Mamta
-
నిర్మాత శేఖర్‌బాబు మృతి
ప్రముఖ నిర్మాత కేసీ శేఖర్ బాబు (71) శనివారం మృతి చెందారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని స్వగృహంలో తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. 1946 జనవరి 5న కృష్ణాజిల్లా గన్నవరంలోని కోలవెన్నులో కంచర్ల నారాయణరావు, కమలాదేవి దంపతులకు జన్మించారు శేఖర్‌బాబు. తండ్రి చిత్ర పంపిణీ రంగంలో ఉండటంతో ఇంటర్ తర్వాత శేఖర్‌బాబు కూడా సినీ రంగంలోకి ప్రవేశించారు. 1973లో కృష్ణ, జమున కాంబినేషన్లో ‘మమత’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ రాసింది ఆయనే. ఆ తర్వాత ‘సంసార బంధం’, ‘గోపాలరావుగారి అమ్మాయి’, ‘పక్కింటి అమ్మాయి’ వంటి సినిమాలు నిర్మించారు. కృష్ణంరాజుతో ‘జగ్గు’, ‘సర్దార్, సాహస సామ్రాట్’, చిరంజీవితో ‘ముఠామేస్త్రీ’ వంటి చిత్రాలు నిర్మించారు. దాదాపు అన్ని చిత్రాలనూ వేరే నిర్మాతలతో కలసి నిర్మించారు. ఫిలిం సెంట్రల్ బోర్డ్ చైర్మన్‌గా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన గత కొంత కాలంగా దక్షిణాది ఫిలించాంబర్ కమిటీ మెంబర్ పదవిలో ఉన్నారు. ఆయన మృతిపట్ల చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు దిగ్భా్రంతి వ్యక్తం చేశారు. శేఖర్‌బాబుకి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమవారం ఆయన ఆంత్యక్రియలు జరగనున్నాయి. -
'రష్యన్ కోణంలో దర్యాప్తు జరపాల్సిందే'
-
'రష్యన్ కోణంలో దర్యాప్తు జరపాల్సిందే'
నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు తాను నమ్మడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు. నిజం నిర్ధారించలేకపోవడం మన దేశానికే సిగ్గు చేటని, ఆయన గురించి రష్యన్ కోణంలో దర్యాప్తు చేపట్టాలని కోల్ కతాలో జరిగిన నేతాజీ 75వ వార్షికోత్సవ సందర్భంలో ఆమె డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మాగాంధీ జాతి పిత అయితే, స్వాతంత్ర్యం రాకముందు నేతాజీ జాతి నేత అని ఆమె అన్నారు. నేతాజీ ప్రమాదంలో చనిపోయి ఉంటే... స్వాతంత్ర్యం తర్వాత ఆయన కుటుంబం రహస్యంగా ఎందుకు బతకాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనికి సమాధానం కావాలంటే రష్యన్ కోణంలో దర్యాప్తు జరగాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా నేతాజీ మనవడు ఆశిష్ రే నిర్వహిస్తున్న బ్రిటిష్ కు చెందిన వెబ్ సైట్ www.bosefiles.info అదే విషయంపై అధ్యయనాలు నిర్వహించి, నివేదికలను వెల్లడించింది. ఏళ్లకాలంగా ఉన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు నేతాజీ చివరి రోజుల్లోని వివరాలు, ప్రత్యక్ష సాక్ష్యాలను సేకరించి వెబ్ సైట్ లో పొందుపరిచింది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు ఆ వెబ్ సైట్‌లోని నాలుగు నివేదికలూ నిర్ధారిస్తున్నాయి. ఆగస్టు 18, 1945లో తైపీ దగ్గర జరిగిన విమాన ప్రమాదం తర్వాత సుభాష్ చంద్రబోస్ మరణించారని, అయితే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ విషయాన్ని నమ్మడం లేదని, రష్యన్ కోణంలో దర్యాప్తును కోరుకుంటున్నారని రే అంటున్నారు. విమాన ప్రమాదం ఎలా జరిగింది? బోస్ ప్రమాదం నుంచి బయట పడ్డారా లేదా అన్న వివరాలపై ఆయన అనుచరుడు కల్నల్ హాబిబర్ రెహ్మాన్ చెప్పిన విశేషాలు సహా మరిన్ని వివరాలను ఆశిష్ రే... తాజాగా వెబ్ సైట్లో పోస్ట్ చేశారు. బోస్ అనుచరుడు చెప్పిన ప్రకారం ఎయిర్ క్రాష్ నుంచి బోస్ తో పాటు రెహ్మాన్ కూడా బయట పడ్డారని, ఆరోజు ఫిన్నే, డేవిస్... అనే ఇద్దరు పోలీసు అధికారుల నేతృత్వంలో ఇండియానుంచి దర్యాప్తు కోసం హెచ్ కె రాయ్, కెపి డే నిఘాజట్లు సైగాన్, తైపీలలో దర్యాప్తు చేపట్టడం కోసం బ్యాంకాక్ కు వెళ్ళారని, జపనీస్ అధికారిక డాక్టర్ ట్సురుతాను విచారించామని రే చెప్తున్నారు. బోస్ చనిపోయే ముందు నర్స్ ట్సాన్ పై షా చికిత్స అందించారని, డాక్టర్ యోష్మి ని రే స్వయంగా కలిశానని కూడ అంటున్నారు. విమాన ప్రమాదం తర్వాత బోస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఈ వివరాలన్నీ నిర్ధారిస్తున్నాయని రే స్పష్టం చేస్తున్నారు. నోనోమియా అనే లెఫ్టినెంట్... సుభాష్ చంద్రబోస్ ఓ ప్రత్యేకమైన, ప్రముఖమైన వ్యక్తి అని చెప్పారని, అందుకే ఆయన్ను ఎలాగైనా బతికించాలని ప్రయత్నించామని డాక్టర్ యోష్మి అన్నట్లు కూడా రే వెల్లడించారు. అయితే బోస్ పరిస్థితి విషమంగా మారుతున్న సమయంలో ఆయన్ను ఎలా ఉంది అని అడిగితే... తలలో తీవ్ర రక్తప్రసరణ జరుగుతున్నట్లనిపిస్తోందన్నారని, ఓ ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే ఆయన ప్రాణంపోయిందని డాక్టర్ రేష్మి వివరించినట్లు 'రే' చెప్తున్నారు. మమతా బెనర్జీకి ఈ విషయాలపై నమ్మకం కుదరడం లేదని అందుకే ఆమె రష్యన్ కోణంలో దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నారని ఆశిష్ రే అంటున్నారు. -
మమత పట్ల ఎన్ఐఏకు అపనమ్మకం?
కోల్‌కతా: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు పశ్చిమబెంగాల్ సర్కార్ పట్ల నమ్మకం లేదా? ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విశ్వసించడం లేదా? తాజాగా కోల్‌కతాలో ఎన్ఐఏ కార్యాలయం వెలుపల సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుడు సంఘటన అనంతరం ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాక్షాత్తూ ఎన్ఐఏ అధికారులే తమ భద్రత పట్ల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఐఏ అధికారులు పశ్చిమబెంగాల్లో భద్రత లోపాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తమకు మరింత భద్రత కల్పించాలని ఎన్ఐఏ అధికారులు పశ్చిమబెంగాల్ డీజీపీని కోరారు. అలాగే ఉగ్రవాద కార్యకలాపాల దర్యాప్తుకు వెళ్లినపుడు తమకు మరింత భద్రత పెంచాలని కోరారు. ఎన్ఐఏ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు జరిగిన ప్రదేశాన్ని సీఆర్పీఎఫ్, ఎన్ఐఏ అధికారులు పరిశీలించారు. ఇదిలావుండగా, మధురై బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ అధికారులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. -
నిధి అన్వేషణలో...
నరేష్ గుప్తా స్వీయదర్శకత్వంలో రెండు చిత్రాలు నిర్మించారు. ఒకటేమో సాయికిరణ్, మమత జంటగా ‘ప్లాన్’ కాగా, మరొకటి అంతా కొత్తవారితో ‘ఆరాటం’. ఈ రెండు చిత్రాల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 28న ఈ రెండు చిత్రాల ఆడియో వేడుక జరపనున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘నిధి అన్వేషణ నేపథ్యంలో ‘ప్లాన్’ సాగుతుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రేమ కోసం మాత్రమే కాదు, కెరీర్‌ని కూడా యువత దృష్టిలో పెట్టుకోవాలనే కథాంశంతో ‘ఆరాటం’ చిత్రాన్ని నిర్మించాం’’ అని చెప్పారు.