నెట్వర్క్ మెరుగుకు సమాచారం ఇవ్వండి..
- కాల్ డ్రాప్స్ లేకుండా చేస్తాం...
- కస్టమర్లకు ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ లేఖ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ దిగ్గజం ఎయిర్టెల్.. భారత్‌లో తొలిసారిగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కస్టమర్లకు మరింత మెరుగైన, నాణ్యమైన నెట్వర్క్ అందించేందుకు నేరుగా రంగంలోకి దిగింది. కాల్ డ్రాప్స్ సమస్యలు ఉంటే తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఎయిర్టెల్ ఇండియా, సౌత్ ఆసియా ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ స్వయంగా కస్టమర్లకు ఈ-మెయిల్ ద్వారా లేఖ పంపారు. ‘నెట్‌వర్క్‌ను మెరుగు పరిచేందుకు ఎయిర్‌టెల్‌కు సహాయం చేయండి. మీకు సహాయం చేసేందుకు కంపెనీకి వీలు కల్పించండి’ అంటూ తన లేఖలో కోరారు. కాగా, కస్టమర్లు లేఖలో ఉన్న లింక్‌పై క్లిక్ చేసి తాము ఉండే ప్రాంతం పేరు నిర్దేశిస్తే చాలు. కంపెనీ సిబ్బంది రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తారు.