Mahavira Jayanti
-
నేడు మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: మహావీర్ జయంతి సందర్భంగా నేడు(సోమవారం) దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి రేపు (మంగళవారం, ఏప్రిల్ 7)ఉదయం 9.15కు ప్రారంభమవుతుంది. అలాగే బులియన్, మెటల్ తదితర హోల్‌సేల్ కమోడిటీ మార్కెట్లకూ నేడు పనిచేయవు. కమోడిటీ ఫ్యూచర్స్‌లో సైతం ట్రేడింగ్‌ను అనుమతించరు. ఇక ఫారెక్స్ మార్కెట్లకు కూడా నేడు మహావీర్ జయంతి సందర్భంగా సెలవుకాగా.. గత వారం సైతం రెండు రోజులపాటు పనిచేయలేదు. ఏప్రిల్ 1(బుధవారం) ఖాతాల వార్షిక(2019-20) ముగింపు రోజు సందర్భంగా ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. మరుసటి రోజు గురువారం శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని సెలవు ప్రకటించారు. కాగా వారాంతంలో (శుక్రవారం) దేశీ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 674 పాయింట్లు పతనమై 27,591 వద్ద, నిఫ్టీ 170 పాయింట్లు క్షీణించి 8,084 వద్ద స్థిరపడింది. తద్వారా కీలక సూచీలురెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు దిగువన ముగిసిన సంగతి విదితమే. -
నేడు మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు నేడు సెలవు. మహావీర్ జయంతి సందర్భంగా బుదవారం ఏప్రిల్ 17న అన్ని ప్రధాన మార్కెట్లు పనిచేయవు. దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు, ఫారెక్స్, బులియన్‌తో పాటు, ఇతర కెమోడిటీ మార్కెట్లకు ఈ రోజు సెలవు దినంగా ప్రకటించాయి. -
ఘనంగా మహావీర్ జయంతి వేడుకలు
బళ్లారి నగరంలోని మహావీర జయంతిని పురష్కరించుకుని ఆయా జైనుల ఆలయాలలో మహావీర్ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం తేరువీధిలోని జైనుల ఆలయంలో జైనులు, మార్వాడీలు మహావీర్ విగ్రహానికి వివిధ ధార్మిక పూజలు నిర్వహించారు. అలాగే కౌల్‌బజార్‌లోని జైనుల ఆలయం, సత్యానారాయణపేట్ జైనుల ఆలయం, మోతీ సర్కిల్ జైనుల మార్కెట్లో తదితర జైనుల ఆలయాలలో మహావీర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక సంఘం సంస్థల నేతలు కూడా జైనుల చిత్రపటాన్ని ఉంచి పూజలు నిర్వహించి మహావీరుని తత్వాలు, సిద్ధాంతాలు, శాంతి సందేశాలను వివరించి మహావీర్ విగ్రహాన్ని నగర పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. బళ్లారి అర్బన్: