చిరంజీవి సినిమా రిజెక్ట్‌ చేసిందా? కృతీ ఏమందంటే? | Krithi Shetty Rejects Project with Chiranjeevi? Actress Responds | Sakshi
Sakshi News home page

చిరంజీవి సినిమా రిజెక్ట్‌ చేసిన కృతీ శెట్టి? బ్యూటీ ఆన్సరిదే!

Published Sat, Aug 24 2024 12:41 PM | Last Updated on Sat, Aug 24 2024 12:58 PM

Krithi Shetty Rejects Project with Chiranjeevi? Actress Responds

తెలుగులో స్పీడు తగ్గించిన కృతి శెట్టి ఇతర భాషల్లో మాత్రం మంచి ఛాన్సులే అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో లవ్‌ ఇన్సూరెన్సీ కంపెనీలో, మలయాళంలో అజయంతె రందం మోషనుమ్‌ (ఏఆర్‌ఎమ్‌) చిత్రాలు చేస్తోంది. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్‌ వస్తే రిజెక్ట్‌ చేసిందని ఆ మధ్య ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై కృతీ శెట్టి స్పందించింది. తనకలాంటి ఆఫర్‌ రాలేదని పేర్కొంది. అలాగే తెలుగు, మలయాళ చిత్రపరిశ్రమకు మధ్య ఓ తేడా ఉందంటోంది.

పని గంటలు ఎక్కువ
ఆమె మాట్లాడుతూ..  ఏఆర్‌ఎమ్‌ సినిమాలో నాది పల్లెటూరమ్మాయి పాత్ర. మలయాళం నేర్చుకోవడం కష్టంగా అనిపించింది. కానీ హీరో టోవినో థామస్‌ సాయం చేశాడు. తెలుగులో కంటే మలయాళ ఇండస్ట్రీలో పనిగంటలు ఎక్కువ. అన్ని గంటలు పనిచేసినా కూడా ఎవరూ అలిసిపోయినట్లు కనిపించరు, యాక్టివ్‌గా ఉంటారు. ఈ విషయంలో వాళ్లను చూసి ఇన్‌స్పైర్‌ అయ్యాను. నాకైతే నాలుగోరోజుకు నిద్ర ఆగలేదు. చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్‌ వస్తే తిరస్కరించారిన ఏవో పుకార్లు వచ్చాయి. వాటిలో ఏమాత్రం నిజం లేదు అని కృతి శెట్టి అని చెప్పుకొచ్చింది.

చదవండి: అందరి మీదకు అరిచే డైరెక్టర్‌.. అప్పట్లో ఆ హీరోయిన్‌ దగ్గర మాత్రం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement