Mancherial Assembly Constituency
-
కాంగ్రెస్ వచ్చేది లేదు.. పోయేది లేదు: కేసీఆర్
సాక్షి, మంచిర్యాల: ‘‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేపట్టా. 33 పార్టీలు తెలంగాణకు అండగా నిలిస్తే తెలంగాణ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది ఏమీ లేదు’’ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఓటేసే ముందు ఎవరు అభివృద్ధిని చేశారో అనేది పరిగణనలోకి తీసుకోవాలని ప్రజలను కోరారాయన. శుక్రవారం మధ్యాహ్నాం మంచిర్యాల నస్పూర్‌లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘‘తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేయలేదు. గోదావరి పక్కనే పారతున్నా కాంగ్రెస్ హయాంలో మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ వల్లే 58 ఏళ్లు తెలంగాణ గోసపడింది. అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని ఏడిపించారు’’ అని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజల కోసమే పుట్టింది బీఆర్ఎస్. మంచి ఎమ్మెల్యే గెలిస్తే మంచి ప్రభుత్వం వస్తుంది. రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. రైతుబంధు తెచ్చిందే బీఆర్ఎస్. కానీ, అది దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతులకు 3గంటలు కరెంట్ చాలని అంటున్నారు. అభ్యర్థుల గుణగణాలు, పార్టీల చరిత్ర చూసి ఓటేయాలి. ఓటు మన నుదుటి రాత మారుస్తుంది’’ అని ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ వాళ్లు కొత్త పద్ధతి మొదలు పెట్టారని, నన్ను గెలిపిస్తే.... ఎన్నికలయ్యాక బీఆర్ఎస్లో చేరుతామని ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు చెబుతున్నారట.. కానీ అదంతా ఝూటా ముచ్చట (అబద్దం). తనను గెలిపిస్తే బీఆర్ఎస్లో చేరుతానని ఇక్కడ(మంచిర్యాల) నాయకుడు కూడా చెబుతున్నాడట.. నాకు వార్త వచ్చింది... కానీ అదేం లేదు అంతా అబద్దం. మీ వద్ద కాంగ్రెస్ నాయకుడు గెలిస్తే మీ వాడకట్టుకో పేకాట క్లబ్ వస్తుంది. అప్పుడు మంచిర్యాల మొత్తం పేకాట క్లబ్బులు తయారవుతాయి. అప్పుడు ఇళ్లు అమ్ముకొని పేకాటలో పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. అయిదేళ్ల భవిష్యత్తు బాగుపడాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి. కాంగ్రెస్ హయాంలో ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు ఉండేవి. 1969లో కాంగ్రెస్ నాలుగు వందల మంది ఉద్యమకారులను కాల్చి చంపింది. మలి దశ ఉద్యమంలో బీఆర్ఎస్ను చీల్చే ప్రయత్నం చేసింది. మళ్లీ అధికారంలోకి వచ్చాక పెన్షన్ పెంచుతాం. 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. రైతుబంధు కూడా పెంచుతాం. తెలంగాణను మోసం చేసిందే కాంగ్రెస్ అని విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అని కేసీఆర్ అన్నారు. సింగరేణిని లాభాల్లోకి తెచ్చాం ఓటు ప్రజల తలరాతల్ని మారుస్తుందని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘డిసెంబర్ 3 నుండి అసలు దుకాణం ప్రారంభం అవుతుంది. తెలంగాణను, సింగరేణిని ముంచిందే కాంగ్రెస్. రూ. 600 కోట్ల మారిటోరియంలో ఉన్న సింగరేణిని రెండు వేల కోట్ల లాభాల్లోకి తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. సింగరేణి సంస్థలు విస్తరించి బయ్యారం ఉక్కు గనులను అప్పగిస్తాం. ప్రత్యేక తెలంగాణలో మేధావులతో చర్చించి సంక్షేమ పథకాలు అమలు చేశాం. ధరణిని తెచ్చిందే బీఆర్ఎస్. ధరణిని కాంగ్రెస్ తీసేస్తామంటోంది. ధరణిని తీసివేస్తే రైతుబంధు ఎలా ఇస్తారు?. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగం ఆగం కావొద్దు. అభ్యర్థి గుణగణాలు.. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలి. ఓటు ప్రజల తలరాతలు మారుస్తుంది. ఇంకా అభివృద్ధి చేసుకుందాం ములుగు జిల్లా ములుగు కేంద్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ వచ్చిన రోజుల్లో దారుణమైన పరిస్థితులు ఉండేవి. సమ్మక్క సారలమ్మ జాతరకు ఒకప్పుడు ఆదరణ లేదు. కనీసం రోడ్డు కూడా సరిగా వేయలేదు. అధికారంలోకి వచ్చాక రోడ్డు వేసుకున్నాం. బీఆర్ఎస్ పదేళ్ల పాలన.. కాంగ్రెస్ యాభై ఏళ్ల పాలన బేరీజు వేసుకోవాలి. ఎవరు అభివృద్ధి చేస్తారో గమనించి ఓటేయాలి. రైతు బంధు పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్. రైతు బంధు వృథా అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. కాంగ్రెస్ యాభై ఏళ్లు దేశాన్ని, రాష్ట్రంను పాలించింది. కాంగ్రెస్ పాలనలో మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. నీటి పన్ను లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. కానీ, కాంగ్రెస్ వాళ్లు 24 గంటలు వృథా.. 3 గంటలు చాలని అంటున్నాడు. కాంగ్రెస్ ఇచ్చిన పెన్షన్ రూ.200 రూపాయలు. మనం పెన్షన్ రూ.5 వేలకు పెంచుకుందాం. తెలంగాణను ఇంకా అభివృద్ధి చేసుకుందాం’’ అని కేసీఆర్ అన్నారు. సీతక్కపై విమర్శలు ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఉద్దేశించి కేసీఆర్ విమర్శ చేశారు. ‘‘గత ఎన్నికల్లో మీరు(ములుగు ప్రజల్ని ఉద్దేశించి..) నన్ను(బీఆర్ఎస్) గెలిపించకున్నా నేను అలగలేదు. కానీ, ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నా.. ముఖ్యమంత్రిని కలవాలి. కానీ, మీ ఎమ్మెల్యే(సీతక్క) ఎప్పుడూ మా దగ్గరకు రాలేదు’’ అని అన్నారాయన. అలాగే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తానంటే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటోందని.. కానీ, ఇందిరమ్మ రాజ్యంలో ఎన్కౌంటర్లు, ఎమర్జెన్సీలు ఉండేవని.. కాబట్టి కాంగ్రెస్ గెలిచేది లేదు.. పోయేది లేదు అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. -
మంచిర్యాల: పత్యర్థులపై వ్యూహాస్రాలు.. గెలుపు ధీమాతో పార్టీలు!
ఆ ఎమ్మెల్యే వైఫల్యాల రాజు.. ప్రగతిని పరుగులు పెట్టించలేదని సోంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావును మార్చాలంటున్నారు. మార్చకపోతే మునగడం ఖాయమంటున్నారు. అయినా అధిష్టానం మళ్లీ ఆయనకే టికెట్ కట్టబెట్టింది. సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉన్న దివాకర్‌కు కేసీఆర్ ఏ ధీమాతో టికెట్ ఇచ్చారో అర్థం కాని విషయం అంటున్నారు. మరి మంచిర్యాలలో బీఅర్ఎస్ కోటలకు బీటలు పారుతుందా? కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమైందా?మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు గుండా గండమే కాంగ్రెస్‌కుకు గండంగామారిందా? సింగరేణి సమరంలో కమలం సత్తా చాటుతుందా? మంచిర్యాల ఎన్నికల యుద్దంపై సాక్షి స్పేషల్ రిపోర్ట్. మంచిర్యాల నియోజకవర్గం అపారమైనా నల్లబంగారం నిల్వలు ఉన్నా ప్రాంతం. వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉపాదినిస్తోంది. అలాంటి నియోజకవర్గంలో మంచిర్యాల, హజీపూర్, నస్పూర్, దండేపల్లి, లక్షిట్పెట మండలాలు ఉన్నాయి. ఇక్కడ 2,46,982 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో పేరుక సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ. మిగితా కులాల్లో మున్నూరు, ఎస్సీ, యాదవ, గౌడ, పద్మశాలి, సింగరేణి ఓటర్లు ఉన్నారు. పేరుక సామాజిక, సింగరేణి కార్మికుల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయి. అయితే గులాబి పార్టీకి మంచిర్యాల కంచుకోట. ఉద్యమకాలం నుండి ఇప్పటి వరకు కార్మికులు పార్టీకి అండగా నిలుస్తున్నారు. తెలంగాణ రాకముందు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అరవింద్ రెడ్డి రెండు సార్లు విజయం సాధించారు. తెలంగాణ అవతరణ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండుసార్లు బీఅర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు విజయం సాధించారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే దివాకర్ రావు విజయం సాదించారు. 