mamidala srinivas
-
పగలంతా పెద్ద మనుషులు, రాత్రి అయితే..?
పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి ఎలా మారిపోతారు, వారి క్రిమినల్ ఆలోచనలు ఎలా ఉంటాయి? తమ క్రైమ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ.. అమాయకుల జీవితాలతో ఎలా ఆడుకుంటారు? చీకట్లో, ముఖ్యంగా స్ట్రీట్ లైట్ కింద జరిగే సంఘటనలు ఏంటనేవి ‘స్ట్రీట్ లైట్’సినిమా ద్వారా చూపించబోతున్నాం’అని అన్నారు ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్. మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం "స్ట్రీట్ లైట్". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ రెండవ వారంలో గ్రాండ్ గా ప్రి రిలీజ్ చేసుకొని మూడవ వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ... క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ తో తెరకేక్కించిన మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. తెలుగు, హిందీ రెండు భాషల్లో ఈ సినిమాను తీశాం. .ముందుగా మా సినిమాను ఓటిటి లో విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ ఓటీటీల వలన కొద్దిమందికి మాత్రమే జీవనోపాధి కలుగుతుంది. అదే ఒక థియేటర్ వలన ఎంతో మందికి జీవనోపాధి కలుగుతుందనే ఆలోచనతో ప్రస్తుత పరిస్థితుల దృష్టి లో ఉంచుకొని అందరూ కూడా తమ సినిమాలను థియేటర్స్ లలోనే విడుదల చేయాలని అందరికీ సవినయంగా తెలియ జేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా సినిమా హిందీ సెన్సార్ పూర్తి చేసుకొని తెలుగు సెన్సార్ కు వెళ్లబోతుంది.మా చిత్రాన్ని సెప్టెంబర్ రెండవ వారంలో గ్రాండ్ గా ప్రి రిలీజ్ చేసుకొని మూడవ వారంలో మా సినిమాను థియేటర్స్ లొనే విడుదల చేస్తున్నాం’అన్నారు. ఈ చిత్రానికి సంగీతం విరించి; సినిమాటోగ్రఫీ : రవి కుమార్. -
వీకెండ్ పార్టీ
‘ఛలో, గీత గోవిందం, దేవదాస్’... ఇలా వరుస విజయాలతో తనకంటూ తెలుగులో మార్కెట్ను క్రియేట్ చేసుకున్నారు రష్మికా మండన్నా. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మికా నటించిన ‘గీతా–ఛలో’ ఈ నెల 26న విడుదల కావాల్సింది. అనివార్య కారణాల వలన ఈ చిత్రాన్ని మే 3న విడుదల చేస్తున్నామని చిత్రనిర్మాతలు మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ తెలిపారు. దివాకర్ సమర్పణలో శ్రీ రాజేశ్వరి ఫిలింస్ – మూవీ మాక్స్ బ్యానర్లపై ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘యువతరం మెచ్చే అన్ని హంగులు ఉన్న చిత్రమిది . వీకెండ్ పార్టీలు యువతకు మంచి చేస్తున్నాయా? చెడు చేస్తున్నాయా? అనే పాయింట్ చుట్టూ ఉన్న కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. కన్నడలో ‘ఛమ్మక్’ పేరుతో విడుదలైన ఈ చిత్రం దాదాపు 30 కోట్లు వసూలు చేసింది. మంచి చిత్రాన్ని అందరూ చూడాలనే ఉద్దేశంతో కంఫర్ట్ డేట్ మే 3న విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. -
లేజర్ టెక్నాలజీతో చిత్రసీమకు లాభం
‘‘నూతన సాంకేతిక విప్లవంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో లేజర్ టెక్నాలజీతో సినిమా ప్రదర్శనకు శ్రీకారం చుట్టాం. తక్కువ లాభాపేక్షతో ఈ టెక్నాలజీని చిత్ర పరిశ్రమకు, ప్రేక్షకులకు చేరువ చేయనున్నాం’’ అని ఎబిలిటీ మీడియా ఫ్యాక్టర్ (ఎం.ఎం.ఎఫ్) అధినేతల్లో ఒక్కరైన మామిడాల శ్రీనివాస్ తెలిపారు. లేజర్ టెక్నాలజీ ద్వారా సినిమాలను ఎలా ప్రదర్శించవచ్చో ఎబిలిటీ మీడియా ఫ్యాక్టర్, యునెటైడ్ మీడియా వర్క్స్ (యు.ఎం.డబ్ల్యు) సంస్థలు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కొన్ని చిత్రాల క్లిప్పింగ్స్ చూపించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘ఎల్.సి.డి టెక్నాలజీని కూడా మార్కెట్ ధరల కన్నా తక్కువకే అందిస్తున్నాం. ఈ విధానం వల్ల సినిమా విడుదల ఖర్చులో 60 నుంచి 70 శాతం సేవ్ అవుతుంది. తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన టెక్నాలజీ ఇస్తున్నాం’’ అన్నారు. ఎం.ఎం.ఎఫ్ భాగస్వామి విఎల్ మల్లికార్జున్ గౌడ్, యుఎండబ్ల్యు కంట్రీ హెడ్ అముల్గాడ్గే, హిటాచీ నేషనల్ హెడ్ రాజగోపాల్, నిర్మాత సంగిశెట్టి దశరథ తదితరులు పాల్గొన్నారు.