యువ కథానాయికల్లో వరుస సినిమాలతో దూసుకెళుతున్న వారిలో కృతీ శెట్టి ఒకరు. ఈ బ్యూటీ ‘అజయంతె రందం మోషనుమ్’ (ఏఆర్‌ఎమ్) చిత్రంతో మలయాళ చిత్రపరిశ్రమకు పరిచయం కానున్నారు. వచ్చే నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. మలయాళం సినిమా చేసిన అనుభవం గురించి కృతీ శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – ‘‘1900, 1950, 1990.... ఈ మూడు కాలాల్లో ఈ సినిమా సాగుతుంది. ఇలాంటి సినిమాలో నటించడం అనేది ఒక మంచి అవకాశం. ఈ చిత్రంలో పూర్తి మలయాళీ గ్రామీణ అమ్మాయిలా కనిపిస్తాను. నటన పరంగా చాలా నేచురల్‌గా ఉండాలి.
చిన్న చిన్న హావభావాలతో చెప్పాల్సినదంతా చెప్పాలి. ఆ పరంగా ఇప్పటివరకూ నటించినదానికి పూర్తి భిన్నంగా అనిపించింది. అదొక సవాల్ అయితే మలయాళ భాష నేర్చుకోవడం మరో సవాల్. ఇక ఒక్కోసారి 36 నుంచి 38 గంటలు కంటిన్యూస్‌గా షూటింగ్ చేసేవాళ్లం. నాకంటే కార్‌వేన్ ఉంటుంది కాబట్టి షాట్ గ్యాప్‌లో అందులో విశ్రాంతి తీసుకునేదాన్ని.
అలాగే నా పాత్ర షూట్ పూర్తి కాగానే వెళ్లి΄ోయేదాన్ని. కానీ, షూటింగ్ మొత్తం పూర్తయ్యాక అన్నీ సర్దుకుని వెళ్లడానికి కొందరు సాంకేతిక నిపుణులకు టైమ్ పట్టేది. మరుసటి రోజు మాకన్నా ముందు సెట్లో ఉండేవాళ్లు. అలాగే ఈ చిత్రం హీరో టొవినో థామస్‌లో 36 గంటలు షూట్ చేసినా అలసట కనిపించేది కాదు. ఇలా ఈ సినిమా టీమ్ ఇన్‌స్పయిరింగ్‌గా అనిపించింది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment