Mansa district
-
28 ఏళ్లకే కొడుకును విగ్రహంగా చూసి తండ్రి కన్నీటి పర్యంతం
చండీగఢ్: సిద్ధూ మూసేవాలా తండ్రి కొడుకును తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మే 29న దారుణ సిద్ధూ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ తండ్రి బాల్కౌర్ సింగ్ ఆవిష్కరించి వెక్కి వెక్కి ఏడ్చారు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. 28 ఏళ్లకే కొడుకును విగ్రహం రూపంలో చూడాల్సి వస్తుందని అనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలాకు గుర్తుగా ఆయన అభిమానులు 6.5 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు. సిద్ధూ అంత్యక్రియలు జరిగిన మాన్సా జిల్లాలోని మూసా గ్రామంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి సిద్ధూ తల్లిదండ్రులు బాల్కౌర్ సింగ్, చరణ్ కౌర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కుమారుడ్ని విగ్రహం రూపంలో చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి సిద్ధూ అభిమానులు భారీగా తరలివచ్చారు. Sidhu Moosewala’s parents got emotional while they were installing statue of their son where he got cremated #SidhuMooseWala pic.twitter.com/4qdlmXGWKn — Gagandeep Singh (@Gagan4344) July 17, 2022 విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బాల్కౌర్ సింగ్ మాట్లాడారు. తన కుమారుడ్ని హత్య చేసిన వారు దేశ, విదేశాల్లో ఎక్కడ తలదాచుకున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిద్ధూను చంపామని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తికి ప్రభుత్వం భద్రత కల్పించడమేంటని మండిపడ్డారు. మే 29న సిద్ధూను ఓ వాహనంలో వెంబడించిన దుండగులు అతనిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. ఘటన జరిగి సరిగ్గా 50 రోజులవుతున్న సమయంలోనే అభిమానులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం గమనార్హం. చదవండి: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ.. -
పంజాబ్ లో కిరాతకం
ఘరంగ్నా: పంజాబ్ లో దళిత యువకుడి హత్య సంచలనం రేపింది. మాన్ సా జిల్లాలోని ఘరంగ్నా గ్రామంలో సుఖచైన్ సింగ్ పాలి(22) అనే దళిత యువకుడు సోమవారం రాత్రి హత్యకు గురయ్యాడు. దుండగులు అతడి ఎడమ కాలును నరికేసి పట్టుకుపోయారు. మృతదేహాన్ని మాన్ సా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఎడమ కాలు దొరికేవరకు, నిందితులను అరెస్ట్ చేసే వరకు మృతదేహాన్ని ఖననం చేయబోమని సుఖచైన్ సింగ్ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం వ్యాపారంలో తలెత్తిన గొడవలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. సోమవారం రాత్రి గ్రామానికి తిరిగొస్తుండగా తన కొడుకుపై అగ్రకులానికి చెందిన వారు దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుఖచైన్ సింగ్ తండ్రి రేష్మమ్ సింగ్ ఆరోపించారు. ఆమన్ దీప్ సింగ్, బల్బీర్, సీతా సింగ్, బాబ్రీఖ్ సింగ్, హరదీప్ సింగ్, సాధు సింగ్ లపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు మాన్ సా ఎస్ ఎస్ పీ ముఖ్విందర్ సింగ్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.