట్లు కొల్లగొట్టింది మహావతార్ నరసింహ మూవీ (Mahavatar Narsimha). అటు బాలీవుడ్లో కొత్తవారితో తీసిన సయారా చిత్రం ఏకంగా రూ.580 కోట్లు దాటేసింది. ఈ రెండు సినిమాలు ఎంత సెన్సేషన్ అయ్యాయో అందరికీ తెలిసిందే! అయతే కొత్తవారితో తీసిన ప్రతి సినిమా సయారాలా సెన్సేషన్ హిట్ అందుకోలేదంటున్నాడు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్.భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్.. ఎందుకు?తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. ఈ సినిమాను హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి కరణ్ జోహార్ (Karan Johar) విడుదల చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో కరణ్ జోహార్ పాల్గొన్నాడు. అక్కడ.. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అవడానికి పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం లేదా స్టార్స్ తీసుకుంటున్న రెమ్యునరేషన్.. ఏది కారణం? అని ఓ ప్రశ్న ఎదురైంది.ఎవర్నీ తప్పుపట్టలేంఅందుకు కరణ్ స్పందిస్తూ.. ప్రతి సినిమాకు దాని ఫలితం ముందే రాసిపెట్టి ఉంటుంది. పెద్ద హీరోలతో తీసిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా హిట్టయిన రోజులున్నాయి. కాకపోతే పరిస్థితులు సరిగా లేవు. అందుకే ఇప్పుడందరూ సినిమాను మరోసారి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మనం ఎవరినీ తప్పుపట్టలేము. అలాగే కొత్తవారితో పెద్ద సినిమా తీసినప్పుడు అవి సక్సెస్ అయిన రోజులున్నాయి, అలాగే ఫెయిలైన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేరు.దరిదాపుల్లోకి కూడా రాలేవ్సంగీతాన్ని ప్రధానంగా తీసుకుని వచ్చే ప్రతి సినిమా సయారాలా హిట్టవలేదు. యానిమనేషన్ సినిమాలు కూడా ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ మహావతార్ నరసింహకు దరిదాపుల్లోకి కూడా రాలేవు అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.చదవండి: సెంచరీలతో స్టార్ హీరో దూకుడు.. మరో హాఫ్ సెంచరీ! -
రూ. 40 కోట్ల బడ్జెట్..300 కలెక్షన్స్.. ఆస్తులన్నీ అమ్ముకున్నాం : డైరెక్టర్
పాన్ ఇండియా హీరోలు..స్టార్ డైరెక్టర్లు.. భారీ బడ్జెట్.. ఇవన్నీ ఉన్నా కూడా థియేటర్స్‌కి ప్రేక్షకులు రాలేకపోతున్న రోజులివి. స్టార్ హీరోల సినిమాలకు కూడా సూపర్ హిట్ టాక్ వస్తేనే కాస్తో కూస్తో జనాలు థియేటర్స్‌కి వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ యానిమేషన్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అదే ‘మహావతార్ నరసింహా’.బడా చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటే.. ఈ మూవీ మాత్రం ఐదు వారాలుగా థియేటర్స్‌లో సందడి చేస్తూనే ఉంది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా రికార్డుకెక్కింది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించాడు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, ఐదేళ్ల పాటు పడిన కష్టానికి ఫలితం దక్కిందని అంటున్నాను. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా తీసే క్రమంలో ఎదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.దేవుడిని నమ్మేవాడిని కాదు..మాది మహారాష్ట్ర. చదువుకునే రోజుల్లో దేవుడిని నమ్మేవాడిని కాదు. దేవుడే ఉంటే..