కోల్కతా: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు పశ్చిమబెంగాల్ సర్కార్ పట్ల నమ్మకం లేదా? ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విశ్వసించడం లేదా? తాజాగా కోల్కతాలో ఎన్ఐఏ కార్యాలయం వెలుపల సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుడు సంఘటన అనంతరం ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాక్షాత్తూ ఎన్ఐఏ అధికారులే తమ భద్రత పట్ల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్ఐఏ అధికారులు పశ్చిమబెంగాల్లో భద్రత లోపాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తమకు మరింత భద్రత కల్పించాలని ఎన్ఐఏ అధికారులు పశ్చిమబెంగాల్ డీజీపీని కోరారు. అలాగే ఉగ్రవాద కార్యకలాపాల దర్యాప్తుకు వెళ్లినపుడు తమకు మరింత భద్రత పెంచాలని కోరారు. ఎన్ఐఏ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు జరిగిన ప్రదేశాన్ని సీఆర్పీఎఫ్, ఎన్ఐఏ అధికారులు పరిశీలించారు. ఇదిలావుండగా, మధురై బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ అధికారులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
మమత పట్ల ఎన్ఐఏకు అపనమ్మకం?
Published Mon, Nov 10 2014 11:41 PM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM
Advertisement
Advertisement