షోకాజ్ నోటీసులపై స్పందించిన బీజేపీ ఎంపీ
రాంచీ: జార్ఖండ్ బీజేపీ తనకు షోకాజ్ నోటీసులు పంపించటం తనను చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా అన్నారు. ఇటీవల ఆయన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదని, పార్టీ క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొనటంలేదని జార్ఖండ్ బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వాటిపై బుధవారం జయంత్ సిన్హా స్పందిస్తూ జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరికి లేఖ రాశారు.‘‘జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరీ పంపిన షోకాజ్ నోటీసులు అందుకున్న నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అసలు తనను పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ర్యాలీలు, సంస్థాగత సమావేశాలకు కనీస ఆహ్వానం పంపలేదు. పార్టీ హజారీబాగ్ స్థానంలో మనీష్ జైశ్వాల్‌ను బరిలోకి దించుతున్నట్ల ప్రకంటించిన సమయంలో నా పూర్తి మద్దతు తెలియజేశా. మనీష్‌కు అభినందనలు తెలియజేశా. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటూ కొత్త అభ్యర్తికి మద్దతు ఇస్తానని తెలిపా. అయితే నేను ప్రచారంలో పాల్గొనాలని పార్టీ భావించి ఉంటే నాకు కచ్చితంగా సమాచారం అందించేది. జార్ఖండ్‌కు సంబంధించిన ఓ సీనియర్ గాని, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరూ నన్ను సంప్రదించలేదు. నాకు ఎటువంటి పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాలను పిలుపు రాలేదు’’ అని జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరి ఆధిత్య సాహుకు లేఖ ద్వారా తెలిజేశారు.My response to Shri Aditya Sahu ji’s letter sent on May 20, 2024 pic.twitter.com/WfGIIyTvdz— Jayant Sinha (Modi Ka Parivar) (@jayantsinha) May 22, 2024 ఇక.. జయంత్ సిన్హా మార్చిలోనే తాను 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని, ఎన్నికల విధుల నుంచి తనను తప్పించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అనంతరమే తాను ప్రాతినిధ్యంలో వహిస్తున్న హజారీబాగ్ పార్లమెంట్ స్థానంలో మనీష్ జైశ్వాల్‌ను బీజేపీ బరిలోకి దించిన విషయం తెలిసిందే.