కొందరికి కష్టాలు, కొందరికి సుఖాలు ఎందుకు ఇస్తాడని ప్రశ్నించేవాడిని. అయితే కొన్ని సమస్యలు, ఒత్తిళ్లు రావడంతో కృష్ణభక్తుడైన శ్రీలప్రభుపాద రచనలు, భగవద్గీతా చదివాను. దీంతో నేను కృష్ణ భక్తిడిగా మారిపోయా. అప్పుడే వీఎఫ్ఎక్స్ ఉపయోగించి త్రీడీలో ప్రహ్లాదుడు-నరసింహా స్వామి కథను తీయాలనుకున్నా. దాదాపు ఐదేళ్ల క్రితం మహావతార్ నరసింహ కథకి బీజం పడింది.ఆస్తులన్నీ అమ్ముకున్నాం.. ఈ సినిమా కోసం మా ఆస్తులన్నీ అమ్ముకున్నాం. మొదట్లో మా దగ్గర ఉన్న డబ్బుతో సినిమా తీద్దాం అనుకున్నాం. కానీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సంపాదించిదంతా కొన్నాళ్లకే అయిపోయింది. నా భార్య దగ్గర ఉన్న డబ్బులు కూడా ఈ సినిమాకే ఖర్చు చేశాం. బడ్జెట్ ఊహించనంత పెరిగిపోయింది. ఇన్వెస్టర్లను వెతికాం. కొంతమంది పెట్టుబడి పెడతామని చెప్పి చివర్లో హ్యాండిచ్చారు. అలా దాదాపు వంద మందికి పైగా నిర్మాతలను, ఇన్వెస్టర్లను కలిశాం. చివరకు నా భార్య నగలు, కారు, ఇష్టంగా కట్టుకున్న ఇళ్లు కూడా అమ్మేసి సినిమా నిర్మాణానికి ఖర్చు చేశాం.ఎవరు చూస్తారంటూ భయపెట్టారుసినిమా కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడింది. రోజుకు 16 గంటలు పని చేసేవాళ్లం. నెలాఖరు రాగానే టీమ్ జీతాల కోసం ఎక్కడ అప్పులు తేవాలని నా భార్య ఆలోచించేంది. ఇలా మా అవస్థలేవో మేం పడుతుంటే.. మరికొందరు ‘దేవుడి సినిమా ఇప్పుడు ఎవరు చూస్తారు? ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు.. సినిమా పోతే మీ పరిస్థితి ఏంటి? అని కొంతమంది భయపెట్టేవాళ్లు. కానీ నా భార్య, నేను ఒక్కటే అనుకున్నాం. ఒకవేళ సినిమా పోతే.. ‘అది మన ఖర్మ’ అనుకొని వదిలేసి.. గతంలో మాదిరి మళ్లీ వీఎఫ్ఎక్స్ పనులు చేసుకుందాం’ అని నిర్ణయించుకున్నాం. చాలా ఇబ్బందులు పడి జులై 25న ఈ చిత్రాన్ని విడుదల చేశాం. రూ.40 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం పది రోజుల్లోనే రూ. 100 కోట్లను వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు దాదాపు 300 కోట్ల వరకు రాబట్టింది. మా ఐదేళ్ల కష్టానికి ఫలితం దక్కింది. చాలా సంతోషంగా ఉంది’ అని అశ్వి కుమార్ అన్నారు. -
'మహావతార్ నరసింహ' కలెక్షన్స్.. దేశాన్ని ఏకం చేసిన గర్జన
'మహావతార్ నరసింహ' కలెక్షన్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. సినిమా రిలీజై ఆరు వారాలు పూర్తి అయినప్పటికీ కొన్నిచోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతుంది. దీంతో ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను పంచుకుంది.'మహావతార్ నరసింహ' చిత్రం రూ. 300 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరిపోయింది. ఇండియా బిగ్గెస్ట్ యానిమేటెడ్ చిత్రంగా నిలిచిందంటూ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ ప్రకటించింది. దేశాన్ని ఏకం చేసిన నరసింహ గర్జన అంటూ పేర్కొంది. శ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి అల్లు అరవింద్ విడుదల చేశారు. కేవలం తెలుగులోకే రూ. 47 కోట్ల నెట్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. The roar that united the nation 🦁🔥300 Cr+ Worldwide Gross & Counting… 💥India’s biggest animated blockbuster, #MahavatarNarsimha continues its legendary box office run into its 6th week!#Mahavatar @hombalefilms @AshwinKleem @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/swIBVl0y4x— Hombale Films (@hombalefilms) August 29, 2025 -
'మహావతార్ నరసింహ' బ్లాక్‌బస్టర్ ట్రైలర్ చూశారా..?
