తెలుగు భాషాభిమాని మండలి
అవనిగడ్డః ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణతో పాటు తెలుగు భాషాభివృద్ధికి పాటుపడిన దివంగత మంత్రి మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు ఎనలేనివని మలేషియా తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు దాతుక్ అచ్చయ్యకుమార్ కొనియాడారు. అవనిగడ్డలో గురువారం నిర్వహించిన మండలి వెంకటకృష్ణారావు 90వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅథిగా హాజరయ్యారు. తొలుత మలేషియా బృందానికి పులిగడ్డలో ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం కులపతి మునిరత్నం నాయుడు, అసోసియేషన్ వైస్ప్రెసిడెంట్ గణేష్, జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.