Manish Singh
-
సంచలనం సృష్టిస్తున్న శ్రద్ధా వాకర్ హత్య కేసుపై సినిమా!
ప్రియుడి ప్రేమ కోసం కన్నతల్లిదండ్రులనే కాదనుకుందా అమ్మాయి. అయినవాళ్లను కాదనుకునేంత పిచ్చిగా ప్రేమించినందుకు ఆమెకు జీవితమే లేకుండా చేశాడా ప్రియుడు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న శ్రద్ధా వాకర్ ఉదంతమిదీ! తాజాగా శ్రద్ధా హత్యా కేసును సినిమాగా తెరకెక్కించేందుకు ముందుకు వచ్చాడు బాలీవుడ్ దర్శకనిర్మాత మనీష్ సింగ్. ఇప్పటికే సినిమా పనులు ప్రారంభమయ్యాయని ప్రకటించాడు. పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తూ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న ప్రేమపిశాచాల గురించి సినిమాలో వివరిస్తానని స్పష్టం చేశాడు. బృందావన్ ఫిలింస్ బ్యానర్‌పై సినిమా నిర్మించనున్నట్లు తెలిపాడు. ఈ చిత్రానికి హు కిల్డ్ శ్రద్ధా వాకర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమాలో శ్రద్ధా పాత్రలో ఏ హీరోయిన్ నటిస్తుందో చూడాలి! శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు గురించి.. మూడేళ్ల క్రితం శ్రద్ధా వాకర్, అఫ్తాబ్ మధ్య పరిచయం ఏర్పడింది. ప్రేమించుకున్నారు, పెద్దలు ఒప్పుకోకపోవడంతో సహజీవనం మొదలుపెట్టారు. మే 18న శ్రద్ధ-అఫ్తాబ్‌ల మధ్య గొడవ జరిగింది. ఇంకెన్నాళ్లు సహజీవనం, పెళ్లి చేసుకుందామని పట్టు పట్టింది శ్రద్ధ. కుదరదన్నాడు, గొడవ పెద్దదైంది. శ్రద్ధ గొంతు నలిమి చంపాడు. శవాన్ని మాయం చేసేందుకు పథకం వేశాడు. పెద్ద ఫ్రిడ్జ్ కొని ఇంటికి తెచ్చాడు. శ్రద్ధ శవాన్ని 35 ముక్కలుగా కోసి కవర్లలో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. రోజూ కొన్ని అవయవాలు చొప్పున ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఆరు నెలల తర్వాత ఈ కేసు బయటపడింది. ఈ కేసులో నిందితుడు, శ్రద్ధా ప్రియుడు అఫ్తాబ్ నేరాన్ని అంగీకరించగా అతడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. చదవండి: శ్రద్ధా హత్య కేసు, అడవిని జల్లెడ పట్టిన పోలీసులు -
వెయిటర్ స్థాయి నుంచి ఒలింపిక్స్ వరకూ..
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాలు రెండు. ఒకరు రజత పతక విజేత పీవీ సింధు అయితే, మరొకరు రెజ్లర్ సాక్షి మాలిక్. ఈ రెండు పతకాలు భారత పరువును నిలబెట్టగా, తృటిలో పతకాన్ని కోల్పోయిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కూడా భారతీయుల మనసుల్ని గెలుచుకుంది. అయితే రియో రేస్ వాకింగ్‌లో ఆకట్టుకున్న భారత అథ్లెట్ మనీష్ సింగ్ రావత్ ప్రదర్శనను కూడా ఏమాత్రం తక్కువ అనలేం. రేస్ వాకింగ్ ఫైనల్లో భాగంగా 20 కిలో మీటర్ల వాకింగ్ ను ఒక గంటా 20 నిమిషాల 21 సెకెండ్లలో పూర్తి చేసి 13వ స్థానంలో నిలిచాడు. కాగా, ఇది కాంస్య పతకం సాధించే క్రమంలో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ నమోదు చేసిన సమయం కంటే నిమిషం తక్కువ. దీంతో పతకం సాధించాలనుకున్న మనీష్ ఆశలను ఆ నిమిషం మింగేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సాగర్ గ్రామానికి మనీష్ సింగ్ రావత్.. పేదరికంలోనే పుట్టాడు. దీనికి తోడు మనీష్ తండ్రి కూడా చిన్నతనంలోనే చనిపోవడంతో అతని కష్టాలకు అధికమయ్యాయి. దాంతో కుటుంబాన్ని పోషించడానికి వెయిటర్ అవతారం ఎత్తాడు. బద్రినాథ్‌లోని కృష్ణ హోటల్ వెయిటర్ గా తన జీవిత ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. అయితే అతని చిన్ననాటి కల మాత్రం రేస్ వాకర్‌గా సత్తాచాటాలనే. తన బలమైన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి తెల్లవారుజామునే నిద్రలేచి బద్రీనాథ్ రోడ్లపై ప్రాక్టీస్ చేసేవాడు. ఆ క్రమంలో అతని రేస్ వాక్‌ను చూసి రోడ్డుపై చాలా మంది నవ్వుకునే వారు. కానీ వాటిని ఏమీ లెక్క చేసేవాడు కాడు. వాకింగ్ చేయడంతో పాటు, వెయిటర్ గా డ్యూటీ చేయడమే తనకు తెలిసిన పనులు. అలా రేస్ వాక్ ను ప్రారంభించిన మనీష్ జాతీయ అథ్లెట్‌గా ఎదిగాడు. అనంతరం గతేడాది బీజింగ్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటుకుని రియోకు అర్హత సాధించాడు. ఒక వెయిటర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి రియో ఒలింపిక్స్ వరకూ వెళ్లిన మనీష్ జీవితం అందరికీ ఆదర్శమే కదా.