‘సెవెన్ స్టార్’ రాఘవేంద్ర
సాక్షి, హైదరాబాద్: వి.పురుషోత్తం స్మారక అంతర్ పాఠశాల హాకీ టోర్నమెంట్లో బాలంరాయి హైస్కూల్ సత్తా చాటింది. జింఖానా మైదానంలో శనివారం జరిగిన బాలుర విభాగం మ్యాచ్‌లో ఈ స్కూల్ 15-0 గోల్స్ తేడాతో మమతా హైస్కూల్‌ను చిత్తుగా ఓడించింది. బాలంరాయి ఆటగాడు రాఘవేంద్ర ఒక్కడే 7 గోల్స్ చేయడం విశేషం. రంజిత్, ధరమ్, సాయికుమార్ తలా 2 గోల్స్ చేయగా మోహిత్, భాను ఒక్కో గోల్ చేశారు.
మరో మ్యాచ్‌లో స్యామ్సన్ చేసిన ఏకైక గోల్‌తో ఉప్పల్ హైస్కూల్ 1-0తో రహమాని హైస్కూల్‌ను ఓడించింది. ఇదే విభాగంలో మరో మ్యాచ్‌లో ఉప్పల్ హైస్కూల్ 2-1 తేడాతో ఐవీఐ లీగ్‌పై గెలుపొందింది. ఉప్పల్ తరఫున స్యామ్సన్ రెండు గోల్స్ చేయగా, ఐవీఐ తరఫున చేతన్ గోల్ చేశాడు. బాలికల విభాగంలో కేవీ గచ్చిబౌలి 6-1 స్కోరుతో కస్తూర్బా కాలేజీని చిత్తు చేసింది. కేవీ తరఫున శృతి కౌశిక్ 2 గోల్స్ చేయగా సునీత, గీత, మేఘన, సన ఒక్కో గోల్ చేశారు.