'మహావతార్ నరసింహ' సినిమా విడుదలై నెల కావస్తుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఇప్పటికే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ యానిమేషన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏకంగా రూ. 280 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. మూవీ భారీ విజయం అందుకోవడంతో తాజాగా మేకర్స్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ నిండిపోయాయి. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల విజయవంతంగా రన్ అవుతుంది. -
మహావతార్ నరసింహ అద్భుతాలు.. సెట్స్‌పైకి పరశురామ్
మహావతార్ నరసింహ.. వెండితెరపై ఇప్పటికీ అద్భుతాలు సృష్టిస్తూనే ఉంది. ప్రమోషన్లు లేవు, హైప్ లేదు, బడ్జెట్ కూడా తక్కువే.. అందులోనూ భారీ సినిమాలతో పోటీ.. అన్నింటినీ తట్టుకుని నిలబడింది. యానిమేషన్ మూవీ అయినా రికార్డులు భారీ కలెక్షన్లు రాబడుతూ రికార్డులు తిరగరాస్తోంది. జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ గతవారం క్రితమే రూ.200 కోట్ల మైలురాయిని దాటేసింది. హరిహర వీరమల్లు, కింగ్డమ్ చిత్రాల పోటీని తట్టుకుని బలంగా నిలబడింది.నవంబర్‌లో సెట్స్పైకిఇటీవలే రిలీజైన వార్ 2, కూలీ సినిమాల కాంపిటీషన్‌ను సైతం తట్టుకుని ఇంకా వెండితెరపై మ్యాజిక్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రదర్శకుడు తన నెక్స్ట్ మూవీని ప్రకటించాడు. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో శ్రీవిష్ణువు దశావతారాల ఆధారంగా సినిమాలు తెరకెక్కనున్నాయని గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే! అందులో భాగంగా తన రెండో సినిమా మహావతార్ పరశురామ్‌ను నవంబర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్తున్నట్లు ప్రకటించాడు. నాకంటూ క్లారిటీ ఉందివ్యవస్థ తప్పుదారిలో వెళ్తున్నప్పుడు దాన్ని సరిదిద్దేందుకు నిలబడ్డ హీరో పరశురామ్. ఇది చాలా శక్తివంతమైన కథ. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ కూడా మొదలైంది. నరసింహ సినిమా సక్సెస్‌తో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రజల ప్రేమను చూస్తుంటే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలనిపిస్తోంది. నాపై ఒత్తిడి ఉంది. కాకపోతే ఇంకా ఏడు సినిమాలు తీయాలన్న క్లారిటీ కూడా ఉంది. అయితే అన్నీ యానిమేషన్స్ తీయాలనుకోవడం లేదు. కనీసం రెండు చిత్రాలైనా లైవ్ యాక్షన్ ఫిలింస్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.పరశురామ్‌పై రెండు సినిమాలుఇదిలా ఉంటే పరశురామ జీవితకథపై హిందీలో మహావతార్ టైటిల్ పేరిట ఓ సినిమా తెరకెక్కుతోంది. ఛావాతో ప్రేక్షకుల్ని మెప్పించిన విక్కీ కౌశల్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ రెండు పరశురామ్ చిత్రాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద నెగ్గుతుందో చూడాలి! -
'మహావతార్ నరసింహ' సినిమాపై చాగంటి కోటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు
ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) తాజాగా 'మహావతార్ నరసింహ' చిత్రాన్ని చూశారు. ఎవరూ ఊహించని రీతిలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ యానిమేషన్ చిత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. ఆధ్యాత్మికత మార్గంలో యావత్ ప్రపంచాన్నే నడిపించే చాగంటి కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌తో పాటుగా చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.పురాణాలకు చాలా దగ్గరగానే 'మహావతార్ నరసింహ' చిత్రం ఉందని చాగంటి అన్నారు. భక్త ప్రహ్లాద వంటి సినిమా ఇప్పటికీ ప్రజల మదిలో ఉండిపోయింది. మనుషులతో కాకుండా కేవలం బొమ్మలతో సినిమా తీసినా నిజంగా నరసింహ అవతారాన్ని చూసిన అనుభూతి కలిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చివరి సన్నివేషం చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చని సూచించారు.శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి కూడా చాగంటి కోటేశ్వరరావుతో సినిమా చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని ఆయన పంచుకున్నారు. వారిద్దరూ కలిసి 'మహావతార్ నరసింహ' సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలిపిన వీడియోను గీతా ఆర్ట్స్ షోషల్‌మీడియాలో షేర్ చేసింది.జులై 25న విడుదలైన 'మహావతార్ నరసింహ' చిత్రాన్ని కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, ఇప్పటి వరకు ఈ మూవీ సుమారు రూ. 230 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా కన్నడలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా.. హోంబలే ఫిల్మ్స్‌తో కలిసి క్లీమ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.Chaganti Koteswara Rao garu and K.I. Vara Prasad Reddy garu share their thoughts on #MahavatarNarsimha, applauding the team for delivering a truly divine experience. Witness the divine saga at theatres near you. 🔥pic.twitter.com/qtHfd7XsJw— Geetha Arts (@GeethaArts) August 15, 2025 -
