చట్ట సభల్లో హాజరీ బాగోతం
విశ్లేషణ
అత్యంత కీలకమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు కూడా పార్టీలతో పనిలేకుండా మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 మంది సభ్యులలో హాజరైనవారు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంటారు.
ఎంత అనివార్యమైనా కావచ్చు... శాసన సంబం ధ వ్యవహారాలను అడ్డగిం చడానికి పార్లమెంట్ కార్య క్రమాలను విచ్ఛిన్నపర్చ డంలో భారతీయ జనతా పార్టీ గతంలో అనుసరిం చిన మార్గాలను అధిగ మించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. యూపీఏ 2కి నేతృత్వం వహిస్తున్న కాలంలో కాంగ్రెస్ చెప్పినదాన్నే ఇప్పుడు పాలక బీజేపీ మరింత గట్టిగా ప్రతిధ్వనించడం అనేది వినో దానికి తక్కువ, ప్రజాగ్రహానికి ఎక్కువలాగా తయా రైంది. ఇదెలా ఉందంటే రెండు ప్రధాన పార్టీలు సంవత్సరాలుగా, తమ పార్లమెంటరీ విధులను నెరవేర్చకుండానే ఎన్నికకావటం అనే వినూత్న కళను సంవత్సరాలుగా మెరుగుపరుస్తూ వస్తున్న ట్లుంది.
రాష్ట్రాల శాసనసభలతోపాటు దేశ చట్టసభ ల్లోని సభ్యులు చర్చ, వాదన, అసమ్మతి తెలుపడం, ఓటింగ్‌లో పాల్గొనడం, తదుపరి కార్యక్రమాలను చేపట్టడం వంటి విషయాల్లో అసాధారణ ప్రవర్త నతో వ్యవహరించడానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క ఘటనను కూడా ప్రదర్శించలేదనే చెప్పాలి. రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతిలో ప్రభుత్వాన్ని పడ గొట్టడం చేతకానప్పుడు వేరేమార్గంగా చట్టవిరుద్ధ నడవడికను చేపడుతున్నట్లుగా ఉంది. దీంతో సభా వ్యవహారాలను నడిపే ప్రిసైడింగ్ అధికారులు.. కల హిస్తున్న పార్టీలలో వివేచనను, నిగ్రహాన్ని నెలకొల్ప లేకపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర శాసనసభ ప్రస్తు తం పూర్తిగా ఒక కొత్త కొలమానాన్ని ప్రతిపాదిస్తోం ది. బహుశా దేశ చరిత్రలోనే ఎవరూ ఇంతవరకూ దీన్ని విని ఉండకపోవచ్చు. శాసనసభలో తన సభ్యు ల హాజరీని రోజుకు మూడుసార్లు పరిశీలించి సభ జరుగుతున్నప్పుడు గైర్హాజర్ అయిన సభ్యుల గురించిన నివేదికను పార్టీ కేంద్ర, రాష్ట్ర అధ్యక్షులకు నివేదించే ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. సభ్యులు తమ వ్యవహార శైలిని మెరుగుపర్చుకు నేలా చేయడమే దీని లక్ష్యం. మహారాష్ట్ర అసెంబ్లీలో అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులలో సగం మందిపైగా తొలిసారి ఎన్నికైన వారే.
వీరికి ప్రారంభ కోర్సును నిర్వహించారు. సభా సెషన్లలో కార్యక్రమాలు ఎలా జరుగుతాయో విశదీక రించారు. క్రమం తప్పకుండా సభకు హాజరు కావా లని, ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, కాల్ అటెన్షన్ తీర్మానాలు, ప్రైవేట్ సభ్యుల బిల్లు వగైరా వివిధ ఉపకరణాలను ఉపయోగించడంలో కొంత అనుభ వం ఉన్న సీనియర్ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు ను పరిశీలించాలని తొలిసారి సభకు వచ్చిన ఎమ్మె ల్యేలకు బోధించారు. దురదృష్టవశాత్తూ ఈ సల హాలు, బోధనలన్నీ తామరాకుపై నీటి చందంలా నీరుగారిపోయాయి. దీన్ని ఎవరో ఒక నేత గుర్తిం చారు. వెంటనే పార్టీ విప్ అమలులోకి వచ్చింది. ఇది బహుశా మరొక అప్రకటిత కారణం కావచ్చు.
ప్రభుత్వంలో భాగమైనప్పటికీ బీజేపీకి సం బంధించినంతవరకూ శివసేన ఒక నమ్మలేని పార్టీ గానే ఉంది. బీజేపీతో సభలోనూ, సభ వెలుపల కూడా అది చావగొట్టి మళ్లీ చల్లబర్చే రకం సంబం ధాన్ని కొనసాగిస్తోంది. తనకంటే స్థాయిలో చిన్న దైనప్పటికీ, దూకుడుగా ఉన్న పార్టీకి తలొగ్గాల్సిరావ డం జాతీయ పార్టీకి పెద్ద చిక్కుగా మారింది. ఉన్న ట్లుండి చీలిక ఏర్పడినట్లయితే శివసేనను నమ్ముకో వచ్చా అనే అంశంలో బీజేపీకి హామీ లభించడం లేదు. ఇది తీవ్రమైన పరిణామాలను కొని తెస్తుంది.
శివసేన ఎమ్మెల్యేలు పార్టీ గుర్తింపుతో నిమిత్తం లేకుండా క్రమం తప్పకుండా సభకు.. ప్రత్యేకించి అసెంబ్లీకి హాజరుకావటంలో, రిజిస్టర్లో సంతకం పెట్టడంలో, కొద్ది క్షణాలు లేదా నిమిషాలు సభలో గడిపి తర్వాత ఇతర కార్యక్రమాలకు వెళ్లిపోవడంలో అసాధారణ ఉదాహరణలుగా నిలుస్తుంటారు. ఇది అందరి విషయంలో సాధ్యమయ్యేది కాదు. నియో జకవర్గానికి సంబంధించిన పనిగా లాబీ చేసే ధోరణి కనబడుతుంది కాని ఇది అంతకంటే ఎక్కు వే. ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నప్పుడు ఎమ్మెల్యే హాస్టల్స్‌లో కానీ, వెలుపల కానీ స్వప్రయోజనాలు ఆశించి వచ్చిన వారందరూ చుట్టూ ఉంటారని ఎవ రైనా బెట్ కట్టొచ్చు.
ప్రశ్నోత్తరాల సమయం తర్వాత శాసన సభ్యు ల హాజరు పలుచబడిపోవడం ఎక్కువగా లేదా తక్కువగా ఒక రివాజులా మారిపోయింది. తమ శాఖకు సంబంధించిన వ్యవహారాలు పూర్తికాగానే మంత్రులు సైతం సభనుంచి వెళ్లిపోతుంటారు. ముఖ్యమైన వ్యవహారంపై ఉదాహరణకు అత్యంత కీలకమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు కూడా పార్టీలతో పనిలేకుండా మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 మంది సభ్యులలో హాజరైనవారు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంటారు. ఒక చర్చా విభాగంలో వారి ఓటుకు అంత విలువలేదని వీరి నమ్మకం కావ చ్చు. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను ఎన్నుకునేటప్పుడు లేదా వాయిదా తీర్మానాన్ని లేక అవిశ్వాస తీర్మా నాన్ని ప్రతిపాదించేటప్పుడు మాత్రమే తాము హాజ రు కావలసి ఉంటుందని వారు భావిస్తుండవచ్చు.
బడ్జెట్ సమర్పణ, గవర్నర్ ప్రసంగం సమ యంలో మాత్రమే అసెంబ్లీ హాలు నిండిపోతుంది. కొన్ని సమయాల్లో కోరంకు సంబంధించిన సమ స్యపై విధివిధానాలు సవాలు చేయకుండా ఆ రోజు ను ఎలాగోలా నిర్వహిస్తే ఆ ప్రిసైడింగ్ అధికారి చాలా అదృష్టవంతుడే అని చెప్పాలి. పేదలకు అంటే ఉపాధి హామీ పథకం వంటి అంశాలపై చర్చ జరు గుతున్నప్పుడు కోరంకు సరిపడ సభ్యులు మాత్రమే ఉండే సందర్భాలు కూడా ఉండటం నాకు గుర్తుంది. శాసన సభ్యులు కేవలం తమ తమ సొంత ప్రయోజ నాలను మాత్రమే కలిగి ఉన్నారా అని నాకు ఆశ్చ ర్యం వేసేది.
బీజేపీ మాత్రమే తన పార్టీ లెజిస్లేచర్ల హాజరీని పరిశీలించడం లేదు. కాంగ్రెస్ కూడా ఈ పనిచే స్తోంది. ఎందుకంటే కేవలం 42 మంది ఎమ్మెల్యే లను మాత్రమే కలిగి ఉన్న ఈ పార్టీ సభ్యుల హాజరీ పేలవంగా ఉంటే సభలో అది మరీ పలుచనగా కని పిస్తుంది. ఒక సభ్యుడిని తక్కువగా కలిగిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కంటే దూకుడును కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దీంతో ఎన్సీపీ తన సభ్యులు క్రమం తప్పకుండా పూర్తిగా శాసనసభకు హాజరయ్యేలా చూసుకోవలసి వస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో సంఖ్యాపరంగా మూడో, నాలుగో స్థానంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలు కౌన్సిల్ హాల్ వెలుపలి మెట్లమీద నిరసన తెలుపడానికైనా తగి నంత మంది సభ్యులను కలిగి ఉండాలి. మరి అక్కడ ఫొటోగ్రాఫర్లు కూడా ఉంటారాయె.
మహేశ్ విజాపుర్కార్
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)
ఈమెయిల్: mvijapurkar@gmail.com.