mall Practice case
-
పోలీస్ కస్టడీకి నారాయణ స్కూల్ డీన్
చిత్తూరు అర్బన్: పదో తరగతి ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో తిరుపతి ఎయిర్‌బైపాస్ రోడ్డులోని నారాయణ పాఠశాల డీన్ గంగాధరరావును పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ చిత్తూరులోని నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం గురువారం ఉత్తర్వులిచ్చింది. గత నెల పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి కాంపోజిట్ తెలుగు ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఘటనలో టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణతో పాటు పోలీసులు 9 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో డీన్ గంగాధరరావును పోలీస్ కస్టడీకి ఇవ్వాలని వన్ టౌన్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లోకనాథరెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిందితుల్లో గంగాధరరావు నుంచి ఎవరెవరికి ఆర్థిక సాయం అందింది..? కుట్ర ఎలా జరిగింది? ఇతడి కంటే పెద్దల నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడ్డాయి? అనే విషయాలు విచారించాల్సి ఉందని.. ఏడు రోజుల పోలీస్ కస్టడీకు అనుమతిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉందన్నారు. తమ పిటిషనర్‌కు ఈ ఘటనతో సంబంధం లేదని, బెయిల్ మంజూరుచేయాలని గంగాధరరావు తరఫు న్యాయవాదులు వాదించారు. ఇద్దరి వాదనలు విన్న మేజిస్ట్రేట్ శ్రీనివాస్.. నిందితుడిని మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. -
వారి వ్యాజ్యాలకు విచారణార్హతే లేదు
సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు సింధూర, శరణి, అల్లుడు కె.పునీత్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లకు అసలు విచారణార్హతే లేదని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. నారాయణ విద్యా సంస్థపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ వివరాలన్నింటినీ కోర్టు ముందుంచుతామని ఆయన వివరించారు. ప్రశ్నాపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో పిటిషనర్లు అసలు నిందితులు కాదని, అలాంటప్పుడు వారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంలో అర్థం లేదన్నారు. కేవలం ఆందోళన ఆధారంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలను కొట్టేయాలని కోరారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు.. పదవ తరగతి ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో పోలీసులు తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు సునీత, పొంగూరు శరణి, అల్లుడు కె.పునీత్, నారాయణ మామ రాపూరు కోటేశ్వరరావు, నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ డిప్యూటీ జనరల్ మేనేజర్ జె.కొండలరావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాలేపాటి కిషోర్, సొసైటీ సభ్యులు వీపీఎన్‌ఆర్ ప్రసాద్, మరో ఆరుగురు హైకోర్టులో వేర్వేరుగా గత ఆదివారం పిటిషన్లు దాఖలు చేశారు. హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరిపిన న్యాయమూర్తి, పిటిషనర్ల విషయంలో ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు ఐపీసీ వర్తించదు.. బుధవారం ఈ వ్యాజ్యాలు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మధరావు ఎదుట విచారణకు రాగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రత్యేక చట్టం కింద కేసు నమోదు చేసినప్పుడు తిరిగి ఐపీసీ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదని ఇదే హైకోర్టు చెప్పిందన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్‌కు సంబంధించి ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (మాల్ ప్రాక్టీస్, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక ) చట్టం కింద కేసు నమోదు చేశారని, ఇది ప్రత్యేక చట్టమని తెలిపారు. అందువల్ల ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టడానికి వీల్లేదన్నారు. సెక్షన్ 41ఎ ప్రకారం నడుచుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. దీనిని పోలీసుల తరఫున హాజరైన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. అదనపు పీపీ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, కౌంటర్‌ను పరిశీలించాక పిటిషన్లపై నిర్ణయం వెలువరిస్తామని తెలుపుతూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
నారాయణ లేకుండా ష్యూరిటీలా?
చిత్తూరు అర్బన్: పది ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీస్ వ్యవహారంలో నిందితుడు మాజీ మంత్రి నారాయణను తమ ముందు హాజరుపరచాలని చిత్తూరులోని నాలుగో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. నారాయణ లేకుండా జామీనుకు ష్యూరిటీలు తీసుకోవడం కుదరదన్నారు. మాల్‌ప్రాక్టీస్ వ్యవహారంలో గతవారం చిత్తూరు పోలీసులు టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసి ఇన్చార్జి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడం తెలిసిందే. రిమాండ్‌ను తిరస్కరించిన ఇన్చార్జి మేజిస్ట్రేట్.. నారాయణను సొంత పూచీకత్తుపై విడుదల చేస్తూ ఇద్దరు జామీను ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు నారాయణ న్యాయవాదులు 5 రోజుల గడువు తీసుకున్నారు. సోమవారం చిత్తూరులోని నాలుగో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో ఇద్దరు వ్యక్తులను జామీనుగా నారాయణ న్యాయవాదులు హాజరుపరిచారు. దీనిపై మేజిస్ట్రేట్ శ్రీనివాస్ స్పందిస్తూ నిందితుడు రాకుండా ష్యూరిటీలను తీసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ఈ విషయమై నారాయణ న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాల తీర్పులను నివేదించడానికి సమయం కోరడంతో మేజిస్ట్రేట్ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
డీబార్ ‘150’
♦ ఇంటర్ పరీక్షల్లో ఇదీ పరిస్థితి ♦ జంటజిల్లాల్లో గణనీయంగా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు ♦ విస్మయం వ్యక్తం చేస్తున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఇంటర్మీడియెట్ పరీక్షల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో డిబార్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే.. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే కాపీ కొడుతూ దాదాపు 150 మంది పట్టుబడ్డారు. సెకండియర్‌కు సంబంధించి మరో పరీక్ష మిగి లి ఉండగానే ఈ స్థాయిలో డిబార్ కావటం చర్చ నీయాంశంగా మారింది. నిత్యం డిబార్ అవుతున్న విద్యార్థుల సంఖ్యను చూసి అధికారులు సైతం విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి భారీ సంఖ్యలో స్క్వాడ్లకు దొరకడం తమ అనుభవంలో ఇదే తొలిశారని అంటున్నారు. ఎటువంటి తప్పిదాలకు, కాపీయింగ్ తావులేకుండా పూర్తిగా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డ్ నుంచి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో పరీక్షల ప్రారంభం నుంచి పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహిం చడంపై జిల్లా అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సాధ్యమైనన్ని కేంద్రాల్లో 11 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేశాయి. జంట జిల్లాల్లో ఒక్కో పరీక్షకు 50కి పైగా కేంద్రాల్లో తనిఖీ బృందాలు తిరిగాయి. ద్వితీయ భాష మినహా అన్ని పరీక్షల్లోనూ విద్యార్థులు డిబార్ అయ్యారు. ఒకేరోజు గరిష్టంగా 24 మంది కాపీ కొడుతూ పట్టుబడటం... కాపీయింగ్ తీవ్రతను తెలియజేస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 71, హైదరాబాద్ జిల్లాలో 75 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. ఇందులో నలుగురు విద్యార్థులు ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ దొరికారు. ఇవన్నీ కలుపుకుంటే.. పట్టుబడిన వారి సంఖ్య 146కు చేరింది. వీరందరిపై ఆయా పోలీస్స్టేషన్లలో మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హైటెక్ కాపీయింగ్‌కు యత్నించిన ఫస్టియర్ విద్యార్థి ఎజాజ్ ఈనెల 12న సనత్‌నగర్‌లో ఇన్విజిలెటర్‌కు చిక్కిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు నగరంపై పడింది. ఉన్నతాధికారులు చాలా సీరియస్ అయ్యారు. ముగిసిన ఫస్టియర్ పరీక్షలు ఈనెల 2న ప్రారంభమైన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీ కట్టిన విద్యార్థులు.. పరీక్షలు ముగియడంతో చిరునవ్వుతో ఇంటిముఖం పట్టారు. చివరి పరీక్షలో హైదరాబాద్ జిల్లా పరిధిలో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో నలుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. వీరిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఫస్టియర్ ప్రధాన సబ్జెక్టులన్నీ పూర్తికాగా.. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులు మాత్రమే మిగిలాయి. ఇవి కూడా శనివారంతో ముగియనున్నాయి. బుధవారం జరిగే పరీక్షతో సెకండియర్ పరీక్షలు పూర్తవుతాయి. పట్టుబడ్డ విద్యార్థుల వివరాలు పరీక్ష రంగారెడ్డి హైదరాబాద్ ఫస్టియర్ 32 32 సెకండియర్ 39 39