కోతి కోసం 6 లక్షలు చెల్లించిన పాప్ స్టార్!
లాస్ ఎంజెలెస్: పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఎప్పుడు ఏదో వివాదంలోనో, మరో రకమైన వార్తల్లో గమనిస్తునే ఉంటాం. తాజాగా తన పెంపుడు కోతి మ్యాలీకి 10 వేల డాలర్లు (ఆరు లక్షల రూపాయలు) చెల్లించి వార్తల్లో నిలిచాడు. గత సంవత్సరం జర్మనీ పర్యటనలో అనుమతి పత్రాలు సమర్పించకుండా, వ్యాక్సిన్ వేయకుండా తీసుకువచ్చారనే కారణంతో అధికారులు పెంపుడు కోతిని అదుపులోకి తీసుకున్నారు.
బీబర్ పత్రాలను సమర్పించే అవకాశం లేకని కారణంగా.. చేసేదేమి లేక కోతిని జర్మనీలో వదిలివేయాల్సిన పరిస్థితి అప్పట్లో ఏర్పడింది. అప్పట్లో బీబర్ ను ఈ అంశం వివాదంలోకి నెట్టింది. తాజాగా బీబర్ 10 వేల డాలర్లు చెల్లించి పెంపుడు కోతిని తీసుకెళ్లారని జర్మన్ ఫెడరల్ నేచర్ కన్సర్వేషన్ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది. బీబర్ చెల్లించిన బీబర్ మొత్తంలో 17 నెలలపాటు ఖర్చు చేసిన మొత్తం కూడా ఉందని వివారాల్ని ఆ సంస్థ తెలిపింది.