మండల పరిషత్ స్వరూపం అధ్యక్షుల విధులు, బాధ్యతలు
మండల పరిషత్ సమావేశంలో ఆమోదించిన తీర్మానాల అమలుకు ఎంపీడీవోపై పరిపాలన నియంత్రణ అధికారం కలిగి ఉంటారు. - సెక్షన్ 165(1)ఏ
జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు పంపే ముఖ్యమైన ప్రతిపాదనలు అధ్యక్షుని ఆమోదంతో పంపించాలి.
మండల సమావేశాలకు అధ్యక్షత వహించి, వివిధ కార్యకలాపాలు నిర్వహించే హక్కు ఉంటుంది. - సెక్షన్ 165(1)బి
మండల పరిషత్‌కు సంబంధించిన ఏదైనా అమలు చేయాలని ఉంటే విషయ పరిజ్ఞానం కలిగి ఉండి, ఏ రాజకీయ పార్టీలోనూ కార్యవర్గ సభ్యుడుగా లేని వ్యక్తిని ప్రత్యేక ఆహ్వానితునిగా మండల పరిషత్ సమావేశాలకు ఆహ్వానించవచ్చు. - సెక్షన్ 159
సమావేశాల తేదీ, సమయం, అజెండా అంశాలకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
సమావేశాల్లో క్రమశిక్షణ పాటించిన సభ్యులు తదుపరి సమావేశాల్లో పాల్గొనకుండా నాలుగు నెలల వరకు సస్పెండ్ చేసే అధికారం ఉంది.
{పభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించే ఏ నిర్మాణపు పనైనా, కార్యకమైన చేయాల్సిందిగా ఆదేశించరాదు. - సెక్షన్ 165(2)
మండల విద్యాకమిటీ చైర్మన్ హోదాలో విద్యాకమిటీల పనితీరును సమీక్షించి మార్గదర్శకం చేయాలి.
ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ కమిటీకి అధ్యక్షునిగా వ్యవహరిస్తారు.
మండల పరిషత్ పాఠశాలలను సందర్శించి విద్యాప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలి.
మండలంలో అభివృద్ధి పనులను తనిఖీ చేసి సమీక్షించవచ్చు.
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో శాశ్వత ఆహ్వానితునిగా మండల సమస్యలపై చర్చించవచ్చు.
ఎంపీటీసీ సభ్యుల విధులు - బాధ్యతలు
మండల పరిషత్ సమావేశాల్లో సమస్యలపై చర్చించి ఇతర సభ్యులతో కలిసి పరిష్కార మార్గాలు అన్వేషించాలి.
మండల అభివృద్ధి కోసం విధాన నిర్ణయాలు సమావేశాల్లో తీసుకుంటారు. సభ్యులు హాజరై నిర్ణయాలను ప్రభావితం చేయాలి.
ఎనిమిది రోజుల నోటీసుతో సమావేశాల్లో తీర్మానాలను ప్రతిపాదించవచ్చు.
15 రోజుల నోటీసుతో ప్రశ్నలను మండల పరిషత్‌కు పంపించి, వాటిని సమావేశాల్లో చర్చించడం ద్వారా జవాబు దారీతనాన్ని తీసుకు రావచ్చు.
అధికారులను పనితీరును సమీక్షించి ముందస్తు నోటీసుతో మండల రికార్డులను పరిశీలించవచ్చు.
ఏదైనా ప్రత్యేక అంశాన్ని చర్చించేందుకు 1/3వంతు సభ్యుల సహకారంతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడిని కోరవచ్చు.
పరిపాలన సంబంధిత అధికారాలు
ఎంపీడీవో, మండల పరిషత్ అధికారులు, సిబ్బంది, విద్యాసంస్థలపై పరిపాలన నియంత్రణ కలిగి ఉంటుంది. - సెక్షన్ 168
పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం మండలానికి నిర్దేశించిన ఏ పనినైనా చేయమని ఎంపీడీవోను నిర్దేశించవచ్చు.
ఎంపీడీవో ఆధీనంలోని ఏ రికార్డునైనా తమకు దాఖలు చేయమని మండల పరిషత్ కోరవచ్చు. - సెక్షన్ 163
ఆర్థిక వనరులు
పంచాయతీ రాజ్ చట్టం 1994లోని సెక్షన్ 172 ప్రకారం మండల పరిషత్‌కు ఆదాయ వనరులు అందుతాయి.
ఆస్తి బదిలీలపై సుంకం నుంచి సర్‌చార్జీ, సీనరేజీ రుసుం, వినోద పన్నుల ద్వారా ఆదాయం.
మార్కెట్ రుసుం, వాణిజ్య సముదాయాలు, ఫల వృక్షములపై ఆదాయం, రేవులపై సుంకం, సిబ్బంది నివాస గృహాలపై అద్దె, ఇతర పాఠశాలల నిధులు, నిరుపయోగ వస్తువుల అమ్మకాలు.
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మండల పరిషత్‌లకు రూ.8చొప్పున తలసరి గ్రాంటు విడుదలవుతుంది.
ఆర్థిక సంఘం నిధులు, పథకాల అమలుకు నిధులు విడుదలవుతాయి.
మండల పరిషత్ అధికారులు, ప్రజాప్రతినిధులకు రవాణా భత్యం, దిన భత్యం, గౌరవ వేతనాలు అందుతాయి.
జిల్లా విద్యాశాఖ అధికారి విడుదల చేసే అగంతక నిధి(కాంటింజెంట్ గ్రాంటు)
మండల పరిషత్‌లకు రవాణా, కాంటింజెంటు గ్రాంట్లు
సామాజిక అభివృద్ధి పథకాల నిధులు
ధర్మాదాయం, ధరావత్లు, పంచాయతీ విధించిన పన్నులపై సర్‌చార్జీ
వనరుల సమీకరణ
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు, ఇతర నిధులు రాబట్టుకోవాలి.
జిల్లా పరిషత్ పూర్తి అనుమతితో మండలంలోని గ్రామ పంచాయతీ నిధుల నుంచి కొంత మొత్తం వినియోగించుకోవచ్చు. - సెక్షన్ 161(3)
ప్రభుత్వ అనుమతి మేరకు గ్రామ పంచాయతీ పన్నులపై కొంత సర్‌చార్జీ విధించవచ్చు. - సెక్షన్ 161(4)
ప్రభుత్వ అనుమతి, షరతులకు లోబడి పంచాయతీరాజ్ చట్టం ద్వారా నిర్దేశించిన విధుల నిర్వహణకు అవసరమైన డబ్బును అప్పుగా పొందవచ్చు. - సెక్షన్ 161(1)