లేజర్ టెక్నాలజీతో చిత్రసీమకు లాభం
‘‘నూతన సాంకేతిక విప్లవంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో లేజర్ టెక్నాలజీతో సినిమా ప్రదర్శనకు శ్రీకారం చుట్టాం. తక్కువ లాభాపేక్షతో ఈ టెక్నాలజీని చిత్ర పరిశ్రమకు, ప్రేక్షకులకు చేరువ చేయనున్నాం’’ అని ఎబిలిటీ మీడియా ఫ్యాక్టర్ (ఎం.ఎం.ఎఫ్) అధినేతల్లో ఒక్కరైన మామిడాల శ్రీనివాస్ తెలిపారు. లేజర్ టెక్నాలజీ ద్వారా సినిమాలను ఎలా ప్రదర్శించవచ్చో ఎబిలిటీ మీడియా ఫ్యాక్టర్, యునెటైడ్ మీడియా వర్క్స్ (యు.ఎం.డబ్ల్యు) సంస్థలు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కొన్ని చిత్రాల క్లిప్పింగ్స్ చూపించారు.
శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘ఎల్.సి.డి టెక్నాలజీని కూడా మార్కెట్ ధరల కన్నా తక్కువకే అందిస్తున్నాం. ఈ విధానం వల్ల సినిమా విడుదల ఖర్చులో 60 నుంచి 70 శాతం సేవ్ అవుతుంది. తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన టెక్నాలజీ ఇస్తున్నాం’’ అన్నారు. ఎం.ఎం.ఎఫ్ భాగస్వామి విఎల్ మల్లికార్జున్ గౌడ్, యుఎండబ్ల్యు కంట్రీ హెడ్ అముల్‌గాడ్గే, హిటాచీ నేషనల్ హెడ్ రాజగోపాల్, నిర్మాత సంగిశెట్టి దశరథ తదితరులు పాల్గొన్నారు.