Mahit Narayan
-
సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాలే.. ఇప్పుడదే మూవీ హౌస్‌ఫుల్!
చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే! తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను, అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ తీసిన చిత్రమే “రాజ్ కహానీ”. భార్గవి క్రియేషన్స్ పతాకంపై రాజ్ కార్తికేన్, చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి నటీనటులుగా రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్చి 24న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ.. 'చిన్న సినిమా అయినా కథలో మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమా హిట్ అవుతుంది. అలాంటి మంచి కంటెంట్ తో వచ్చిన ఈ రాజ్ కహాని సినిమాను మనమందరం ప్రోత్సహించి బిగ్ హిట్ చెయ్యాలి. ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహిస్తే ఇంకా మంచి చిత్రాలు తీస్తారు' అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమా తీశాడు. కరీంనగర్ లోని తిరుమల థియేటర్ లో వరుసగా ఏడవ రోజు కూడా హౌస్ ఫుల్‌గా రన్ అవ్వడం చాలా మంచి విషయం. ఇలాగే వీరు ముందు ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు. చిత్ర దర్శకులు, హీరో రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ.. 'మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన నేను నా చిన్నప్పుడు సినిమా చూడడానికే ఎంతో ఇబ్బంది పడేవాన్ని. గత రెండు సంవత్సరాలుగా ఎంతోమంది నిర్మాతలకు ఈ కథ వినిపించా. ఎవరూ తీయడానికి ముందుకు రాలేదు. చివరకు నేనే ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ తో సినిమా స్టార్ట్ చేశాము. కానీ కొంత కాలానికి కరోనా రావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించాం. మా సినిమాను పెద్దలకు ప్రివ్యూ వేయడంతో సినిమా చాలా బాగుందని అనడంతో ఎంతో ధైర్యం వచ్చింది. ఈ సినిమాను విడుదల చేసే స్థోమత లేకున్నా ఓన్ గా సినిమా రిలీజ్ చేశాము' అన్నారు. -
చక్రి అన్న మరణంపై ఇప్పటికీ అనుమానం.. పోస్ట్‌మార్టమ్ చేయనివ్వలేదు
సంగీతమే ప్రాణంగా బతికిన వ్యక్తి చక్రి. పూరీ జగన్నాధ్ బచ్చి సినిమాతో సంగీత దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన ఆయన దాదాపు 85 సినిమాలకు పని చేశారు. సింహా సినిమాకు గానూ నంది అవార్డు అందుకున్నారు. మాస్ మహారాజ రవితేజకు క్లాస్‌తో పాటు మాస్ సంగీతాన్ని అందించారు. రవితేజ చేసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్, కృష్ణ, భగీరథ, నేనింతే, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాలకు చక్రియే సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. శివమణి, దేవదాసు, దేశముదురు, ఢీ వంటి ఎన్నో చిత్రాలు విజయవంతం కావడంలో పాలు పంచుకున్నారు. ఊబకాయ సమస్యతో బాధపడిన చక్రి 2014 డిసెంబర్ 15న నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. చక్రి సోదరుడు మహతి నారాయణ్ సైతం ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. తాజాగా ఆయన చక్రి మరణం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'మ్యూజిక్ ఫీల్డ్‌లోకి రావద్దనుకున్నాను. కానీ చక్రి అన్నయ్య.. నెక్స్ట్ జెనరేషన్‌కు నా వారసులు ఉండొద్దా? అనేవాడు. తన ఇన్ఫ్లూయెన్స్ నా మీద పడకూడదనేవాడు. చివరకు ఆయన వెళ్లిపోయి నన్ను వారసుడిని చేస్తాడనుకోలేదు. అలాంటి వారసత్వం ఇచ్చినప్పుడు నేను ఎంతో కష్టపడాలి. ఇంకా చాలా సాధించాలి. అన్నయ్య మరణం మా జీవితంలో తీరని లోటు. అమ్మ ఇప్పటికీ ఆ విషాదం నుంచి కోలుకోవడం లేదు. తను పూర్తిగా ఆ బాధతోనే కాలం గడుపుతోంది. ఇంట్లో టీవీ పెట్టాలన్నా భయమేస్తోంది. అన్నయ్య పాటలొస్తే తను ఏడుస్తూనే ఉంటుంది. టీవీ పెట్టకపోతే అన్నయ్య గొంతు వినబడట్లేదు అని బాధపడుతుంది. తను ఇంకెప్పటికీ కోలుకోలేదు. ఒకవైపు మానసిక క్షోభ, మరోవైపు ఆర్థిక కష్టాలతో బతుకు వెళ్లదీస్తున్నాం. అన్నయ్య మరణించిన సమయానికి మేము ఇంట్లో లేము. వదినతో జరిగిన కొన్ని గొడవల వల్ల వేరే ఇంట్లో ఉన్నాం. ఆరోజు రాత్రి అన్నయ్య మా దగ్గరకు వచ్చి తన ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లారేసరికి చనిపోయాడన్న వార్త వచ్చింది. కానీ అన్నయ్య మరణంపై నాకిప్పటికీ అనుమానం ఉంది. ఆయనది సహజ మరణమే అయితే పోస్ట్‌మార్టమ్ చేయించడానికి ఎందుకు భయపడ్డారు? రాత్రి మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ విషం పెట్టి చంపింది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. గుండెల్లో పెట్టుకున్న కొడుకును కన్నతల్లి విషం పెట్టి చంపుతుందా? మా దురదృష్టవశాత్తూ ఆయన ఎలా చనిపోయారని మేము నిరూపించలేకపోయాం. అక్కడ నేను ఫెయిలయ్యాను. ఆయన చనిపోయాక తన స్టూడియో నాకు వచ్చేసిందని ప్రచారం నడిచింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. చెప్పాలంటే ఎవరో కావాలని స్టూడియో బయట సోఫాలు తగలబెట్టి ఆ నేరం నాపై మోపారు. తీరా స్టూడియోకు వెళ్లి చూస్తే అందులో ఉన్న సామాను, అవార్డులంతా ఎత్తుకెళ్లారు. అన్నయ్య గుర్తులు ఏవీ లేకుండా పోయాయి' అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. మహిత్ నారాయణ విషయానికి వస్తే.. లవ్యూ బంగారం, నేనో రకం, రామప్ప, పరారీ, రెడ్డిగారి ఇంట్లో రౌడీయిజం వంటి పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. -
అన్నయ్య భార్య ఆస్తులు అమ్ముకొని వెళ్లిపోయింది: చక్రి సోదరుడు
దివంగత సంగీత దర్శకుడు చక్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, శివమణి, దేశముదురు సహా పలు సినిమాలకు సంగీతం అందించి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే 2014లో గుండెపోటుతో కన్నుమూశారు. ఇక చక్రి మరణించిన తర్వాత కుటుంబంలో ఆస్తి పరమైన ఇబ్బందులో తలెత్తి అది మీడియా వరకు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. ''చక్రి అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆయన చనిపోయాక ఆస్తి గొడవలు వచ్చాయి. ఓవైపు అన్నయ్య లేడనే బాధకి తోడు ఈ గొడవలతో ప్రతిరోజు నరకం అనుభవించాము. అన్నయ్య ఆస్తుల్లో కొన్నింటిని ఆమె భార్య అమ్మేసుకొని అమెరికా వెళ్లిపోయింది. అక్కడే ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయ్యింది. ఆమెతో మాకెలాంటి సంబంధాలు లేవు. మరికొన్ని ఆస్తులు కోర్టు కేసులో ఉన్నాయి'' అంటూ మహిత్ పేర్కొన్నాడు. తాజాగా ఆయన ‘పరారీ’ అనే సినిమాకు సంగీతం అందించారు.