ప్రశాంతంగా గ్రూప్–2 మెయిన్ పరీక్ష
అనంతపురం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్–2 మెయిన్ పరీక్ష రెండో రోజు ఆదివారం ప్రశాతంగా ముగిసింది. 12 కేంద్రాల్లో రెండు సెషన్లుగా పరీక్ష జరిగింది. మొత్తం 1,686 మంది అభ్యర్థులకు గానూ ఉదయం 10 గంటలకు జరిగిన పరీక్షకు 1,607 మంది హాజరుకాగా 79 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగిన ప్రరీక్షకు 1,606 మంది హాజరుకాగా 80 మంది గైర్హాజరయ్యారు. హాజరు 95.25 శాతం నమోదైంది.