Malayalam actress kidnap case
-
నటిపై అఘాయిత్యం: పక్కా స్కెచ్ వేసింది అతనే!
కోచి: ప్రముఖ మలయాళ నటిపై లైంగిక దాడి కేసు నిందితుల్లో ఒకడైన మణికందన్ పోలీసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించాడు. సునీల్‌కుమార్ అలియాస్ పల్సర్ సునినే ఈ నేరానికి పక్కా స్కెచ్ గీశాడని, పూర్తిగా అతని ప్లాన్ ప్రకారమే నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన జరిగిందని అతను తెలిపాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సుని ఇంకా పరారీలోనే ఉన్నాడు. బాధితురాలి మాజీ డ్రైవర్ అయిన అతన్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నేరంలో పల్సర్ సునికి సహకరించిన మణికందన్‌ను సోమవారం రాత్రి పాలక్కడ్‌లో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడు విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. నటి కారులోకి ప్రవేశించి దాడి చేసేవరకు.. పల్సర్ సుని ప్లాన్ గురించి తమకు తెలియదని చెప్పాడు. 'ఒక పని ఉందంటూ పల్సర్ సుని కాల్ చేసి పిలిచాడు. ఎవరినో కొట్టేందుకు అతను పిలిచి ఉంటాడని నేను భావించాను. కానీ నటి మీద దాడి చేసేందుకు మమల్ని పిలిచాడని తర్వాత తెలిసింది. ఆమె కారులోకి మేం వెళ్లాక.. నేను మాత్రం తనపై దాడి చేయలేదు' అని అతను పోలీసులకు తెలిపినట్టు విశ్వనీయవర్గాలు తెలిపాయి. నటిపై దాడి తర్వాత డబ్బు కోసం ఈ నేరంలో పాల్గొన్న ఇతర వ్యక్తులు పల్సర్ సునితో గొడవ పడ్డారని, వారికి రూ. 30 లక్షలు తర్వాత ఇస్తానని ఒప్పించి అతను తప్పించుకున్నాడని మణికందన్ పోలీసులకు చెప్పాడు. మణికందన్ చెప్పింది పూర్తిగా పోలీసులు విశ్వసించడం లేదని సమాచారం. అతన్ని మరింతగా విచారించిన అనంతరం ఆ రోజు ఏం జరిగిందనే దానిపై క్లారిటీ వస్తుందని పోలీసులు అంటున్నారు. కాగా, నటిపై దాడి జరిగిన వాహనాన్ని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పోలీసులు అప్పగించారు. -
నటిపై అత్యాచారం: ఆ రాత్రి ఏం జరిగిందంటే..!
పల్సర్ సునీకి ఫోన్ చేయడంపై నిర్మాత వివరణ కొచ్చి: మలయాళ కథానాయిక కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నిర్మాత అంటో జోసెఫ్ పేరు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి పల్సర్ సునీకి చివరిసారిగా ఫోన్ చేసింది జోసెఫ్‌నేనని తేలడంతో ఆయన ప్రమేయంపై అనేక కథనాలు వస్తున్నాయి. వ్యక్తిగత కక్షతోనే నటిపై ఈ దుర్మార్గాన్ని చేయించాడా? అని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కథనాల నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. గత శుక్రవారం నటి కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురయిన అనంతరం ఏం జరిగిందో వివరించారు. ఆయన ఏమన్నారంటే.. 'ఘటన జరిగిన తర్వాత మొదట దర్శకుడు లాల్ నాకు ఫోన్ చేశారు. నా ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉండటంతో నేను ఎత్తలేదు. ఆ తర్వాత రెంజీ పనిక్కర్ నాకు ఫోన్ చేసి.. జరిగిన ఘటన గురించి చెప్పారు. సాధ్యమైనంత త్వరగా లాల్ ఇంటికి రమన్నారు. దీంతో నేను ఎమ్మెల్యే పీటీ థామస్‌తోపాటు లాల్ ఇంటికి చేరుకున్నాను. పోలీసులు, (నటి డ్రైవర్) మార్టిన్ అప్పటికే అక్కడ ఉన్నారు. పీటీ థామస్ మార్టిన్‌ను ప్రశ్నించాడు. అతని దగ్గరి నుంచి పల్సర్ సుని నంబర్ తీసుకున్నాను. నా నంబర్ నుంచి మార్టిన్ సునికి ఫోన్ చేశాడు. మొదట అతను లిఫ్ట్ చేయలేదు. కానీ ఆ తర్వాత కాల్‌బ్యాక్ చేసి నువ్వు ఎవరు అని అడిగాడు. నా గురించి చెప్పడంతో వెంటనే పెట్టేశాడు. అంతే తప్ప అతనికితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలిపాను. అది దారుణమైన ఘటన. ఇలాంటి ఘటన ఏ అమ్మాయికి కూడా జరగకూడదు' అని అంటో జోసెఫ్ పేర్కొన్నారు. కారులో దుండగులు తనను లైంగికంగా వేధింపులకు గురిచేసిన అనంతరం నటి దర్శకుడు లాల్ దగ్గరికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే తాను పల్సర్ సునికి ఫోన్ చేశానని జోసెఫ్ చెప్తున్నారు.