అత్యంత ధనవంతుడైన అభ్యర్థి లోఢా
సాక్షి, ముంబై: కేవలం ముంబై, ఠాణే నగరాల్లోనే కాకుండా విదేశాల్లోనూ లోఢా గ్రూపు అధినేత మంగల్ప్రభాత్ వేల కోట్ల ఆస్తులను సంపాదించారు. ఐదేళ్ల కాలంలో ఏకంగా రె ండున్నర రేట్లు పెరిగిపోయాయి. మల్బార్ హిల్ శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీచేస్తున్న లోఢా ఆస్తులు 2009లో రూ.68 కోట్లు ఉండగా, ప్రస్తుతం అవి 200 కోట్లకుపైగా చేరుకున్నాయి. ఆయన ముంబైలో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా గుర్తింపు పొందారు. బీజేపీ తరుఫున బరిలో దిగిన లోఢా నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో రూ.34 కోట్లు ఆస్తులు, రూ.34 కోట్ల చిరాస్తులు, రూ. 7 కోట్లు అప్పు ఉన్నట్లు ప్రకటించారు.
ప్రస్తు తం నామినేషన్ పత్రాలు సమర్పించిన సమయం లో ఆయన అఫిడెవిట్ (ప్రతిజ్ఞ పత్రం)లో రూ. 61.50 కోట్లు ఆస్తులు ఉండగా ఇందులో తన భార్య వాటా రూ.31.75 కోట్లు ఉన్నాయి. రూ.6 కోట్ల విలువ చేసే మెర్సడిజ్ కారు, రూ. 7 కోట్లు విలువ చేసే నగలు ఉన్నట్లు పేర్కొన్నారు. లోఢా వద్ద ప్రస్తు తం రూ.137 కోట్లు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నా యి. ఇందులో మలబార్ హిల్లో రూ.97 కోట్లు విలువ చేసే స్థలం ఉంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.90 కోట్లు ఆప్పు లు ఉన్నాయి. ముఖ్యంగా కోటీశ్వరుడైన లోఢా వేయి రూపాయల విద్యుత్ బిల్లు, రూ.3,000 టెలిఫోన్ బిల్లు బకాయిలు ఉన్నట్లు తేలింది. గత ఐదేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ పెద్దమొత్తంలో ఆస్తులు సంపాదించారు.