సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ట్విటర్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. గురువారం మహవీర్ జయంతి సందర్భంగా జైనులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బుద్దుని ఫొటో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆయన తప్పును ఎత్తిచూపారు. ‘థ్యాంకూ శశీ జీ.. కానీ మీరు మహవీర్ ఫొటోకు బదులు బుద్ధ భగవాన్ ఫొటో పెట్టారు’ అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘జైనిజం, బుద్దిజం రెండు వేర్వేరు మతాలు’ అని మీకు తెలుసనుకుంటా అని మరొకరు చమత్కరించారు. ‘అందరూ మేధావిగా భావించే మీరు ఎంత పెద్ద పాపం ఎలా చేశారు. అయినా మనిషి అన్నాక తప్పు చేయడం సహజం మీరు కూడా మనిషేగా’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
దీనిని గమనించిన శశి థరూర్ తాను తప్పు చేయనని, చేసినా ఒప్పుకుంటానని, సాక్ష్యాలు కూడా దాచిపెట్టనని.. నిజాయితీగా ఉండటమే అన్నిటికన్నా ముఖ్యమని ట్వీట్ చేశారు. ఫొటో లింక్ షేర్ చేసి ‘నాలాగే చాలా మంది పొరపాటు చేసి ఉంటారు. నా కారణంగానైనా ఇది వెలుగులోకి వచ్చిందంటూ తన పొరపాటును సమర్థించుకున్నారు. అంతేకాకుండా ఈ పొరపాటు చేసిన వారందరినీ ట్యాగ్ చేస్తూ.. మహవీర్‌కు బదులు బుద్ధుని ఫొటోను పెట్టిన క్లబ్‌లోకి మీకు స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ కూడా థరూర్‌లాగే బుద్ధుని ఫొటో పోస్ట్ చేశారు.
— Shashi Tharoor (@ShashiTharoor) March 29, 2018
Comments
Please login to add a commentAdd a comment