మరో హిస్టరీ క్రియేట్ చేసిన 'మహావతార నరసింహ'
రీసెంట్ టైంలో ఏ కొత్త సినిమా అయినా సరే వారం రోజులు నిలబడటమే గ్రేట్ అన్నట్లు తయారైంది. ఎందుకంటే స్టార్ హీరోల చిత్రాలు కూడా పట్టుమని పదిరోజులు ఆడట్లేదు. అలాంటిది ఓ యానిమేటెడ్ మూవీ.. రిలీజై రెండు వారాలు దాటిపోయినా సరే ఫుల్ జోరు చూపిస్తోంది. అవును ఇప్పటివరకు చెప్పింది 'మహావతార నరసింహ' గురించే. ఇప్పుడు ఈ చిత్రం మరో రికార్డ్ సృష్టించింది.సలార్, కేజీఎఫ్ నిర్మించిన హొంబలే సంస్థ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా 'మహావతార నరసింహ'. మనలో చాలామందికి తెలిసిన నరసింహా స్వామి కథతో ఈ చిత్రాన్ని పూర్తిగా వీఎఫ్ఎక్స్లో తీశారు. జూలై 25న పాన్ ఇండియా వైడ్ రిలీజైంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా థియేటర్లలోకి వచ్చింది గానీ తర్వాత మాత్రం రోజురోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది.(ఇదీ చదవండి: నా బలం, నా సర్వస్వం.. మహేశ్‌కి నమ్రత స్పెషల్ విషెస్)ఇప్పటివరకు 15 రోజులు కాగా ఏకంగా రూ.150 కోట్ల మేర వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సాధించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు బుక్ మై షోలో 3.6 మిలియన్ల టికెట్స్ అమ్ముడుపోయాయి. అలానే కన్నడ నుంచి ఓ యానిమేటెడ్ మూవీకి ఈ రేంజ్ వసూళ్లు రావడం ఇదే తొలిసారి. ఈ మేరకు హోంబలే సంస్థ ట్వీట్ కూడా చేసింది.ఒరిజినల్‌గా కన్నడ భాష నుంచే దీన్ని తెరకెక్కించినప్పటికీ కన్నడ, తమిళ, మలయాళంలో పెద్దగా వసూళ్లు రాలేదు. తెలుగు, హిందీ నుంచి మాత్రం దాదాపు కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనితోపాటు రిలీజైన 'హరిహర వీరమల్లు' ఇప్పటికీ సైలెంట్ అయిపోగా.. ఈ మూవీ వచ్చిన వారం తర్వాత రిలీజైన 'కింగ్డమ్' కూడా బాక్సాఫీస్ దగ్గర నెమ్మదించింది. 'కూలీ', 'వార్ 2' రిలీజైన తర్వాత ఈ మూవీ జోరు తగ్గుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: 'సు ఫ్రమ్ సో' రివ్యూ.. కన్నడలో బ్లాక్‌బస్టర్ మరి తెలుగులో?)Unleashing a divine blaze 🦁❤️🔥#MahavatarNarsimha races past 150 CRORES+ worldwide gross till Aug 8th, and continues setting screens on fire all over .Catch the divine phenomenon, running successfully in theatres near you.#Mahavatar @hombalefilms @AshwinKleem… pic.twitter.com/RBbuu8OULS— Hombale Films (@hombalefilms) August 9, 2025 -
నా సొంతిల్లు తాకట్టు పెట్టి సినిమా తీశా: మహావతార్ నరసింహా డైరెక్టర్
'మహావతార్ నరసింహ' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ యానిమేటేడ్ చిత్రం ఊహించని విధంగా ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరింది. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో సత్తా చాటుతోంది.మహావతార్ నరసింహ సూపర్ హిట్ కావడంతో డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లు తెలిపారు. నా జీవితంలో సంపాదించిదంతా ఈ సినిమా కోసం ఖర్చు చేశానని వెల్లడించారు. మా తల్లిదండ్రులతో పాటు నా భార్య తరఫున వారి ఆస్తులు కూడా తాకట్టు పెట్టానని అన్నారు. ఆఖరికి నా సొంత ఇల్లు కూడా తాకట్టు పెట్టి వడ్డీలు కట్టుకుంటూ ఈ సినిమా తీశానని అశ్విని కుమార్ షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు.కాగా.. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ హైదరాబాద్‌కు విచ్చేసిన డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఏఏఏ సినిమాస్‌లో మూవీని వీక్షించారు. ఆడియన్స్ నుంచి వస్తున్న ఆదరణ చూసి ఆనందం వ్యక్తం చేశారు.The roaring love from Hyderabad continues… 🦁❤️🔥Director @AshwinKleem visited AAA Cinemas & Mythri Vimal Theatre for #MahavatarNarsimha screening and witnessed a phenomenal response from the audience.#Mahavatar @hombalefilms @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/Ax6BMlbtHs— Hombale Films (@hombalefilms) August 5, 2025ఇల్లు తాకట్టు పెట్టి వడ్డీలు కట్టుకుంటూ సినిమా తీసా- Director #AshwinKumar #MahavatarNarsimha #TeluguFilmNagar pic.twitter.com/R34q2LsSLD— Telugu FilmNagar (@telugufilmnagar) August 5, 2025 -
