మంచి ముత్యాలు వచ్చేదిలా..
ముత్యాల దండలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదూ. వాటితో కేవలం మెడలో హారాలే కాదు.. చెవులకు ధరించే హ్యాంగింగ్స్, చేతులకు గాజులు.. ఇలా రకరకాల ఆభరణాలు తయారుచేస్తారు. హైదరాబాద్ మంచి ముత్యాలంటే దేశవిదేశాల్లో కూడా ఎంతో పేరుంది. మరి అలాంటి మంచి ముత్యాలు ఎలా వస్తాయో తెలుసా? చూడాలని కూడా ఉందా?
సముద్రపు జీవి అయిన ముత్యపుచిప్పను పట్టుకుని, దాన్ని సరిగ్గా సగానికి చీల్చిన తర్వాత.. దాని శరీరం లోంచి ఈ ముత్యాలను తీస్తారు. వాటిని సేకరించి.. శుభ్రం చేసిన తర్వాత అప్పుడు మార్కెట్లకు తరలిస్తారు. ఇదంతా చాలా సంక్లిష్టమైన ప్రాసెస్. ఇంత అయిన తర్వాత గానీ మనకు ముత్యాలు చేతికి రావు.