mahaveer jain
-
పాపులర్ కమెడియన్‌పై బయోపిక్.. అతనెవరంటే ?
Kapil Sharma Biopic Funkaar Will Soon Directed By Mrighdeep Singh: సినీ చిత్రసీమలో అనేక మంది ప్రముఖులపై అనేక బయోపిక్‌లు వస్తున్నాయి. మరికొన్ని రాబోతున్నాయి. స్టార్ హీరో హీరోయిన్లు, క్రికెట్ దిగ్గజాలు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ వంటివారిపైనై ఈ బయోపిక్‌లు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఒక కమెడియన్‌పై ఎలాంటి బయోపిక్ తీయలేదు. దీన్ని బ్రేక్ చేస్తూ ప్రముఖ కమెడియన్‌పై తాజాగా బయోపిక్ చిత్రం రానుంది. అతనెవరంటే మోస్ట్ పాపులర్ హిందీ కామెడీ టాక్ షో అయిన 'కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ' హోస్ట్ కపిల్ శర్మ. అవును కపిల్ శర్మపై బయోపిక్ త్వరలో రానుంది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు తన ట్విటర్ ద్వారా తెలిపాడు. కపిల్ శర్మపై వస్తోన్న ఈ బయోపిక్ చిత్రానికి 'ఫంకార్' అని టైటిల్ పెట్టారు. దీనికి మహావీర్ జైన్ నిర్మాతగా వ్యవహరించగా మృగ్ధీప్ సింగ్ లంబ దర్శకత్వం చేయనున్నారు. ఈయన గతంలో ఫుక్రే సినిమాను డైరెక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సమర్పించనుంది. 'కపిల్ శర్మ కోట్లాది మంది ప్రజలకు ప్రతిరోజు నవ్వులను పంచుతాడు. అలాంటి కపిల్ శర్మ గురించి మీకు తెలియని జీవిత కథను వెండితెరపై చూపెట్టబోతున్నాం' అని మహావీర్ జైన్ తెలిపారు. BIOPIC ON KAPIL SHARMA: 'FUKREY' DIRECTOR TO DIRECT... A biopic on #KapilSharma has been announced... Titled #Funkaar... #MrighdeepSinghLamba - director of #Fukrey franchise - will direct... Produced by #MahaveerJain [#LycaProductions]... #Subaskaran presents. #KapilSharmaBiopic pic.twitter.com/7LxhfKt4r6 — taran adarsh (@taran_adarsh) January 14, 2022 ఇదీ చదవండి: దేవుడి ప్రసాదం అని చెప్పి ట్రిక్ ప్లే చేశారు.. చివరిగా -
1,200 ఏళ్లనాటి జైన విగ్రహం మాయం వెనుక అసలు కథ
ధ్యానముద్రలో ఉన్న ఈ విగ్రహం జైన మహావీరుడిది. నల్ల గ్రానైట్‌తో నిగనిగ మెరిసిపోతున్న దీని వయస్సు 1,200 ఏళ్లు. ఇది పటాన్చెరు ప్రాంతంలోనిది. రాష్ట్రకూటుల కాలంలో ప్రతిష్టితమైంది. దీని ఎత్తు నాలుగున్నర అడుగులు. అయితే, ఈ విగ్రహం ఇటీవల ఉన్నట్టుండి మాయమైంది. అంతర్జాతీయ విపణిలో అత్యంత విలువైన ఈ విగ్రహం అదృశ్యమవడం ఇప్పుడు హెరిటేజ్ తెలంగాణలో అలజడి రేపుతోంది. సాక్షి, హైదరాబాద్: పటాన్చెరు రాష్ట్రకూటుల పాలనకు సంబంధించిన కీలక ప్రాంతం. అప్పట్లో ఈ ప్రాంతం జైనుల ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగానూ విలసిల్లింది. అయితే, ఇక్కడ పలు జైన కట్టడాలు ప్రస్తుతం జీర్ణావస్థలో దర్శనమిస్తున్నాయి. ధ్యానముద్రలో ఉన్న మహావీరుడి విగ్రహం రోడ్డు పక్కన ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. ఈ ప్రాంతం గుండా వెళ్లేవారు ఆసక్తితో తిలకిస్తూ ఉండేవారు. ఆలస్యంగా వెలుగులోకి.. గతంలో ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖలో పనిచేసి రిటైర్ అయిన ఈమని శివనాగిరెడ్డి తాజాగా ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆయన సర్వీసులో ఉన్న సమయంలో ఇక్కడి విగ్రహాలు, ఇతర కట్టడాలపై అధ్యయనం చేసి ఉన్నారు. దీంతో వాటిని చూడాలన్న ఆసక్తితో ఇటీవల పటాన్చెరు వెళ్లారు. అక్కడ జైనుడి విగ్రహం కనిపించలేదు. ఓ బుద్ధుడి విగ్రహం కనిపించింది. ధ్యానముద్రలో ఉన్న ఈ తథాగతుడి విగ్రహం ఏడాదిన్నర క్రితం పటాన్చెరులో ఏర్పాటైంది. స్థానికులను విచారించగా ఇటీవలి వరకు జైనవిగ్రహం రోడ్డు పక్కనే ఉండేదని, దాన్ని ఎవరు, ఎప్పుడు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదని పేర్కొన్నారు. ఆయన హెరిటేజ్ తెలంగాణ అధికారులను సంప్రదించగా తాము దాన్ని తరలించలేదన్నారు. గతంలో పటాన్చెరు నుంచి కొన్ని విగ్రహాలను తీసుకొచ్చి స్టేట్ మ్యూజియంలో భద్రపరిచారు. వాటిల్లోనూ ఈ విగ్రహం కనిపించలేదు. దాన్ని ఎవరు తరలించుకుపోయారో గుర్తిస్తామని హెరిటేజ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ చెప్పారు. చాలా ప్రాంతాల్లో జైన నిర్మాణాలు, విగ్రహాలు ఆలనాపాలనా లేక పడి ఉన్నాయి. విగ్రహాలను చూసి ఆవేదన చెందే కొందరు జైన భక్తులు వాటిని తాము పరిరక్షిస్తామని, ప్రదర్శనకు ఏర్పాటు చేస్తామని పురావస్తు శాఖను అప్పుడప్పుడూ సంప్రదిస్తుంటారు. కానీ, ఈ విగ్రహం విషయంలో ఎవరూ సంప్రదించలేదని అధికారులు చెబుతున్నారు. స్మగ్లర్ల చేతికి చిక్కద్దనే.. పురాతన కాలం నాటి రాతి విగ్రహాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. వాటిని కొందరు స్మగ్లర్లు విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అలాంటివారి చేతుల్లోకి వెళ్లకూడదన్న ఉద్దేశంతో ఎలాంటి పురాతన సంపద అయినా రాష్ట్రప్రభుత్వం ఆస్తిగా మాత్రమే ఉండాలనే నిబంధనను అధికారులు విధించారు. చట్టం ఏం చెబుతోంది.. రాష్ట్రంలోని ప్రతి పురాతన నిర్మాణం, విగ్రహం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిగా ఇటీవలే కొత్తగా అమలులోకి వచ్చిన తెలంగాణ హెరిటేజ్ చట్టం చెబుతోంది. భూమిలో పది సెంటీమీటర్ల లోపల దొరికే ప్రతి పురావస్తు వస్తువు, సంపద ప్రభుత్వానికే చెందుతుందని పేర్కొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో నిర్మాణాలు, విగ్రహాలున్నా.. కొన్నింటిని మాత్రమే రక్షిత కట్టడాలుగా గుర్తించి ప్రభుత్వం సంరక్షిస్తోంది. అయినా మిగతావాటిపై అజమాయిషీ మాత్రం ప్రభుత్వానిదే. ఎక్కడైనా విలువైన విగ్రహాలు, వస్తుసంపద వెలుగుచూస్తే స్థానికుల అనుమతితో వాటిని ప్రదర్శనశాలకు తరలిస్తారు. స్థానికులు ఒప్పుకోని పక్షంలో అక్కడే ఉంచి వాటి రక్షణకు చర్యలు తీసుకుంటారు. వాటికి భద్రత లేని పక్షంలో ఎవరైనా ముందుకొచ్చి సంరక్షణకు చర్యలు తీసుకుంటామంటే నిబంధనల ప్రకారం మాత్రమే వారికి అప్పగిస్తారు. కానీ పటాన్‌చెరులోని విగ్రహాన్ని ఎవరో హెరిటేజ్ తెలంగాణ శాఖ అధికారుల అనుమతి లేకుండా తరలించుకుపోయారని స్పష్టమవుతోంది. జైన వర్గానికి చెందిన వారు తీసుకెళ్లి సంరక్షిస్తున్నా.. .అనుమతి లేకుండా తీసుకుపోవటం మాత్రం నిబంధనలకు విరుద్ధమేనని అధికారులు చెబుతున్నారు. కానీ విగ్రహం ఎక్కడుందనే విషయంలో మాత్రం సమాచారం లేక వారు దాన్ని వెదికే పనిలో పడ్డారు. -
శశి థరూర్‌కు చేదు అనుభవం