'మహావతార్ నరసింహ' ఓటీటీ బిగ్ డీల్
'మహావతార్ నరసింహ' సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఎక్కడ చూసిన విజయవంతంగా రన్ అవుతుంది. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీ ఢీల్ గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సినిమా విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకపోవడంతో ఓటీటీ రైట్స్ ఎవరూ కొనుగొలు చేయలేదు. కానీ, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదుచేయడంతో ఓటీటీ సంస్థలు చాలా వరకు మహావతార్ నరసింహా సినిమా కోసం పోటీ పడుతున్నాయి.'మహావతార్ నరసింహ' ఓటీటీ రైట్స్ కోసం చాలా సంస్థలు పోటీ పడుతున్నప్పటికీ జియోహాట్‌స్టార్‌కు దక్కే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు బాలీవుడ్లో కథనాలు వచ్చాయి. ఈ చిత్ర నిర్మాణ సంస్థలతో ఉన్న పరిచయాలను బట్టి వారికే ఈ అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, సుమారు రూ. 50 కోట్లకు పైగానే ఈ ఢీల్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో తెలుగు, తమిళ్, కన్నడ వంటి రీజనల్ ఓటీటీ సంస్థలలో కూడా మహావతార్ నరసింహా స్ట్రీమింగ్కు రావచ్చని సమాచారం. దీంతో హాట్‌స్టార్‌కు మంచి లాభాలే రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో ఈ చిత్రం సత్తా చాటుతుంది. -
రూ. 100 కోట్ల క్లబ్లో 'మహావతార్ నరసింహ'
'మహావతార్ నరసింహ' సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఈమేరకు తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా ఈ యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళుతున్నారు. బుక్‌మైషోలో ఇప్పటికే 25 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి.'మహావతార్ నరసింహ' చిత్రం పదిరోజుల్లోనే రూ. 105 కోట్లు సాధించింది. భారత్‌లో విడుదలైన యానిమేషన్ చిత్రాలలో ఇదే అత్యధిక కలెక్షన్స్ కావడం విశేషం. ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్‌గా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. తెలుగులో గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజైంది.. ఈ సినిమాని విడుదల చేసేలా నరసింహ స్వామి అనుగ్రహించడం తన అదృష్టమని అల్లు అరవింద్ తెలిపారు. తెలుగులోనే ఏకంగా రూ. 20 కోట్లకు పైగా నెట్ రాబట్టినట్లు తెలుస్తోంది. హిందీలో రూ. 70 కోట్లకు పైగానే నెట్ కలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి.Roaring past records with divine force 🦁❤️🔥#MahavatarNarsimha crosses 105 CRORES+ GBOC India, setting the box office ablaze with unstoppable momentum.A divine phenomenon awaits you in cinemas.#Mahavatar @hombalefilms @AshwinKleem @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/LbEdQBZyjo— Hombale Films (@hombalefilms) August 4, 2025 -
మహావతార్ నరసింహ రిలీజ్ చేయడం నా అదృష్టం: అల్లు అరవింద్
‘‘హోంబలే ఫిలింస్ సంస్థ విజయ్‌గారు ఫోన్ చేసి, ‘మహావతార్ నరసింహ’ సినిమాని తెలుగులో విడుదల చేయాలని కోరగా, వెంటనే ఓకే అన్నాను. విడుదలైన రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళుతున్నాం. ఈ సినిమాని విడుదల చేసేలా నరసింహ స్వామి అనుగ్రహించడం నా అదృష్టం’’ అని అల్లు అరవింద్ తెలిపారు. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించిన చిత్రం ‘మహావతార్ నరసింహ’. ఈ సినిమా జూలై 25న విడుదలైంది.తెలుగులో గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఎప్పుడూ థియేటర్స్‌కి రాని ప్రేక్షకులు ఈ సినిమాని వీక్షిస్తున్నారు’’ అన్నారు. ‘‘ప్రస్తుత సమాజానికి ఏం కావాలో అది ఈ చిత్రంలో ఉంది. కుటుంబంతో కలిసి వెళ్లి ఈ సినిమాని చూడండి’’ అని పేర్కొన్నారు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. ‘‘ఈ చిత్రాన్ని నా కుటుంబంతో కలిసి చూశాను.సినిమా మొదలైన మూడో నిమిషం నుంచే మేము ఒక గుడిలో ఉన్నామనే భావన కలిగింది’’ అని తెలిపారు తనికెళ్ల భరణి. ‘‘మా సినిమాకు వచ్చిన ప్రతి ప్రశంస నరసింహ స్వామికే చెందుతుంది’’ అన్నారు అశ్విన్ కుమార్. ‘‘ఇది యావత్ భారత్ సినిమా. ఈ చిత్రం నిర్మించడం నరసింహ స్వామి కృపగా భావిస్తున్నాం’’ అని శిల్పా ధావన్ చెప్పారు. -
'మహావతార్ నరసింహా' సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మహావతార్ నరసింహ
-
'మహావతార్ నరసింహ' ఆల్‌టైమ్ రికార్డ్ .. కలెక్షన్స్ ఎంతంటే?
