బెల్జియంలో హై అలర్ట్.. మాలిలో ఎమర్జెన్సీ
బ్రస్సెల్స్/బమాకో: పారిస్, లెబనాన్, మాలి దేశాల్లో జరిగిన ఉగ్రవాద దాడుల అనంతరం ప్రపంచ దేశాలు రక్షణాత్మకంగా వ్యవరిస్తున్నాయి. బెల్జియంలో శనివారం హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడుల భయంతో బ్రస్సెల్స్‌లో మెట్రో సర్వీసులను నిలిపివేశారు.
బమాకోలో ఉగ్రదాడుల నేపథ్యంలో మాలిలో 10 రోజుల పాటు ఎమర్జెన్సీ ప్రకటించారు. బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. హోటల్‌పై జరిగిన దాడుల్లో 30 మందికి పైగా మృతిచెందినట్లు సమాచారం.