మాల్గాడి పాడిన ఈ మాస్ సాంగ్ విన్నారా..?
నవీద్ బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్ రాజ్, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇంటి నెం.13’. పన్నా రాయల్ దర్శకత్వంలో హేసన్ పాషా నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలోని ‘నర నరము..’ అంటూ సాగే మాస్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. రాంబాబు గోశాల రచించిన ఈ పాటకు వినోద్ యాజమాన్య సంగీతం అందించారు.
డిఫరెంట్ సాంగ్స్‌కి పెట్టింది పేరైన మాల్గాడి శుభ ఈ పాట పాడారు. ‘‘మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఇంటి నెం.13లో ఏం జరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది. ‘నర నరము..’ అంటూ ఎంతో హుషారుగా సాగే ఈ పాట యూత్‌తోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.