ఖైరతాబాద్ గణపతికి 5 టన్నుల లడ్డు
తయారీకి సిద్ధమైన మండపేట తాపేశ్వరం సురుచి ఫుడ్స్
తూర్పుగోదావరి: ఖైరతాబాద్ గణనాథుని చెంత ఉంచేందుకు తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సురుచి ఫుడ్స్ ఈసారి భారీ లడ్డూ తయారు చేయనుంది. ప్రతిష్టించే 60 అడుగుల ‘శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతి’ విగ్రహం చేతిలో ఉంచేందుకు 5 వేల కేజీల లడ్డూను తయారు చేయనున్నట్టు సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు సోమవారం తెలిపారు.
లడ్డూ తయారీ నిమిత్తం ఈ నెల 21న తనతోపాటు 16 మంది గణేశ్ మాలధారణ చేయనున్నామన్నారు. పూర్తైన లడ్డూను 28న క్రేన్ సాయంతో ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ పంపిస్తామన్నారు.