main roads
-
వర్ష బీభత్సం..
-
‘పశ్చిమానికి’ విస్త్తారమైన రోడ్లు
తాండూరు: పశ్చిమ రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రధాన రహదారులు విస్తరణకు నోచుకోనున్నాయి. పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా డబుల్ రోడ్లను నాలుగులైన్ల రోడ్లుగా, సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రోడ్లను వెడల్పు చేయడంతోపాటు పటిష్టం చేసేందుకు రాష్ట్ర సర్కారు దృష్టిసారించింది. ప్రధాన రోడ్లతోపాటు మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. వికారాబాద్ నుంచి తాండూరు వరకు ప్రధాన ప్రధాన రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని సర్కారు భావిస్తున్నది. ప్రస్తుతం వికారాబాద్ నుంచి తాండూరు వరకు 5.5 మీటర్ల వెడల్పుతో 39 కిలో మీటర్ల రోడ్డు ఉంది. ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువైంది. ఈక్రమంలో ఒకేసారి నాలుగు వాహనాలు వెళ్లేందుకు ఈ రోడ్డును 10 మీటర్ల వెడల్పు చేసి నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల క్రితం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించారు. ఈ రోడ్డు విస్తరణకు రూ.40కోట్లు అవసరమవుతాయని ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. తాండూరు నుంచి తొర్మామిడి(బంట్వారం మండలం)వరకు 23 కిలో మీటర్లు, లక్ష్మీనారాయణపూర్ నుంచి యాలాల మండల కేంద్రం వరకు ఉన్న 7కి.మీ.ల సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చాలని కూడా అధికారులు యోచిస్తున్నారు. ఈ రెండు రోడ్ల విస్తరణకు రూ. 35 కోట్లు అవసరమవుతాయని ఆర్అండ్బీ అధికా రులు ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో పేర్కొన్నారు. అలాగే మొయినాబాద్ నుంచి మన్నెగుడ వరకు కూడా ఉన్న సుమారు 34 కి.మీ.డబుల్ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చేందుకు అధికారులు ప్రభుత్వానికి రూ.వంద కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి తాండూరు ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. సీఎం ఆమోద ముద్రపడగానే నిధులు మంజూరు అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్డు విస్తరణకు నోచుకుంటే ఈ రహదారిపై ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. -
బాబు వస్తున్నారని...
తాత్కాలిక మర మ్మతులతో హడావుడి పీఎన్‌కాలనీ: పట్టణమంతా ఒకటే హడావుడి.. ఎక్కడ చూసినా మరమ్మతులు పనులు చకచకా సాగి పోతున్నాయి. వీధి లెట్లు, ప్రధాన రోడ్లకు మరమ్మ తులు, వీధులు, ప్రధాన కూడళ్లలో పారిశుద్ధ్య నిర్వ హణ, డివైడర్లు, రోడ్ల పక్క ఉన్న పిచ్చి మొక్కలు తొల గించడం, కలుపును తీయడం ఒక్కటేమిటి.. అడగక్క ముందే అన్నీ చేస్తున్నారు. ఇది చూసిన పట్టణ ప్రజలు ఔరా! ఇదేమిటి అనుకుంటూ ఆశ్చర్యపడుతున్నారు. ఈ హడావుడి అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తుండడంతోనే అని తెలుసుకుని ఔరా అని అనుకుంటున్నారు. వర్షం కురిస్తే చాలు పట్టణంలో పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా కనిపి స్తుంది. సమస్యలతో పట్టణ ప్రజలు నిత్యం కొట్టు మిట్టాడుతున్నా అధికారులో చలనం కూడా కనిపించేదికాదు. ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. సీఎం వస్తున్నారంటే మాత్రం ఇప్పు డు చక చకా పనులు వాయువేగంగా చేస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలో చిన్నపాటి వర్షం కురిసినా పట్టణమంతా జలమయం అవుతుంది. ఎక్కడిక్కడే గోతులు ఏర్పడి వర్షం పడితే ప్రజల గుండెల్లో ైరె ళ్లు పరిగెడతాయి. పట్టణంలో పలు ప్రాంతాల్లో వీధిలైట్లు లేక, మరికొన్నిచోట్ల లైట్లు ఉన్నా వెలగక అంధకారంలో ఉన్నా పట్టించుకోని అధికారులు మాత్రం సీఎం వస్తున్నారని మెహర్బాణీ కోసం విద్యుత్ వెలుగులు విరజిమ్మే విధంగా చర్యలు చేపడుతుం డడంతో పట్టణ వాసుల నుంచి విమర్శలొస్తున్నాయి. ప్రధానరోడ్లలో డివైడర్ల మధ్య ఇప్పుడుమాత్రం నాయకుల మెప్పు కోసం చకచకా మరమ్మతు పనులు చేస్తున్నారు. పట్టణంలో పలు కాలనీల రోడ్లు, కాలువల్లో చెత్తాచెదారం, మురుగునీరు పేరుకు పోయిన విషయాన్ని స్థానికులు అధికారులకు చెప్పినా పట్టించుకోని వారు ఇప్పుడుమాత్రం చెప్పకుండానే పారిశుద్ద్య పనులు సకాలంలో చేపడుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పట్టణాన్ని పరిశుభ్రం చేసేం దుకు రోజు పనిచేసే కార్మికులకు అదనంగా పారిశుద్ధ్య కార్మికులను తెచ్చి మరీ పనులు చేపడుతున్నారు. ఇదే తాపత్రయం ఎల్లవేలలా ఉంటే ఇప్పుడు ఇంత కష్టపడి చేయాల్సిన అవసరం వచ్చేది కాదని పలువురు పట్టణ వాసులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు నాయకుల మన్ననలు పొందాలని ఉన్నంత తాపత్రయం ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
రహదారులకు మహర్దశ
నిజామాబాద్ సిటీ: జిల్లాలోని ప్రధాన రహదారులకు మహర్దశ పట్టనుంది. ఇందుకోసం ‘మన ఊరు-మన ప్రణాళిక’లో భారీ ప్రతిపాదనలను చేర్చారు. కొత్త రోడ్లను నిర్మించటంతో పాటు, ఉన్న రోడ్ల ను అభివృద్ధి చేయాలని, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. రానున్న ఐదేళ్ల కాలంలో జిల్లావ్యాప్తంగా రూ.770.20 కో ట్ల పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిం చారు. నిజామాబాద్ డివిజన్లో రూ. 508.70 కోట్లు, జిల్లా కేంద్రంలో రూ. 8 కోట్లు, బోధన్ డివిజన్లో 253.50 కోట్ల పనులకు ప్రతిపాదనలు పెట్టారు. ఇప్పటి వరకు అసలే లేని చోట రోడ్లను నిర్మించి, ఒక గ్రామంతో మరొక గ్రావూనికి అనుసంధానం చేయనున్నారు. దీంతో దూరం తగ్గటమే కాకుండా, ప్రయాణ వ్యయం తగ్గుతుంది. నిజామాబాద్-నర్సి మార్గంలో ఆరు మైనర్ బ్రిడ్జిలను ప్రతిపాదనలో చేర్చారు. డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వరకు రోడ్డును వెడల్పు చేసి డివైడర్లు ఏర్పాటు చేయనున్నారు. మాధవనగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిజామాబాద్, డిచ్పల్లి రహదారిలోని మాధవనగర్ రైల్వేగేట్ వద్ద నిత్యం విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ప్రయాణికుల సమయం వృథా అవుతోంది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ మధ్య గతంలో మాధవనగర్, డిచ్పల్లి, కామారెడ్డి, గుండ్ల పోచంపల్లి మొత్తం నాలుగు ప్రాంతాలలో రైల్వే గేట్లు ఉండేవి. హైదరాబాద్ నుంచి డిచ్పల్లి వరకు రోడ్డును విస్తరించటంతో గుండ్ల పోచంపల్లి, కామారెడ్డి, డిచ్పల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. దీంతో ప్రయాణికులకు చాలావరకు ప్రయాణ సమయం ఆదా అయ్యింది. ఇక మాధవ్‌నగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి కలగానే మిగిలిపోయిం ది. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో ఇక్కడ రైల్వేఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 80కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు. దీని నిర్మాణం పూర్తయితే ప్రజలకు రైల్వేగేట్‌తో ఇబ్బందులు తప్పనున్నాయి. నగరంలో నగరంలో రైల్వేకమాన్ వద్ద ప్రస్తుతం ఒకటే మార్గం ఉంది. దీని పక్కన మరొకటి నిర్మించేందుకు రూ. 8 కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు. అర్సపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించేందుకు రూ. 40 కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు. వాస్తవానికి బైపాస్‌రోడ్డు నిర్మాణం మొదలు పెట్టగానే ఈ బ్రిడ్జి పనులు మొదలు పెట్టవలసి ఉండగా, నేటికీ శంకుస్థాపన జరుగలేదు. ఇప్పుడు మన ఊరు ప్రణాళికలో దీనిని చేర్చారు.