2018 ఎన్నికలలో దివాకర్ రావు 75,360 ఓట్లు సాదించి 45 శాతం ఓట్లు సాదించారు. ప్రేమ్ సాగర్ రావుపై 4,848 ఓట్ల తేడాతో ఓటమి నుండి ఓడ్డేకారు దివాకర్ రావు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు 70,512 ఓట్లతో 42 శాతం ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘునాథ రావు 5018 ఓట్లతో మూడు శాతం ఓట్లు సాదించారు. డిపాజిట్ కోల్పోయారు. దివాకర్ రావు అంతకు ముందు రెండుసార్లు విజయం సాధించారు. బీఅర్ఎస్ ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత రోడ్లు, త్రాగునీటి వసతి, జిల్లా కేంద్రంలో మెడికల్ కళశాల సాధించారు. అదే విధంగా నూతన కలెక్టర్ కార్యాలయం పనులు చేసేలా చోరవ చూపారు. జిల్లా అసుపత్రి అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇంటిగ్రేట్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. మాతశిశు ఆసుపత్రి గోదావరి తీరంలో నిర్మించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రగతిని పరుగులు పెట్టించలేదని అపవాదును ఎదుర్కోంటున్నారు. మంచిర్యాల వేగంగా విస్తరిస్తున్నా పట్టణం. కానీ అభివృద్ధి లేదు. గోదావరి ప్రక్కన ఉన్నా వేసవి వచ్చిందంటే నీటి కోరతతో కొన్ని కాలనివాసులు ఇబ్బందులు పడుతున్నారు. మాతశిశు ఆసుపత్రి గోదావరి తీరంలో నిర్మించడం వల్ల వర్ష కాలంలో నీటిలో మునిగిపోయింది. పట్టణానికి దూరంగా నిర్మించడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గూడేం ఎత్తిపోతల పథకం నిర్వహణ అద్వానంగా మారింది. నీరందించే పైపులు పగిలిపోతున్నాయి. దాంతో చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మర్మమత్తుల ఎమ్మెల్యే సకాలంలో స్పందించలేదని రైతులు అసంతృప్తితో రగిలిపోతున్నారట. అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఏకంగా రోడ్లు వేయని ఎమ్మెల్యే మా గ్రామాలకు, కాలనిలకు రావద్దని లక్షిట్పెపెట్, ఇతర ప్రాంతాల్లో ప్రజలు ప్లేక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. తమను ఓట్లు అడగవద్దంటున్నారు. ఇవన్ని ఒక ఎత్తయితే మంచిర్యాల ప్రాంతంలో సింగరేణి, సర్కార్ భూములు బీఅర్ఎస్ నాయకులు లూటీ చేశారనే అరోపణలు ఉన్నాయి. పైగా భూముల లూటీల దందాలో ఎమ్మెల్యే పాత్ర ఉందని కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు ఆరోపణలు సందిస్తుండటం విశేషం. రాబోయే ఎన్నికల్లో బీఅర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు అయితే ప్రతికూల ఫలితం తప్పదని సర్వేలో తెలిందని పార్టీ వర్గాలంటున్నాయి. కానీ మరోసారి ఆయనకే టికెట్ రావడంతో ముధోల్‌లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యే వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు ప్రత్యర్థులు. గత అసెంబ్లీ ఎన్నికలలో దివాకర్ రావు కేవలం 4848 ఓట్లతో ప్రేమ్ సాగర్ రావును ఓడించారు. దాంతో ఈసారి ఎన్నికలలో ఎమ్మెల్యేపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రేమ్ సాగర్‌రావు కసితో ఉన్నారు. ప్రజల్లో దివాకర్ రావుపై వ్యతిరేకత పెరగడం, రుణమాఫి, సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ ఇచ్చిన మీలు నేరవేర్చకపోవడం ఇలాంటి ఆంశాలు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకవెళ్లుతున్నారు. పార్టీకి ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఈసారి ఆరునూరైనా ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ప్రేమ్ సాగర్‌రావు తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. కానీ కొందరు ప్రేమ్ సాగర్ కంటే ఆయన భార్య సురేఖ గెలిచే అభ్యర్థిగా అవుతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఎన్నికలలో తానే పోటీచేస్తానంటున్నారు ప్రేమ్ సాగర్ రావు. అయితే బీఅర్ఎస్ మాత్రం ప్రేమ్ సాగర్ గెలిస్తె మంచిర్యాలలో రౌడి రాజ్యం వస్తుందని ప్రచారం చేస్తోంది. ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడేలా వ్యూహాలు రచిస్తోంది. గులాబీ పార్టీ గత ఎన్నికల మాదిరిగా మళ్లీ అదే అస్త్రాన్ని ఉపయోగిస్తోంది. ఇక బీఅర్ఎస్ తనపై వేసిన రౌడి ముద్రను ప్రేమ్ సాగర్ రావు కొట్టిపారేస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామంటున్నారు. ఇక నియోజకవర్గంలో కమలం పార్టీ పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన రఘునాథ రావుకు 5వేల ఓట్లు మించలేదు. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది పార్టీ బలం. కానీ ఈసారి పార్టీ అభ్యర్థిని మార్చి సత్తా చాటుతామంటున్నారు కమలం పార్టీ నాయకులు. మూడు పార్టీలు మంచిర్యాలపై జెండాను ఎగురవేస్తామంటున్నారు. మరి ముధోల్‌లో ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి. -
