Manjunatha Gowda
-
‘అపెక్స్’ చైర్మన్ అరెస్ట్
మరో ఇద్దరిని కూడా 18కి పెరిగిన అరెస్ట్‌ల సంఖ్య డీసీసీ బ్యాంక్‌లో రూ. కోట్లు గోల్మాల్ వ్యవహారం వైద్య పరీక్షలకు తరలింపు శివమొగ్గ : డీసీసీ బ్యాంకు స్థానిక శాఖలో చోటు చేసుకున్న కోట్ల రూపాయల అవకతవకలకు సంబంధించి రాష్ర్ట అపెక్స్ బ్యాంకు చైర్మన్, శివమొగ్గ డీసీసీ బ్యాంకు అధ్యక్షుడు ఆర్ఎం. మంజునాథ గౌడను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డీసీఐబీ (జిల్లా నేర పరిశోధన విభాగం) ఇన్స్పెక్టర్ జైరాజ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఆయనతో పాటు డీసీసీబీ చీఫ్ మేనేజర్ నాగభూషణరావు, ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న కుంసి గ్రామానికి చెందిన బసప్పలను కూడా అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 18కి పెరిగింది. మంజునాథ గౌడ ఆరెస్టు శివమొగ్గ జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్ర సహకార రంగంలో సంచలనాన్ని సృష్టించింది. నకిలీ బంగారు నగలను తాకట్టుగా పెట్టి స్థానిక డీసీసీబీ శాఖలో రూ.62 కోట్ల వరకు పలువురు రుణం తీసుకున్నారు. రుణ మంజూరు విధి విధానాలను కూడా పట్టించుకోలేదని దర్యాప్తులో వెల్లడైంది. గత నెల 17న స్థానిక శాఖలో రూ.2.79 కోట్ల మేరకు అవతవకలు జరిగాయని బ్యాంకు జనరల్ మేనేజర్ దొడ్డపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్న సమయంలో భారీ కుంభకోణం బయట పడింది. మరింత లోతైన దర్యాప్తు కోసం ఇన్స్పెక్టర్ జైరాజ్ నాయకత్వంలో ప్రత్యేకృ బందాన్ని ఏర్పాటు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ప్రత్యేకృ బందం దర్యాప్తులో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. కాగా ఈ కుంభకోణంలో మంజునాథ గౌడ ప్రత్యక్ష పాత్ర ఉందని, ఆయనపై మోసం, వంచన, బ్యాంకు విశ్వాసానికి ద్రోహం లాంటి ఆరోపణలపై ఐపీసీ 420, 406, 408, 409, 134 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ కౌశలేంద్ర కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు. -
స్వామీజీ ముసుగులో పిల్లల అపహరణ
= పట్టుబడిన నిందితులు = పసిపాప స్వాధీనం చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : పసిపిల్లలను అపహరించి విక్రయిస్తున్న దొంగస్వామీజీ గుట్టు రట్టయింది. ఆశ్రమంపై గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించి దొంగస్వామీజీ, అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓ పసిపాపను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.... చిక్కబళ్లాపురం సమీపంలోని బాపనహళ్లి గ్రామం వద్ద శాప విమోచన పేరుతో ఓ ఆశ్రమాన్ని శ్రీనివాస గురూజీ నిర్వహిస్తున్నాడు. స్వామీజీ వద్ద మురళీ, రీనా, కుమారి శిష్యరికం చేస్తున్నారు. ఈ ముగ్గురూ ఆస్పత్రుల్లో సంచరిస్తూ పసిపిల్లలను అపహరించుకెళ్లి స్వామీజీకి అప్పగించేవారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా పసిపిల్లలను రూ. రెండు నుంచి రూ. నాలుగు లక్షల వరకు స్వామీజీ విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. విషయం తెలుసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మంజునాథగౌడ పథకం ప్రకారం స్వామీజీ వద్దకు గురువారం చేరుకుని తనకు ఓ పసిపాప కావాలని అడిగారు. ఇందుకు రూ. 2 లక్షలు, మూడు టన్నుల ఇనుము, వంద సిమెంట్ బస్తాలు ఇవ్వాలని స్వామీజీ అడిగాడు. ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు రాత్రికి పోలీసులతో సహా ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఓ పసిపాపను స్వామీజీ శిష్యులు తీసుకొచ్చి వారికి చూపించి, గురూజీ అడిగిన మొత్తం ఇవ్వాలని అడిగారు. అదే సమయంలో తాము పోలీసులమంటూ డీవైఎస్పీ దేవయ్య, సీఐ బాలాజీసింగ్, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నయాజ్బేగ్ తెలిపి, నిందితులను అదుపులో తీసుకున్నారు. పసిపాపను స్వాధీనం చేసుకుని నిందుతులపై శుక్రవారం కేసు నమోదు చేశారు.