ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ మూసాపేటలో విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది. మైసమ్మ చెరువుకు ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఆదివారం మృత్యువాత పడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించారు.