పెళ్లిపై కాంచన నటి ఆసక్తికర కామెంట్స్.. గట్టిగానే కౌంటర్!
‘కళవాణి’ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది తమిళ నటి ఓవియా. ఆ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. కొన్ని చిత్రాల్లో నటించినా హిట్ టాక్ తెచ్చుకోలేదు. అయితే తమిళ బిగ్ బాస్ సీజన్లో పాల్గొన్న ఓవియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆమె అసలు పేరు హెలెన్ నెల్సన్ కాగా.. కేరళలోని త్రిసూర్‌లో జన్మించింది. మలయాళం, తమిళ, కన్నడ చిత్రాల్లో ఎక్కువగా కనిపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనిన ఓవియా.. తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. గతంలో ఆమె బిగ్ బాస్ విన్నర్ అరవ్‌తో డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
బిగ్ బాస్ మొదటి సీజన్లో పాల్గొనిన ఓవియా సహా-కంటెస్టెంట్ ఆరవ్తో సన్నిహితంగా ఉందని చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్దఎత్తున వార్తలు వైరలయ్యాయి. అయితే వీటిపై ఇద్దరూ మౌనంగానే ఉంటూ వచ్చారు. బిగ్ బాస్ ముగిసిన తర్వాత వీరిద్దరూ తమ కెరీర్‌పైనే దృష్టి సారించారు. ఆ ఆ తర్వాత ఓవియా కాంచన -3, 90 ఎంఎల్ సహా చిత్రాల్లో నటించింది. రెండు సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కలేదు.
పెళ్లి కాలేదు.. కానీ
బిగ్ బాస్ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో ఓవియా పెళ్లి చేసుకోనున్నట్లు గాపిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఓవియా స్పందించింది. నాకు పెళ్లి ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని.. నటనపైనే దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది. మీకు పెళ్లై ఓ పాప కూడా ఉందని వార్తలొచ్చాయని ప్రశ్నించగా.. వాటికి ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది మలయాళీ భామ.
ఓవియా మాట్లాడుతూ.. 'అవును నాకు ఓ పిల్లాడు ఉన్నాడు. కానీ నాకు పెళ్లి కాలేదు. అది నా కుక్కపిల్ల. దానిని నేను చిన్న పిల్లలానే చూసుకుంటా. అన్నం తినిపిస్తాను. అంతే కాకుండా కుక్కపిల్ల నా పక్కనే పడుకుంటుంది.' అని సమాధానమిచ్చింది. అయితే నెటిజన్స్ మాత్రం ఆమెపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తనకు పెళ్లయిందని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.