మణికొండలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
హైదరాబాద్ నగర శివారులోని మణికొండ పంచాయతీ పోలింగ్ శనివారం ఉదయం 7.00 గంటలకు మొదలైంది. అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. అయితే తమ ఓటు హక్కు గల్లంతైందని ఓటర్లు ఆందోళనకు దిగారు. నేడు జరుగుతున్న మణికొండ పంచాయతీ సర్పంచి పదవికి ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఆ పంచాయతీలోని మొత్తం14 వార్డులకు 63 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 35 పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో విలీనం చేశారు. అయితే మణికొండ పంచాయతీకి పోలింగ్ అనివార్యం అయింది. మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ జరుగుతుంది.