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ట్విటర్లో చేదు అనుభవం ఎదురైంది. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. గురువారం మహవీర్ జయంతి సందర్భంగా జైనులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బుద్దుని ఫొటో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆయన తప్పును ఎత్తిచూపారు. ‘థ్యాంకూ శశీ జీ.. కానీ మీరు మహవీర్ ఫొటోకు బదులు బుద్ధ భగవాన్ ఫొటో పెట్టారు’ అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘జైనిజం, బుద్దిజం రెండు వేర్వేరు మతాలు’ అని మీకు తెలుసనుకుంటా అని మరొకరు చమత్కరించారు. ‘అందరూ మేధావిగా భావించే మీరు ఎంత పెద్ద పాపం ఎలా చేశారు. అయినా మనిషి అన్నాక తప్పు చేయడం సహజం మీరు కూడా మనిషేగా’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. దీనిని గమనించిన శశి థరూర్ తాను తప్పు చేయనని, చేసినా ఒప్పుకుంటానని, సాక్ష్యాలు కూడా దాచిపెట్టనని.. నిజాయితీగా ఉండటమే అన్నిటికన్నా ముఖ్యమని ట్వీట్ చేశారు. ఫొటో లింక్ షేర్ చేసి ‘నాలాగే చాలా మంది పొరపాటు చేసి ఉంటారు. నా కారణంగానైనా ఇది వెలుగులోకి వచ్చిందంటూ తన పొరపాటును సమర్థించుకున్నారు. అంతేకాకుండా ఈ పొరపాటు చేసిన వారందరినీ ట్యాగ్ చేస్తూ.. మహవీర్‌కు బదులు బుద్ధుని ఫొటోను పెట్టిన క్లబ్‌లోకి మీకు స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ కూడా థరూర్లాగే బుద్ధుని ఫొటో పోస్ట్ చేశారు. pic.twitter.com/DP6hT70AJh — Shashi Tharoor (@ShashiTharoor) March 29, 2018 -
నకిలీ కొబ్బరినూనె తయారీ కేంద్రంపై దాడి
మలక్‌పేట: నకిలీ కొబ్బరినూనె తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మలక్‌పేట ఏసీపీ సుధాకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..రాజస్థాన్ కు చెందిన మహావీర్ జైన్34) నగరానికి వలస వచ్చి చైతన్యపురి ఫణిగిరి కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతను జీడిమెట్లలోని ఐరన్ కంపెనీలో లేబర్‌గా, ఆ తరువాత ఢిల్లీనలోని ఓ ఫినాయిల్ కంపెనీలో పని కుదిరి కిరాణ వస్తువులను మార్కెటింగ్ చేయడంలో అనుభవం సంపాదించాడు. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో 2016లో నగరానికి వచ్చి చైతన్యపురిలో మకాం పెట్డాడు. గతనెలలో సలీంనగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ’మరికో లిమిటెడ్’ పేరుతో కల్తీ కొబ్బరి నూనె తయారు చేసేవాడు, బేగంబజార్, సికింద్రాబాద్ ప్రాంతాలనుంచి నాసిరకం కొబ్బరినూనె తీసుకొచ్చి ప్యారచూట్ కంపెనీ డబ్బాలలో నింపి తక్కువ ధరకు పాతబస్తీ, నగరశివారు ప్రాంతాల్లోని దుకాణాలకు సరఫరా చేసేవాడు. ప్యారాచూట్ కంపెనీ ప్రతినిధి సదానందం ఫిర్యాదు మేరకు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అతడి స్థావరంపై దాడులు నిర్వహించి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు . ఈ సందర్భంగా రూ. 3 లక్షల విలువైన నకిలీ కొబ్బరి నూనె (750 లీటర్లు), ప్యారచూట్ ఆయిల్‌డబ్బాలు, ఫిల్లింగ్ మిషన్, వెయిటింగ్ మిషన్, కంపెనీ లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఏడుకొండలు కేసును దర్యాప్తు చేస్తున్నారు.