పింఛను ఆపేశారు
మీనానగరం (చాగల్లు), న్యూస్‌లైన్: ఈ నలుగులూ చాగల్లు మండలం మీనానగరంలో నివాసం ఉంటున్నారు. కుటుంబ పెద్ద అయిన పట్టపగలు సోమరాజు పుట్టుకతోనే వికలాంగుడు. అతనికి 65 శాతం వైకల్యం ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. అతడికి నాలుగేళ్ల క్రితం వెంకటలక్ష్మితో వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టారు. వైకల్యం వల్ల ఏ పనీ చేయనిలేని స్థితిలో సోదరుడిపై ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. సోమరాజుకు వికలాంగుల కోటాలో రూ.500 పింఛను వచ్చేది. కుటుంబ పోషణకు చేయూతగా ఉండేది. రేషన్ కార్డు లేదన్న కారణంగా మూడేళ్ల క్రితం అతనికి పింఛను నిలిపివేశారు. కార్డు మంజూరు చేయూలంటూ రచ్చబండ సభల్లో పలుసార్లు దరఖాస్తు చేశామని, ఇప్పటికీ కార్డు ఇవ్వలేదని సోమరాజు, వెంకటలక్ష్మి దంపతులు వాపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయూలు, అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోరుుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకల్యంతో బాధపడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తన లాంటివారికి ప్రభుత్వ పథకాలు వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సోమరాజు కోరుతున్నారు.