కామన్వెల్త్ గేమ్స్: మహిళల షూటింగ్లో భారత్‌కు రజతం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మరో పతకం సాధించింది. రెండో రోజు శుక్రవారం పది మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ 16 ఏళ్ల మలైకా గోయెల్ రజత పతకంతో మెరిసింది. ఫైనల్స్‌లో గోయెల్ 197.1 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచి పతకం సొంతం చేసుకుంది.
మరో భారత షూటర్ హీనా సిద్ధు ఫైనల్స్‌కు అర్హత సాధించినా పతకాల వేటలో వెనుకబడింది. సిద్ధు ఏడో స్థానానికి పరిమితమైంది. ఈ ఈవెంట్లో సింగపూర్ షూటర్ షున్ ఝీ టియో 198.6 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. ఇక సింగపూర్ షూటర్‌కు మూడో స్థానంతో కాంస్యం దక్కించుకుంది.