జేసీబీని ఢీకొన్న కారు.. ముగ్గురికి గాయాలు
రంగారెడ్డి(శామీర్‌పేట్): కారు, జేసీబీని ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పుష్కరాలకు వెళ్లిన వస్తున్న నగరవాసులు శామీర్‌పేట్ మండలం మజీద్‌పూర్ చౌరాస్తా వద్ద రాజీవ్ రహదారిపై ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఐదుగురు పుష్కరాల సందర్భంగా గురువారం తెల్లవారుజామున కారులో కరీంనగర్ జిల్లా ధర్మపురికి వెళ్లి అదేరోజు రాత్రి తిరిగి నగరానికి ప్రయాణమయ్యారు.
రాజీవ్ రహదారిపై వస్తుండగా మండలంలోని మజీద్‌పూర్ చౌరాస్తా వద్దకు రాగానే ఓ జేసీబీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.