Malaysia Open Super Series Premier
-
మలేసియా ఓపెన్ చాంప్స్ చెన్ లాంగ్, మారిన్
కౌలాలంపూర్ : మలేసియా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్స్ చెన్ లాంగ్ (చైనా), కరోలినా మారిన్ (స్పెయిన్) వరుసగా పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో చెన్ లాంగ్ 20-22, 21-13, 21-11తో ఐదుసార్లు విశ్వవిజేత లిన్ డాన్ (చైనా)పై నెగ్గగా... కరోలినా మారిన్ 19-21, 21-19, 21-17తో టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)పై విజయం సాధించింది.సెమీఫైనల్లో భారత స్టార్ సైనా నెహ్వాల్‌ను ఓడించిన జురుయ్ లీ ఫైనల్లో మాత్రం మారిన్‌కు గట్టిపోటీనిచ్చినా కీలకదశలో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. -
సైనా, శ్రీకాంత్ శుభారంభం
కౌలాలంపూర్: భారత బ్యాడ్మింటన్ స్లార్స్ సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ తమ హవా కొనసాగిస్తున్నారు. మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ లోనూ వీరిద్దరూ శుభారంభం చేశారు. గురువారం అధికారికంగా ప్రపంచ నెంబర్ వన్ కాబోతున్న సైనా బుధవారమిక్కడ జరిగిన తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. ఇండోనేసియా క్రీడాకారిణి మారియా ఫెబె కుసుమస్తుతిపై 21-13 21-16 గెలిచి రెండో రౌండ్ లోకి ప్రవేశించింది. రెండో రౌండ్ లో చైనా క్రీడాకారిణి యావొ జుయ్ తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఇంగ్లండ్ ప్లేయర్ రాజీవ్ ఔసెఫ్ ను 10-21 21-15 22-24 తేడాతో శ్రీకాంత్ ఓడించాడు. టియన్ హౌవుయ్ తో రెండో రౌండ్ లో శ్రీకాంత్ ఆడతాడు. -
మలేసియా సూపర్ సిరీస్ నుంచి సైనా, సింధు నిష్క్రమణ
కౌలాలంపూర్: మలేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత దేశ అగ్రశ్రేణి క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి సింధులు ఓటమి పాలైయ్యారు. తొలి రౌండ్ ను ఎంతో కష్టం మీద అధిగమించిన ఈ క్రీడాకారిణులు రెండో రౌండ్ ను దాటలేకపోయారు. ఎనిమిదో ర్యాంక్ సైనా నెహ్వాల్ కు ప్రపంచ ఇరవై అయిదవ ర్యాంక్ క్రీడాకారిణి జుయ్ యావో (చైనా)తో జరిగిన మ్యాచ్ లో చుక్కెదురైంది. సైనా నెహ్వాల్ 16-21,21-10, 21-19 తేడాతో యావో చేతిలో కంగుతింది. తొలి సెట్ ను సైనా అలవోకగా గెలుచుకున్నా ఆపై పోరాటం సాగించడంలో విఫలమై ఓటమి పాలైంది. అంతకుముందు జరిగిన మ్యాచ్ లో ఆరో సీడ్ క్రీడాకారిణి జు బే (కొరియన్)చేతిలో 21-16,21-19 పాయింట్ల తేడాతో పి.వి.సింధు ఓటమి పాలైంది. ఎనిమిదో సీడ్ సైనా బుధవారం జరిగిన తొలి రౌండ్లో 21-10, 21-16తో ఇండోనేసియాకు చెందిన హిరా దేసిని ఓడించిన సైనా రెండో రౌండ్ కు చేరిన సంగతి తెలిసిందే.