Malayalam movie industry
-
ఏఆర్ఎమ్ నాకో పెద్ద సవాల్: కృతీ శెట్టి
యువ కథానాయికల్లో వరుస సినిమాలతో దూసుకెళుతున్న వారిలో కృతీ శెట్టి ఒకరు. ఈ బ్యూటీ ‘అజయంతె రందం మోషనుమ్’ (ఏఆర్ఎమ్) చిత్రంతో మలయాళ చిత్రపరిశ్రమకు పరిచయం కానున్నారు. వచ్చే నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. మలయాళం సినిమా చేసిన అనుభవం గురించి కృతీ శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – ‘‘1900, 1950, 1990.... ఈ మూడు కాలాల్లో ఈ సినిమా సాగుతుంది. ఇలాంటి సినిమాలో నటించడం అనేది ఒక మంచి అవకాశం. ఈ చిత్రంలో పూర్తి మలయాళీ గ్రామీణ అమ్మాయిలా కనిపిస్తాను. నటన పరంగా చాలా నేచురల్‌గా ఉండాలి.చిన్న చిన్న హావభావాలతో చెప్పాల్సినదంతా చెప్పాలి. ఆ పరంగా ఇప్పటివరకూ నటించినదానికి పూర్తి భిన్నంగా అనిపించింది. అదొక సవాల్ అయితే మలయాళ భాష నేర్చుకోవడం మరో సవాల్. ఇక ఒక్కోసారి 36 నుంచి 38 గంటలు కంటిన్యూస్‌గా షూటింగ్ చేసేవాళ్లం. నాకంటే కార్వేన్ ఉంటుంది కాబట్టి షాట్ గ్యాప్‌లో అందులో విశ్రాంతి తీసుకునేదాన్ని.అలాగే నా పాత్ర షూట్ పూర్తి కాగానే వెళ్లి΄ోయేదాన్ని. కానీ, షూటింగ్ మొత్తం పూర్తయ్యాక అన్నీ సర్దుకుని వెళ్లడానికి కొందరు సాంకేతిక నిపుణులకు టైమ్ పట్టేది. మరుసటి రోజు మాకన్నా ముందు సెట్లో ఉండేవాళ్లు. అలాగే ఈ చిత్రం హీరో టొవినో థామస్‌లో 36 గంటలు షూట్ చేసినా అలసట కనిపించేది కాదు. ఇలా ఈ సినిమా టీమ్ ఇన్‌స్పయిరింగ్‌గా అనిపించింది’’ అన్నారు. -
అసోసియేషన్ నుంచి వైదొలిగిన నటీమణులు
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి భావన సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మళయాళం మావీ ఆర్టిస్ట్స్) నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఆమెతో పాటు నటిమణులు రిమా కలింగల్, రమ్య నంబిసన్, గీత్ మోహన్‌దాస్‌లు కూడా అమ్మకు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఫేస్బుక్ పేజీ ద్వారా తెలియజేశారు. గతేడాది భావనపై నటుడు దిలీప్ లైగింక వేధింపు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దిలీప్‌ను అరెస్ట్ చేయడంతో అమ్మ అతనిపై నిషేధం విధించింది. తాజాగా అతనిపై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో వీరు నలుగురు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అ నటుడి వల్ల గతంలో నేను ఎన్నో అవకాశాలు కొల్పోయాను.. కానీ అమ్మ ఏం చేయలేకపోయిందని భావన తెలిపారు. అమ్మలో కొనసాగడం అనవసరమంటూ ఆమె పేర్కొన్నారు. అమ్మ మహిళల కోసం ఏ విధమైన చర్యలు చెప్పట్టడం లేదని రిమా చెప్పారు. -
నా కుటుంబంపై పగ తీర్చుకుంటా
నా కుటుంబ సభ్యులపై పగ తీర్చుకుంటానంటూ నటి షకీలా శపథం చేశారు. ప్రముఖ శృంగార తారగా 1990వ దశకంలో మలయాళ చిత్రపరిశ్రమను ఈమె ఏలారన్నది అతిశయోక్తి కాదు. ఈమె చిత్రాల అనువాదాలతో చాలామంది నిర్మాతలు బాగానే సంపాదించారు. అలాగే షకీలా కూడా ఆస్తులు సంపాదించుకున్నారు. అయితే అవి ఇప్పుడు ఆమె వద్ద లేవు. అంతా ఆమె కుటుంబ సభ్యులు మోసంతో దోచుకున్నారట. దీని గురించి నటి షకీలా ఒక ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తన కుటుంబ సభ్యులు తనను చాలా చిత్ర హింసలకు గురి చేశారని తెలిపారు. తన ఆస్తులను అపహరించారని చెప్పారు. ఇందుకుగాను వారిపై పగ తీర్చుకుంటానన్నారు. ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలోనైనా ఇదే కుటుంబంలో షకీలాగానే పుట్టి వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని శ పథం చేస్తున్నట్లు షకీలా పేర్కొన్నారు.