నా కుటుంబంపై పగ తీర్చుకుంటా
నా కుటుంబ సభ్యులపై పగ తీర్చుకుంటానంటూ నటి షకీలా శపథం చేశారు. ప్రముఖ శృంగార తారగా 1990వ దశకంలో మలయాళ చిత్రపరిశ్రమను ఈమె ఏలారన్నది అతిశయోక్తి కాదు. ఈమె చిత్రాల అనువాదాలతో చాలామంది నిర్మాతలు బాగానే సంపాదించారు. అలాగే షకీలా కూడా ఆస్తులు సంపాదించుకున్నారు. అయితే అవి ఇప్పుడు ఆమె వద్ద లేవు. అంతా ఆమె కుటుంబ సభ్యులు మోసంతో దోచుకున్నారట.
దీని గురించి నటి షకీలా ఒక ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తన కుటుంబ సభ్యులు తనను చాలా చిత్ర హింసలకు గురి చేశారని తెలిపారు. తన ఆస్తులను అపహరించారని చెప్పారు. ఇందుకుగాను వారిపై పగ తీర్చుకుంటానన్నారు. ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలోనైనా ఇదే కుటుంబంలో షకీలాగానే పుట్టి వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని శ పథం చేస్తున్నట్లు షకీలా పేర్కొన్నారు.