'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ఎలాంటి తారాగణం లేకుండానే విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డ్లను క్రియేట్ చేసింది. కలెక్షన్ల పరంగా ఇప్పుడు ఏకంగా ఇండియన్ ఆల్‌టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా జులై 25న విడుదలైన ఈ చిత్రం చాలాచోట్ల థియేటర్స్ కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. బుక్‌మైషోలో ఏకంగా ప్రతిరోజు రెండు లక్షలకు పైగా టికెట్లు తెగుతున్నాయి. క్లీమ్ ప్రొడక్షన్స్, ప్రఖ్యాత హోంబలే ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. తెలుగులో గీతా అర్ట్స్ నుంచి అల్లు అరవింద్ విడుదల చేశారు.దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన 'మహావతార్ నరసింహ' సినిమాను చూసేందుకు పిల్లలు నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులు వెళ్తున్నారు. దీంతో 8రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 60.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా మార్కెట్లో విడుదలైన అన్ని యానినేషన్ సినిమాల తాలూకా వసూళ్ల రికార్డులను మహావతార్ దాటేసింది. ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా యూఎస్ మార్కెట్లో కూడా ఇదే రేంజ్ ఓపెనింగ్స్ సాధించింది. ఏకంగా వన్ మిలియన్ క్లబ్లో కూడా చేరింది. ప్రపంవ్యాప్తంగా అన్ని భాషలలో ఇప్పటికీ అదే స్ట్రాంగ్ బుకింగ్స్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇది డివైన్ బ్లాక్‌బస్టర్ అని చిత్ర మేకర్స్ పేర్కొన్నారు.The divine roar has echoed across the nation 🦁#MahavatarNarsimha has roared past all records, grossing ₹60.5 CRORES+ in just 8 DAYS to become India’s Highest-Grossing Animated Film of All Time 💥💥#Mahavatar @hombalefilms @AshwinKleem @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/kAJNJRlPsY— Hombale Films (@hombalefilms) August 2, 2025 -
ఆ క్లబ్బులో చేరిన 'మహావతార్ నరసింహ'.. కలెక్షన్స్ ఎంతంటే?
ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ అద్భుతాలు సృష్టిస్తున్న చిత్రం మహావతార్ నరసింహ (Mahavatar Narsimha Movie). జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నిజానికి ఈ చిత్రం మొదటి రోజు కేవలం రూ.1.75 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. కానీ మౌత్ టాక్ బాగుండటంతో ఏరోజుకారోజు వసూళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పలుచోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. దీంతో వారం రోజుల్లోనే నరసింహ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.53 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మేరకు హోంబలే ఫిలింస్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది.నరసింహస్వామి కథపురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద- నరసింహస్వామి కథే మహావతార్: నరసింహ. ఈ యానిమేషన్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించింది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం అందించాడు. డైరెక్టర్ అశ్విన్ కుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ .. గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది.విష్ణు దశావతరాలుహోంబలే ఫిలింస్.. క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి పన్నెండేళ్ల ప్రణాళికతో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్ ప్రారంభించింది. శ్రీవిష్ణువు దశావతారాల ఆధారంగా ఈ యూనివర్స్‌లో సినిమాలు తెరకెక్కనున్నాయి. ఈ యూనివర్స్‌లో వచ్చిన తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయి, చైతన్య దేశాయి నిర్మించారు. రాబోయే సినిమాలు..ఈ చిత్రం 3డీ ఫార్మాట్లో ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2025లో నరసింహ (ఆల్రెడీ రిలీజైంది), 2027లో పరశురామ, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాధీశ్, 2033లో గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 ’ చిత్రాలను విడుదల చేస్తామని హోంబలే గతంలో వెల్లడించింది. 53 CRORES India GBOC and counting… 💥The unstoppable #MahavatarNarsimha continues to reign supreme at the box office.Witness the divine rage unfold on the big screen 🦁🔥#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan @AshwinKleem @SamCSmusic… pic.twitter.com/ZeV8LDDelc— Hombale Films (@hombalefilms) August 1, 2025చదవండి: ప్రియుడితో బిగ్‌బాస్ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఫోటోలు వైరల్ -
మహావతార్.. నరసింహపై కలెక్షన్ల వర్షం
-
అల్లు అరవింద్‌కు 'మహావతార్ నరసింహా' వరం
పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' వంటి పెద్ద సినిమానే ఒక యానిమేషన్ సినిమా వెనక్కు నెట్టేసింది. కేవలం ఒక్కరోజు గ్యాప్‌లో వచ్చిన 'మహావతార్ నరసింహా' చిత్రం తెలుగులో దుమ్మురేపుతుంది. బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ ఈ చిత్రం దూసుకుపోతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఈ చిత్రం ట్రెండ్ కనిపిస్తోంది. బుక్ మై షోలో ఏకంగా కేవలం తెలుగులోనే ప్రతి గంటకు పది వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అయితే, ఈ చిత్రాన్ని తెలుగు రైట్స్ కొనుగోలు చేసింది నిర్మాత అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి జులై 25న తెలుగులో విడుదల చేశారు. ఈ మూవీ ఆయనకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.'మహావతార్ నరసింహా' చిత్రం మొదటి రోజు కేవలం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలతో కలిపి రూ. 1.75 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. సినిమాకు మంచి టాక్ రావడంతో రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 22 కోట్ల నెట్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. గ్రాస్ పరంగా చూస్తే రూ. 31 కోట్లగా ఉండవచ్చని అంచనా.. అయితే, తెలుగులో 4రోజులకు గాను రూ. 8 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ప్రతిరోజు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఏకంగా వీరమల్లు చిత్రాన్ని తొలగించి 'మహావతార్ నరసింహా' చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో మరింత కలెక్షన్స్ పెరగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా పూర్తి రన్ అయ్యేసరికి తెలుగులోనే సుమారు రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టవచ్చని అంచనా ఉంది. అల్లు అరవింద్ గతంలో కూడా కాంతార, 2018 వంటి చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసి మంచి ఫలితాలను అందుకున్నారు. ఇప్పుడు ‘మహావతార నరసింహ’తో ఆయన జాక్‌పాట్ కొట్టారని నెటిజన్లు చెబుతున్నారు. -
'మహావతార్ నరసింహా' కలెక్షన్.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా
కొన్నిసార్లు చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. అలా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా యానిమేటెడ్ చిత్రాలు మన దగ్గర పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. కానీ ఈ మూవీ మాత్రం మౌత్ టాక్‌తో పాటు కళ్లు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా రూ.10 కోట్లకు పైన వసూళ్లు రావడం విశేషం.ఓవైపు 'హరిహర వీరమల్లు' లాంటి తెలుగు సినిమా పోటీ ఉన్నప్పటికీ.. 'మహావతార్ నరసింహా' స్క్రీన్ కౌంట్ పెంచుకుంటూ పోతోంది. తొలిరోజు కొన్ని థియేటర్లు దక్కగా.. రెండోరోజు, మూడో రోజుకి థియేటర్ల సంఖ్య పెరిగింది. అదే రీతిన వసూళ్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. తొలిరెండు రోజుల్లో కలిపి రూ.5 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. మూడో రోజైన ఆదివారం మాత్రం దేశవ్యాప్తంగా రూ.11.25 కోట్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)ఈ లెక్కన చూసుకుంటే మూడు రోజుల్లో కలిపి దాదాపు రూ.20 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని తెలుస్తోంది. కేజీఎఫ్, కాంతార, సలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ సినిమా 'మహావతార్ నరసింహా'. మనకు బాగా తెలిసిన విష్ణు అవతారాలు ఆధారంగా ఓ యూనివర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా రిలీజైన తొలి పార్ట్ ఇది. నరసింహా స్వామి అవతారం స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా అమితంగా నచ్చేస్తోంది.సాధారణంగా మన దగ్గర యానిమేటెడ్ మూవీస్ పెద్దగా వర్కౌట్ కావు. గతంలో 'హనుమాన్' తదితర చిత్రాలు వచ్చాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సరే వసూళ్లు రాబట్టుకోలేకపోయాయి. ఈ సినిమా మాత్రం కోట్ల రూపాయలు కలెక్షన్స్, అది కూడా పాన్ ఇండియా లెవల్లో అంటే విశేషమనే చెప్పాలి.(ఇదీ చదవండి: ఏంటమ్మా అన్నావ్, ఇంకోసారి అను.. అనసూయపై మళ్లీ ట్రోలింగ్!) -
'మహావతార్ నరసింహ' థియేటర్స్ హౌస్‌ఫుల్.. కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్ (ఎమ్.సి.యు) పేరుతో తొలి చిత్రంగా జులై 25న విడులైంది. క్లీమ్ ప్రొడక్షన్స్, ప్రఖ్యాత హోంబలే ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాలను పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. ఈ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద మెప్పిస్తుంది. చాలాచోట్ల థియేటర్స్ కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. అయతే, హరిహర వీరమల్లు వల్ల పెద్దగా ఈ చిత్రానికి థియేటర్స్ దొరకలేదు. కానీ, మొదటిరోజునే మంచి టాక్ రావడంతో మెల్లిగా బాక్సాఫీస్ వద్ద జోరందుకుంటుంది.యానిమేటెడ్ రూపంలో తెరకెక్కిన భారతీయ చిత్రాలకు ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారని సినిమా క్రిటిక్స్ చెబుతున్నారు. 'మహావతార్ నరసింహ' విడుదలైన మొదటిరోజు రూ. 1.75 కోట్ల నెట్ రాబట్టింది. రెండోరోజు రూ. 