మంచిర్యాల రాజకీయ చరిత్ర : గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
మంచిర్యాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఎన్.దివాకరరావు నాలుగోసారి గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ ఐ నేత ప్రేమ్ సాగరరావుపై 4877 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. దివాకరరావు వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. గతంలో మంచిర్యాల ఏర్పడకముందు రెండుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. 2014లో ఆయన టిఆర్ఎస్లో చేరి వరసగా మరో రెండుసార్లు గెలుపొందారు. దివాకరరావుకు 75070 ఓట్లు రాగా, ప్రేమ్ సాగరరావుకు 70193 ఓట్లు వచ్చాయి. ప్రేమ్ సాగరరావు ఎమ్మెల్సీగా పని చేశారు. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసి ఎర్రబెల్లి రఘునాధరావుకు 4981 ఓట్లు వచ్చి మూడోస్థానంలో నిలిచారు. మంచిర్యాలలో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మూడుసార్లు టిఆర్ఎస్ పార్టీనే గెలిచింది. భారీ తేడాతో పరాజయం.. మంచిర్యాల నియోజకవర్గంలో 2014 వరకు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అరవింద్ రెడ్డి టిఆర్ఎస్ను వదలి కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసి భారీ తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక్కడ 2014లో కాంగ్రెస్ ఐ నుంచి టిఆర్ఎస్లోకి వచ్చిన ఎన్. దివాకరరావు విజయం సాధించారు. దివాకరరావు అంతకుముందు ఉన్న లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొంది, తిరిగి మరో రెండుసార్లు మంచిర్యాల నుంచి గెలిచారు. 2014లో దివాకరరావుకు 59,250 ఓట్ల ఆధిక్యత వచ్చింది. దివాకరరావు వెలమ సామాజికవర్గానికి చెందినవారు. మంచిర్యాలలో రెడ్డి వర్గానికి చెందిన అరవిందరెడ్డి 2009 సాధారణ ఎన్నికలోను, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలోను గెలుపొందారు.2014లో ఓటమిపాలయ్యారు. గతంలో లక్సెట్టిపేట నియోజకవర్గం ఉండేది. అక్కడ ఒకరు చుంచు లక్ష్మయ్య (బిసి) తప్ప మిగిలినవారంతా వెలమ సామాజికవర్గానికి చెందినవారు కావడం విశేషం. రెండుసార్లు గెలిచిన అరవింద్‌రెడ్డి ప్రముఖ కాంగ్రెస్ నేత, జడ్.పి.చైర్మన్‌గా రెండుసార్లు, ఓసారి ఎమ్.పి.గా గెలిచిన జి.నరసింహారెడ్డి కుమారుడు. అంతకు ముందు పాత నియోజకవర్గం లక్సెట్టిపేటకు 13 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి రెండుసార్లు, జనతాపార్టీ, సోషలిస్టు పార్టీ ఒక్కోసారి గెలవగా ఒక ఇండిపెండెంటు కూడా మరోసారి నెగ్గారు. మాజీ ఉప ముఖ్యమంత్రి జె.వి. నరసింగరావు ఇక్కడ 1967,72లలో గెలవగా అంతకుముందు 1962లో ఆయన బంధువు జి.వి.పితాంబరరావు చేతిలో ఓడిపోయారు. జె.వి. నరసింగరావు 1957లో బేగంబజార్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. రెండు సార్లు పీతాంబరరావు గెలిస్తే, ఆయన సోదరుడు జి.వి.సుధాకరరావు కూడా మరో రెండుసార్లు విజయం సాధించారు. మరో దళిత నేత రాజమల్లు ఇక్కడ ఒకసారి, సిర్పూరులో మరోసారి, చిన్నూరులో మూడు సార్లు గెలిచారు. జె.వి. నర్సింగరావు గతంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాలలో సభ్యునిగా ఉండగా, జి.వి.సుధాకరరావు 1978లో శాసనసమండలి సభ్యునిగా ఉన్నప్పుడు చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గాలలో, 1989లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేసారు. రాజమల్లు 1974లో జలగం క్యాబినెట్లో పనిచేసారు. జె.వి. నర్సింగరావు అప్పట్లో కాసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంచిర్యాలలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..