టూరిజం హబ్‌గా నల్లమల
మన్ననూర్ (అచ్చంపేట): ప్రకృతి స హజమైన పర్యాటక ప్రాంతాలు, శైవక్షేత్రాలకు నిలయమైన నల్లమలను టూ రిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం శ్రీశైలం– హైదరాబాద్ ప్రధాన రహదారిలోని మన్ననూర్ చెరువుకొమ్ము లింగమయ్యస్వామి ఆలయ స మీపంలో రూ.14 కోట్ల నిధులతో నిర్మించిన హరిత టూరిజం రెస్టారెంట్ ను ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మె ల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ ప్రాంగణంలో ఆయన వి లేకరులతో మాట్లాడారు.
బోటులో పర్యటిస్తున్న మంత్రి
3,500 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న నల్లమల పరివాహక ప్రాంతంలో అనే క శైవక్షేత్రాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రా ల నుంచి కూడా ఈ ప్రాంతానికి పర్యాటకులు వస్తుంటారనే ఉద్దేశంతో ఇక్క డ పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం మన్ననూర్‌తోపాటు ఈగలపెంట సమీపంలోని ఆ క్టోపస్ వద్ద నిర్మించిన హోటళ్లు, విశ్రా ంతి గదులు, లిఫ్టు తదితరా లకు రూ. 50 కోట్లు ఖర్చు చేశామన్నా రు. నల్లమలలో టూరిజంకు పెద్దపీట వేయడంతోపాటు ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పి ంచేందుకు కృషిచేస్తామన్నారు. ఇప్పటి కే సోమశిల నుంచి శ్రీశైలానికి ఏసీ బోటు సౌకర్యం కల్పించామన్నారు.
500 ఎకరాల్లో ఇండస్ట్రీ కారిడార్
జిల్లాలో 500 ఎకరాల్లో ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు చేసిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అ భి వృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో సైనికులుగా పనిచేస్తామన్నా రు. టూరిస్టులకు అన్ని రకాల సౌకర్యా లు కల్పిస్తూ మర్యాదపూర్వకంగా ఉంటూ టూరిజం అభివృద్ధికి కృషిచేయా లని సూచించారు. ప్రభుత్వ విప్, ఎ మ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ వలసలు వాపస్ రావాలనే సీఎం కేసీఆర్ నినాదం ప్రస్తుతం పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందన్నారు. అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. ఇందులో భాగంగానే అన్నిరంగాల్లో వెనుకబడిన నల్లమలలో టూరిజం హబ్‌తోపాటు అమ్రాబాద్‌కు సాగునీరు అందించేందుకు రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామన్నారు.
ఈ ప్రాంతాన్ని వ్యవసాయ పరంగా సస్యశ్యామలం చేసి ప్రజలు, ముఖ్యంగా రైతుల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. సీఎంతోపాటు యువనేత కేటీఆర్, కేబినెట్లో ఉన్న ఉద్యమ నాయకుల స హకారంతో అచ్చంపేటను మరో సి ద్ధిపేటగా తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్ప ర్సన్ పద్మావతి, కలెక్టర్ శ్రీధర్, ఆర్డీఓ పాండు, డీఎంహెచ్ఓ సుధాకర్లాల్, టూరిజం ఎండీ మనోహర్, తిరుపతిరె డ్డి, ఎంపీడీఓ శంకర్, సర్పంచ్ శ్రీరాం, జెడ్పీటీసీ సభ్యుడు రాంబాబు, ఎంపీ పీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ ప్రణీత, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులు, బా లమ్మ, నాయకులు రవీందర్‌రెడ్డి, న ర్సింహగౌడ్, రాజేందర్, సతీష్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.