5.20 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే కలెక్షన్స్ గ్రాస్ పరంగా చూస్తే రూ. 10 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, నేడు ఆదివారం కావడంతో బుక్‌మైషోలో ఏకంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమాకు మంచి టాక్ రావడంతో రోజురోజుకు టికెట్లు తెగడం పెరుగుతుందని చెప్పవచ్చు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఫలితం ఎలా ఉంటుంది అన్న దానికి తాజా నిదర్శనం 'మహావతార్ నరసింహ'. నరసింహ స్వామి, భక్త ప్రహ్లాదుడు ఇతివృత్తాలతో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి కూడా. అదే ఇతిహాసంతో యానిమేషన్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే నమ్ముకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి జయ పూర్ణ దాస్ కథను, అశ్విన్ కుమార్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సీఎస్ శ్యామ్ సంగీతాన్ని, అందించిన ఈ భక్తి రస చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. శ్రీమహావిష్ణువు భక్తులను రక్షించడానికి ఎత్తిన అవతారాల్లో ఒకటి నరసింహ అవతారం. అలాంటి ఇతివృత్తంతో రూపొందిన చిత్రం మహావతార్ నరసింహ. ఇది పూర్తిగా యానిమేషన్లో రూపొందడం విశేషం. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) -
'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కొన్నాళ్ల క్రితం మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ మహావిష్ణువు దశావతారాలపై ఏడాదికో యానిమేటెడ్ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగా తొలి సినిమా 'మహావతార్: నరసింహ' నేడు(జులై 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ యూనిమేటెడ్ ఫిల్మ్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.'మహావతార్: నరసింహ' కథేంటంటే..పురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి కథ గురించి తెలిసిందే. విష్ణువు మూర్తి నరసింహ అవతారం(సగం మనిషి, సగం సింహం) ఎత్తి, భక్తుడైన ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. ఇదే కథను యానిమేషన్లో చూస్తే.. అదే మహావతార్: నరసింహ సినిమా.విశ్లేషణభక్త ప్రహ్లాద కథతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఎస్వీ రంగారావు, అంజలీదేవి, రోజా రమణి ప్రధాన పాత్రలు పోషించిన 'భక్త ప్రహ్లాద' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ప్రహ్లాద కథ దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి తెలిసింది. ఇలాంటి కథలు నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా'మహావతార్: నరసింహ'. కథనం మొత్తం యానిమేషన్‌తో నడుస్తుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు.కశ్యప మహాముని భార్య కడుపున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టడానికి గల కారణాలను వివరిస్తూ ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. మహా విష్ణువుపై ద్వేషం పెంచుకున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు..తమకున్న శక్తులతో దేవతలను సైతం భయబ్రాంతులకు గురిచేస్తారు. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు భూదేవికి అపహరించి సముద్ర గర్భంలో బంధిస్తాడు. దీంతో విష్ణు మూర్తి వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడు సంహరించి భూదేవిని తీసుకొస్తాడు. సోదరుడి మరణంతో విష్ణుపై హిరణ్యకశిపుడు మరింత పగను పెంచుకుంటాడు. తీవ్రమైన తప్పస్సు చేసి బ్రహ్మాదేవుడి నుంచి తనకు భూమి, అకాశం పైన,దేవతలతో గాని, పశువులతోగానీ, పగలు గానీ రాత్రి గానీ మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ శక్తులతో ఇంద్రలోకాన్ని సైతం తన ఆధీనంలోకి తెచ్చకుంటాడు. అతని కొడుకే ప్రహ్లాదుడు. పుట్టుకతోనే విష్ణుమూర్తి భక్తుడిగా మారతాడు. తండ్రికేమో విష్ణువు అంటే పడదు.. కొడుకుకేమో విష్ణుమూర్తే సర్వస్వం అన్నట్లుగా బతుకుతాడు. ఎంత నచ్చజెప్పిన విష్ణుమూర్తి పేరు తలచకుండా ఉండడు. చివరకు కొడుకునే సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి నరసింహా అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ కథలో ఉన్నాయి. దాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ చక్కగా వాడుకున్నాడు. భారీ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్‌తో అద్భుతంగా తీర్చిదిద్దాడు. క్లైమాక్స్‌లో నరసింహ స్వామి ఎంట్రీ ఇచ్చే సీన్ అదిరిపోతుంది.హిరణ్యకశిపుడితో నరసింహాస్వామి చేసే యాక్షన్ తెరపై చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. యానిమేటెడ్ సినిమా అయినా సరే కొన్ని యాక్షన్ సీన్లకు థియేటర్స్‌లో విజిల్స్ పడతాయి. యానిమేషన్ పర్ఫెక్ట్గా కుదిరింది. తెరపై చూస్తుంటే కమర్షియల్ సినిమా చూస్తున్నట్లే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది. సామ్ సీ.ఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. బీజీఎం అదిరిపోయింది. చిన్నపిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.