మృతుల్లో అత్యధికులు డచ్ పౌరులే
మలేషియా విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన ప్రయాణికుల్లో అత్యధికులు డచ్ దేశానికి చెందిన వారేనని ఉన్నతాధికారి స్సష్టం చేశారు. విమానంలో మొత్తం 298 మంది ప్రయాణికులు మరణించగా.... వారిలో 154 మంది డచ్ పౌరులని వెల్లడించారు. మృతుల వివరాలను ఉన్నతాధికారి ఇక్కడ వెల్లడించారు. మృతుల్లో 27 మంది ఆస్ట్రేలియా, 23 మంది మలేషియా,11 మంది ఇండోనేషియా, 6 బ్రిటన్, 4 జర్మనీ, 4 బెల్జియం, 3 పిలిప్పీన్స్, ఒకరు కెనడా పౌరులుగా గుర్తించినట్లు తెలిపారు. అయితే మరో 47 మంది మృతులు ఏ దేశానికి చెందిన వారు అనే విషయాన్ని గుర్తించవలసి ఉందని పేర్కొన్నారు.
నెదర్లాండ్స్‌లోని మలేషియా రాయబారి ఎఫ్ మహ్మద్ మాట్లాడుతూ... విమాన ప్రమాదం వార్త విన్న వెంటనే తీవ్ర ఆందోళనకు గురైయానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముఖ్యంగా ప్రమాద ఘటనలో డచ్ పౌరులు అత్యధికులు మరణించారని వారికి ఇతర దేశాల జాతీయల మృతికి ఆమె సంతాపాన్ని ప్రకటించారు. మృతుల సమాచారం అందించేందుకు రాయబార కార్యాలయం 24 గంటలు తెరిచే ఉంటుందని తెలిపారు. దేశ చరిత్రలో ఇది అతి పెద్ద విపత్తు అని డచ్ దేశ ప్రధాన మంత్రి మార్క్ రుట్టీ వెల్లడించారు.
ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం గురువారం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ విమాన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను ఉన్నతాధికారి శుక్రవారం విడుదల చేశారు.